Brahmamudi Promo: రాజ్, కావ్య మధ్య విభేదాలు - అప్పును ప్రేమిస్తోన్నట్లు చెప్పిన కళ్యాణ్ - రిషిని కనిపెట్టిన వసు
Brahmamudi Promo: కళ్యాణ్, అప్పు పెళ్లి విషయంలో రాజ్‌తో కావ్య గొడవపడినట్లుగా బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. తానే రిషి అనే సంగతిని ప్రేమ జ్ఞాపకం ద్వారా రంగా బయటపెట్టినట్లుగా గుప్పెడంత మనసు ప్రోమోలో కనిపిస్తోంది.
Brahmamudi Promo: కళ్యాణ్ తో అప్పు పెళ్లి జరిపించాలని కావ్య ప్రయత్నాలు చేస్తోందని ధాన్యలక్ష్మికి అబద్దాలు నూరిపోస్తుంది రుద్రాణి. ఆమె మాటలు నిజమని నమ్మిన ధాన్యలక్ష్మి కావ్య తో గొడవకు దిగుతుంది. అప్పుకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైన సంగతి కావ్య బయటపెడుతుంది.
పెళ్లి డేట్ కూడా పెట్టుకున్నామనే నిజం ధాన్యలక్ష్మికి చెబుతుంది. కళ్యాణ్‌ను రెండో పెళ్లికి తానే ఒప్పిస్తానని ధాన్యలక్ష్మికి మాటిస్తుంది కావ్య. అప్పుతో కాకుండా మీరు చూపించిన అమ్మాయితోనే మీ కొడుకు పెళ్లి జరుగుతుందని చెప్పి ధాన్యలక్ష్మి మనసులో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇస్తుంది.
భార్యకు రాజ్ క్లాస్...
కళ్యాణ్ ను పెళ్లికి ఒప్పిస్తానని కావ్య మాటివ్వడం రాజ్ సహించలేకపోతాడు. భార్యపై ఫైర్ అవుతాడు. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ఆ విషయం తెలుసుకోకుండా ఎలా మాటిస్తావని కావ్యకు రాజ్ క్లాస్ ఇస్తాడు. అప్పు పెళ్లి జరిగితే కళ్యాణ్ మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోతాడని రాజ్ అంటాడు. రాజ్ చెప్పిన మాటలు నిజమో కాదో తానే స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటుంది కావ్య.
అప్పును ప్రేమిస్తున్నది నిజమేనా అని కళ్యాణ్‌ను అడుగుతుంది కావ్య. అప్పును పెళ్లిచేసుకుంటానని రాజ్‌తో నువ్వు చెప్పావా అని కళ్యాణ్‌ను ప్రశ్నిస్తుంది. అప్పు తనను ప్రేమించడం లేదని భ్రమపడిన కళ్యాణ్ తమ ప్రేమ విషయం మనసులోనే దాచుకుంటాడు. అప్పును ప్రేమించడం లేదని కావ్యతో అబద్ధం ఆడుతాడు.
దుగ్గిరాల ఫ్యామిలీ షాక్...
కళ్యాణ్ మనసులో అప్పు ఉందనే నిజం కుటుంబసభ్యులందరి ముందు రాజ్ బయటపెడతాడు. కళ్యాణ్‌కు అప్పును ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నట్లు చెబుతాడు. అతడి మాటలు విని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాకవుతారు. అప్పును కళ్యాణ్ ఇష్టపడటం లేదని, ఆ విషయం అతడే స్వయంగా తనతో చెప్పాడని కావ్య అంటుంది. మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా అంటూ కళ్యాణ్‌తో గొడవకు దిగుతుంది.
నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు...నువ్వు అప్పును ప్రేమించలేదా...ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకోలేదా అని తమ్ముడిని రాజ్ అడుగుతాడు. కావ్య కూడా సమాధానం చెప్పమని కళ్యాణ్‌ను నిలదీస్తుంది.
ఇప్పుడు నీ మనసులో అప్పు ఉండటం ఏంటి? దాన్ని నువ్వు పెళ్లిచేసుకోవడం ఏంటి అని కొడుకుపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. అందరూ అడగటంతో అప్పుతో తన ప్రేమను కళ్యాణ్ బయటపెట్టనున్నట్లు బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో కనిపిస్తోంది.
రంగానే రిషి…
రిషిగా నాటకం ఆడటానికి రంగాను ఒప్పిస్తాడు శైలేంద్ర. రంగా ద్వారా డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీట్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. నానమ్మ ఆపరేషన్ కోసం డబ్బు అవసరం కావడంతో రంగా కూడా శైలేంద్ర డీల్‌కు ఒప్పుకుంటాడు. రిషిగా నాటకం ఆడుతూనే శైలేంద్రకు అతడు షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది.
తానే రిషి అనే నిజాన్ని ఉంగరం ద్వారా వసుధారకు తెలిసేలా చేస్తాడు రిషి. తాను కాలేజీని సేవ్ చేయడానికి వెళుతున్నట్లు హింట్ ఇస్తాడు. రిషి ఇచ్చిన హింట్‌తో అతడు ఎక్కడికి వెళ్లింది వసుధారకు క్లారిటీ వస్తుంది. రిషిని వెతుక్కుంటూ ఆమె కూడా మహేంద్ర దగ్గరకు వస్తుంది.
మను అన్వేషణ…
మరోవైపు తన కన్న తండ్రి మహేంద్ర అనే అనుమానం మనుకు వస్తుంది. అది నిజమా కాదా అన్నది అనుపమ చెప్పకపోవడంతో తానే సమాధానం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతడి అన్వేషణలో నిజం బయటపడిందా? తండ్రిపై ద్వేషంతో మహేంద్రను మను ఏం చేశాడన్నది గుప్పెడంత మనసు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే.