Guppedantha Manasu Serial: రంగాతో శైలేంద్ర డీల్ - రిషి ప్రేమజ్ఞాపకాన్ని పొగొట్టుకున్న వసు - దేవయాని ప్రస్టేషన్
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 26 ఎపిసోడ్‌లోఎండీ సీట్ కోసం రంగాతో శైలేంద్ర డీల్ కుదుర్చుకుంటాడు. తనను ఎండీ సీట్‌లో కూర్బోబెడితే నీకు ఐదు కోట్లు ఇస్టానని రంగాకు ఆఫర్ ఇస్తాడు శైలేంద్ర. అతడి ఆఫర్‌కు రంగా ఒప్పుకుంటాడు.
Guppedantha Manasu Serial: రంగాను కలుస్తాడు శైలేంద్ర. రిషి ఫొటో చూపించి నువ్వు వేరు. నీ పోలికలతో ఈ ఫొటోలో ఉన్నతడు వేరు అని అంటాడు. ఈ ఫొటోలో ఉన్నది నా తమ్ముడు రిషి అని చెబుతాడు. రిషి డీబీఎస్‌టీ కాలేజీకి వారసుడు, ఎంతో మంది పేద విద్యార్థులకు దేవుడు. నా తమ్ముడు గురించి, అతడు చేసిన మంచి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. రాయాలంటే పుస్తకాలు సరిపోవు అంటూ రిషి గురించి రంగాకు గొప్పగా చెబుతాడు శైలేంద్ర.
దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు...
రిషి గురించి గొప్పలు వింటుంటే అతడిని చూడాలని అనిపిస్తుందని శైలేంద్రతో అంటాడు రంగా. రిషి లేడని, తమ్ముడు చేసిన మంచిని దేవుడు కూడా చూడలేకపోయాడని, అతడిని తన దగ్గరకు తీసుకెళ్లాడని శైలేంద్ర బదులిస్తాడు. రిషి చనిపోయాడని శైలేంద్ర చెప్పిన మాట వినగానే రంగా షాకవుతాడు. నువ్వు నా తమ్ముడు రిషిలా నటించాలని మనసులో ఉన్న అసలు మాటను బయటపెట్టేస్తాడు శైలేంద్ర.
కాలేజీ మా చేతుల నుండి చేజారిపోతుందని,ఎంతో మంది స్టూడెంట్స్ రిషి కోసం ఎదురుచూస్తున్నారని, కొడుకు పోయాడన్న బాధతో మా బాబాయ్ పచ్చిమంచినీళ్లు కూడా ముట్టడం లేదని రంగాను బతిమిలాడుతాడు శైలేంద్ర. నువ్వు నాతో పాటు వస్తే కాలేజీ ఎండీ మాధ్యతలు మళ్లీ నీకు అప్పగిస్తారని రంగాకు చెబుతాడు శైలేంద్ర.
నన్ను ఎండీగా ప్రకటించాలి...
తాను ఆటోడ్రైవర్‌నని, ఎండీ బాధ్యతలు చేపట్టాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలని శైలేంద్రతో చెబుతాడు రంగా. నేను మీ తమ్ముడిలా ఉన్నాను కాన అతడిలా మారిపోవడం అంటే కష్టమని రంగా అంటాడు.
ఎండీ సీట్‌లో కూర్చోవడానికి ఒప్పుకోకపోతేరిషిలా మా కాలేజీకి వచ్చి నాకు ఎండీ బాధ్యతలు ఇవ్వమని అక్కడి వారందరితో చెప్పమని అసలు ప్లాన్‌ను శైలేంద్ర వెల్లడిస్తాడు. ఊరికే ఈ పనిచేయనవరం లేదని, నన్ను ఎండీని చేస్తే నీకు ఐదు కోట్లు ఇస్తానని రంగాకతో అంటాడు శైలేంద్ర.
