Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు - శైలేంద్రను బోల్తా కొట్టించిన రౌడీలు - వసుధారను కాపాడిన రంగా
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 23 ఎపిసోడ్‌లో రంగా గురించి ఎంక్వైరీ చేయాలని అతడి ఇంటికివస్తాడు శైలేంద్ర. వసుధార అతడి కంట పడకుండా ఆమెను ఇంటిలోపల రంగా దాచిపెడతాడు.
Guppedantha Manasu Serial: సరోజ బావగా రిషినే రంగా అనే మారుపేరుతో పల్లెటూరిలో ఉంటున్నాడని దేవయాని అనుమానపడుతుంది. అతడు నిజంగానే రంగానా లేదంటే మారువేశంలో ఉన్న రిషినా తెలుసుకునే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తుంది. రిషి రాకుండా రంగా అయితే కాలేజీని తమ సొంతం చేసుకోవడానికి అతడిని ఓ పావుగా వాడుకోవాలని దేవయాని ఫిక్సవుతుంంది.

రంగా గురించి ఎంక్వైరీ చేస్తూ ఊళ్లోకి వచ్చిన శైలేంద్రకు వసుధార కనిపిస్తుంది. వసుధార ప్రాణాలతో ఉండటం చూసి శైలేంద్ర షాకవుతాడు. ఆమెను కలవడానికి వచ్చేలోపు రౌడీలను చూసి వసుధార అక్కడి నుంచి పారిపోతుంది.
రౌడీల నుంచి ఎస్కేప్...
టీస్టాల్ దగ్గర వసుధారను చూసిన రౌడీలు ఆమె వెంటపడతారు. కానీ తెలివిగా వారి నుంచి వసుధార తప్పించుకుంటుంది. వసుధారను నిజంగానే రౌడీ పాండు చంపాడా? లేదంటే తనతో అబద్ధం చెప్పాడో తెలియక శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ విషయాన్ని పాండునే అడిగి క్లారిటీ తీసుకోవాలని కాల్ చేస్తాడు. శైలేంద్రకు తాను కాకినాడలో ఉన్నట్లు పాండు అబద్ధమాడతాడు.
ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా ఎదురుగా వస్తోన్న శైలేంద్రను గుద్దుకుంటాడు పాండు. శైలేంద్రను చూసిపాండు షాకవుతాడు. ఇదేనా నువ్వు చెప్పిన కాకినాడ అంటూ పాండుకు శైలేంద్ర క్లాస్ పీకుతాడు. శైలేంద్రపైనే రివర్స్ అవుతాడు పాండు. చీటికి మాటికి నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావని కోప్పడుతాడు.
పోలీసులకు లొంగిపోదాం...
నువ్వు వసుధారను చంపలేదు కదా అంటూ పాండు కాలర్ పట్టుకొని ఆవేశంగా అడుగుతాడు శైలేంద్ర. వసుధారను గోతిలో పాతిపెట్టి చాలా రోజులైందని పాండు అంటాడు. వారి మాటలను శైలేంద్ర నమ్మడు.
అయితే వసుధార పాతిపెట్టిన చోటుకు వెళ్లి గొయ్యి తిరిగి తవ్వి ఆమె అస్తికలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇద్దరం లొంగిపోదామని, పోలీసులే అది వసుధార శవమో కాదో తేల్చుతారని పాండు రివర్స్ ఎటాక్ మొదలుపెడతాడు. చనిపోయిన అమ్మాయి ఎలా బతికి వస్తుంది మీ భ్రమ శైలేంద్ర మాటల్ని కొట్టిపడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు పాండు.
శైలేంద్ర ఎంక్వైరీ...
పాండు ఎంత కన్వీన్స్ చేసినా అతడి మాటల్ని శైలేంద్ర నమ్మడు. వసుధార ఫొటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా అని టీస్టాల్ ఓనర్‌ను అడుగుతాడు. కానీ పక్కనే పాండు ఉండటంతో శైలేంద్ర షాకవుతాడు. నా మాటలు నమ్మకుండా నన్ను అవమానిస్తున్నారంటూ పాండు కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఈ అవమానం భరించడం కంటే మీ చేతిలో చనిపోవడమే మేలని పాండు సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు పాండు. రౌడీ సెంటిమెంట్‌కు శైలేంద్ర కరిగిపోతాడు. వసుధారను అతడు చంపింది నిజమేనని శైలేంద్ర నమ్ముతాడు. మీరు వసుధార ఫొటో చూపించి ఊరిలో ఎవరిని ఎంక్వైరీ చేయనని నాకు మాటివ్వమని శైలేంద్రను అడుగుతాడు పాండు. అతడు చెప్పినట్లే మాటిస్తాడు.
రంగా ప్లాన్...
ఆ తర్వాత రంగా అడ్రెస్ వెతుక్కుంటూ అతడి ఇంటికొస్తాడు శైలేంద్ర. అది రంగా కనిపెడతాడు. ఆటో శుభ్రం చేస్తోన్న రంగా కావాలనే వసుధారపై నీళ్లు పోస్తాడు. చూసుకోకుండా నీళ్లు పోశానని, మీ బట్టలు తడిచిపోయాయి కాబట్టి లోపలికి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకోమనిఆమెను కంగారుగా లోపలికి పంపిస్తాడు. వసుధార లోపలికి వెళ్లగానే తలుపు మూసి గడియ పెడతాడు. శైలేంద్ర కంట వసుధార పడకుండా రంగా ఆమెను దాచిపెడతాడు.
సరోజ గురించి ఆరాాలు..
రంగా దగ్గరకు వస్తాడు శైలేంద్ర.సరోజ గురించి నీతో మాట్లాడాలని కొంచెం మాట్లాడటానికి వచ్చానని అబద్ధం ఆడుతాడు. సరోజను తాను ప్రేమించడం లేదని ఇదివరకే చెప్పానని, ఎంక్వైరీలు చేయడానికి లిమిట్ ఉంటుందని, ఇలా ఇంటికి రావడం బాలేదని శైలేంద్రతో అంటాడు రంగా.
సరోజను ధన్‌రాజ్ కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకున్నాడని, కానీ కుదరలేదని, వాటి గురించి కనుక్కోవడానికే నేను వచ్చానంటూ రంగాను మాటల్లో పెట్టి అతడు రిషినో కాదో కనిపెట్టాలని శైలేంద్ర అనుకుంటాడు. సరోజ గుణగణాల గురించి రంగాను అడుగుతాడు శైలేంద్ర. నా మరదలు బంగారం అంటూ రిషి బదులిస్తాడు.
వసుధార అనుమానం...
వసుధార డోర్ తీసి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ బయటి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపును గట్టిగా కొడుకుతుంది. ఆ విషయం గ్రహించిన రంగా... సరోజ వాళ్ల ఇంటికి వెళదామని శైలేంద్రను బయటకు తీసుకెళతాడు. రంగాతో మాట్లాడుతుంది శైలేంద్ర అని వసుధార గ్రహిస్తుంది.
రంగా తనను లోపలికి పంపించి ఎందుకు గడియ పెట్టాడా అని ఆలోచిస్తుంటుంది. రాధమ్మ వచ్చి డోర్ గడియ తీస్తుంది. అక్కడ రంగా, శైలేంద్ర ఇద్దరు కనిపించరు. సరోజ ఇంటికి ఇద్దరు బయలుదేరారని తెలిసి తాను కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.