అతడి ఆఫర్‌ను రంగా రిజెక్ట్ చేస్తాడు. రంగా డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాదని, నా స్వార్థం కోసం ఎవరిని మోసం చేయనని అంటాడు. నీకున్న అప్పులు తీరాలి...మీ నానమ్మ ఆపరేషన్ జరగాలంటే నీకు డబ్బులు కావాలి. ఈ ఆఫర్‌కు నువ్వు ఒప్పుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి. నలభై గంటలే నాకుగడువు ఉంది. ఆ లోపు నీ నిర్ణయం ఏమిటన్నది చెప్పమని రంగాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర.
మరోవైపు రంగాను శైలేంద్ర బతిమిలాడటం రౌడీ పాండుతో పాటు అతడి గ్యాంగ్ చూస్తారు. వసుధారను చంపమని తమకు డీల్ ఇచ్చి ఆమెను కాపాడిన రంగాను శైలేంద్ర బతిమిలాడటం చూసి ఫైర్ అవుతారు. శైలేంద్ర తమతో డబుల్ గేమ్ ఆడుతున్నాడని భ్రమపడతారు.
దేవయాని ప్రస్టేషన్...
ఎండీ సీట్ కోసం రంగాకు ఐదు కోట్లు ఇస్తానన్న విషయం తల్లికి చెబుతాడు శైలేంద్ర. ఆటో డ్రైవర్‌కు ఐదు కోట్లు ఇవ్వడం ఏమిటని కొడుకుపై ఫైర్ అవుతాడు. ఎన్ని ప్లాన్‌లు వేసిన కాలేజీ మనకు దక్కడం లేదని, మన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాడని ఆవేదనకు లోనవుతుంది దేవయాని. కాలేజీ దక్కించుకోవడం కోసం ఇప్పటివరకు చేసిన కుట్రలన్నింటిని కొడుకుతో చెబుతుంది దేవయాని.
జగతి, వసుధారతో పాటు రిషికి చేసిన అన్యాయం గురించి బయటపెడుతుంది. కాలేజీ మనకు దక్కాలంటే రిషి రావాలని మినిస్టర్ అన్నాడు. రంగాను రిషిగా మార్చుదామంటే వాడు ఒప్పుకోవడం లేదని టెన్షన్ పడుతుంది. మనం అనుభవించాల్సిన పేరుప్రఖ్యాతులు, పదవులు ఇన్నాళ్లు పరుల పాలయ్యాయి.
ఇప్పుడు ఏకంగా కాలేజీ గవర్నమెంట్ సొంతమవుతుందని బాధపడుతుంది. అలా ఏం జరగదని, రంగా తప్పకుండా మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడని శైలేంద్ర అంటాడు. మన డీల్‌కు తప్పకుండా ఒప్పుకుంటాడని అంటాడు.
రంగా ఆలోచనలు...
శైలేంద్ర ఇచ్చిన ఆఫర్ గురించి రంగా ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వసుధార వస్తుంది. ఆమెను కోపంగా చూస్తాడు రంగా. ఏమైందని వసుధార అడుగుతుంది. సాకులు వెతుక్కొని పారిపోయేవాళ్లను చూస్తే నాకు కోపం వస్తుందని రంగా బదులిస్తాడు. నన్నే అంటున్నారా అని వసుధార అడుగుతుంది.
నాకు తెలిసిన వాళ్లు, నా మనసుకు బాగా కావాల్సిన వాళ్లు తప్పులు చేశారని, వాళ్ల మీద కోపం వచ్చింది. మీలో ఆ మనిషిని ఊహించుకొని మీవైపు కోపంగా చూశానని రంగా చెబుతాడు.
వసుధార స్వార్థం...
నా నోటితో నేను రిషి అని చెప్పాంచాలని మీరు చూస్తున్నారు. కానీ మీ కాలేజీ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది అన్నది మీరు పట్టించుకోరు. స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి అసలు ఆలోచించరు. మీ మావయ్య వాళ్లు ఏమైపోయారన్నది మీకు అవసరం లేదని వసుధారపై ఫైర్ అవుతాడు రంగా. మీరు చాలా స్వార్థంతో ఆలోచిస్తున్నారని క్లాస్ ఇస్తాడు.
ఇంకా క్లారిటీ లేదు...
మీరు నన్ను రిషి అని నమ్మినప్పుడు మీ వాళ్లకు నేను ఇక్కడే ఉన్నానని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని వసుధారను అడుగుతాడు రంగా. నేనే రిషి అని మీకు ఇంకా క్లారిటీ రాలేదు. అందుకే మీరు మీ వాళ్లను ఇక్కడికి తీసుకురాలేకపోతున్నానని వసుధార అంటాడు రంగా.
నేనే రిషి అని మీరు నమ్మితే నిరూపించుకోవడానికి చాలా అవకాశాలువస్తాయని వసుధారతో అంటాడు రంగా. కానీ ఒక్కసారి కాలేజీ చేజారిపోతే తిరిగి దానిని దక్కించుకోవడం సాధ్యం కాదని చెబుతాడు.మీ భర్త మీపై ఎంతో నమ్మకంతో అప్పగించిన కాలేజీని వెంటనే వెళ్లి కాపాడుకోమని వసుధారకు రంగా సలహా ఇస్తాడు.
రిషి లేకుండా తాను తిరిగి వెళ్లనని వసుధార అంటుంది. మీరు నాతో వస్తేనే వెళతానని అంటుంది. కష్టాల్లో ఉంటే రిషి తనకు సహాయం చేస్తాడని వసుధార చెబుతుంది. నేను మీ రిషిని కాదు కాబట్టిఎలాంటి సాయం చేయలేనని రంగా బదులిస్తాడు.
రింగ్ మిస్...వసుధార టెన్షన్...
రిషి ప్రేమకు గుర్తుగా వసుధార వేలికి ఉన్న ఉంగరం మిస్సవుతుంది. ఆ రింగ్ కోసం వెతుకుతూ వసుధార టెన్షన్ పడుతుంది. రింగ్ తప్పకుండా దొరుకుతుందని, కంగారు పడొద్దని వసుధారకు ధైర్యం చెబుతుంది రాధమ్మ. ఆ రింగ్ కనిపించకుండాపోయిందంటే రిషికి ఏదైనా ఆపద జరగుతుండొచ్చని, అతడు మళ్లీ నాకు దూరం కావచ్చునని అని వసుధార కంగారు పడుతుంది.
ఓ అర్జెంట్ పని ఉందని బుజ్జిని తీసుకొని రాత్రి బయటకు వెళ్లిన రంగా ఇంకా ఇంటికి రాలేదని తెలిసి వసుధార భయం మరింత పెరుగుతుంది. రంగాను ఎవరూ ఏం చేయలేరని, ఎంత మంది రౌడీలు వచ్చినా రంగా కాలి గోటిని కూడా తాకలేరని రాధమ్మ చెబుతుంది. రంగా ఓ బాక్స్ నీకు ఇవ్వమన్నాడని చెప్పి వసుధారకు రాధమ్మ ఇస్తుంది. ఆ బాక్స్ ప్యాక్ చేసి ఉంటుంది.
శైలేంద్ర డీల్‌కు ఒప్పుకున్న రంగా...
రంగా డైరెక్ట్‌గా వచ్చి శైలేంద్రను కలుస్తాడు. ఆ ఆఫర్ గురించి ఇంకా రంగా ఆలోచించడం చూసి అతడిని బతిమిలాడుతాడు శైలేంద్ర. నీ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని, ఓ కుటుంబం సంతోషిస్తుందని మంచి మాటలతో తన డీల్ ఒప్పుకునేలా చేస్తాడు. చివరకు శైలేంద్ర డీల్‌కు రంగా ఒప్పుకుంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.