Brahmamudi June 1st Episode: బ్రహ్మముడి- రాజ్ గదిలో పడుకునేందుకు మాయ డ్రామా- నాలుక చీరేస్తానన్న అత్త- అమ్మమ్మ వార్నింగ్
Brahmamudi Serial June 1st Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 1వ తేది ఎపిసోడ్‌లో రాజ్ గదిలో పడుకునేందుకు దొంగ మాయ డ్రామా చేస్తుంది. దాంతో పళ్లు రాలగొడతానని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అపర్ణను అత్తయ్య అని పిలిచిన మాయకు ధమ్కీ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కావ్యపై కోపం చూపిస్తుంది ఇందిరాదేవి. నీ దారి నువ్ చూసుకుంటావని అర్థమైంది. ఇన్నాళ్లు చెడు అలవాట్లు అంటే మందు తాగడం, చెడు సావాసం అనుకున్నా. కానీ, ఒక మనిషిపై బాగా నమ్మకం పెట్టుకోవడం కూడా చెడు వ్యసనమే. ప్రతి విషయంలోనూ అలవాటు పడిపోయావ్. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఏమైనా జ్ఞాపకాలతో బతికేస్తాను అని ఇందిరాదేవి అంటుంది.
చాలా కోపంగా ఉంది
ఇంట్లో సమస్య దూరం చేసేందుకు మాయను తీసుకొచ్చాను. కానీ, అది దొంగ మాయ అని తెలీదు. నేనే తప్పు చేశాను. ఆ తప్పును సరిదిద్దు కోవాలి. ఆ మాయ అసలు మాయ కాదని చెప్పలేను అని కావ్య అంటుంది. నేను అంటున్న మౌనంగా ఉన్నావంటేనే అర్థమవుతోంది. నీ దారి నువ్ చూసుకున్నావ్ అన్నమాట. నువ్ నాతో ఏం మాట్లాడకు. నీపై నాకు చాలా కోపంగా ఉంది. ఆ కోపంలో నిన్ను ఏమైనా అంటానేమో అని భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కోప్పడుతుంది ఇందిరాదేవి.
కావ్య వెళ్లిపోతుంది. న్యాయం చేయాలంటే పెద్దరికం అడ్డొస్తుంది. నీవైపు నిలబడదామంటే నువ్వే అడ్డుపడుతున్నావ్. నా కాళ్లకు ఇలా బంధం వేశావేంటీ కావ్య అని బాధపడుతుంది ఇందిరాదేవి. మరోవైపు షాప్ ఆవిడ చెప్పిన అడ్రస్‌కు వెళ్తుంది అప్పు. వెళ్లి తలుపు తడుతుంది. మాయ ఫ్రెండ్ తలుపు తీస్తుంది. మాయ ఎక్కడికి వెళ్లింది అని అప్పు అడుగుతుంది. ఊరిలోనే లేదు అని ఆమె చెబుతుంది. ఎక్కడికి వెళ్లింది అని అప్పు అడిగితే.. తెలియని వాళ్లకు నేను ఎలా చెబుతాను అని ఆమె అంటుంది.
దెప్పి పొడిచిన రుద్రాణి
నా ఫ్రెండే, ఫోన్ నెంబర్ కూడా కలవట్లేదు, కొత్త నెంబర్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది అప్పు. చూడండి. మీరు నాకు తెలియదు. మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి. ఇలా మోసం చేసేవాళ్లు చాలా మంది వస్తున్నారు. మిమ్మల్ని నమ్మి నెంబర్ ఎలా ఇవ్వను అని ఆమె అంటుంది. అమ్మాయిలం కదా ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే మాయ ఎప్పుడు వస్తుందని అడిగితే రేపు అని చెబుతుంది ఆమె. సరే నా నెంబర్ ఇస్తాను. మాయ వచ్చాకా నాకు కాల్ చేయమని చెబుతుంది అప్పు.
తర్వాత మీ పేరు ఏంటని అడిగితే సాహితి అని చెబుతుంది ఆమె. తర్వాత అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు కిచెన్‌లో ఆలోచిస్తుంటుంది కావ్య. రుద్రాణి, దొంగ మాయ వస్తారు. ఎవరో మనతో ఛాలెంజ్ చేశారు. ఆట నీది గెలుపు నాది అని స్లోగన్స్ చెప్పారు. కానీ, ఇప్పుడు ఓటమిని ఒప్పుకుంటూ సంతకం పెట్టారు అని రుద్రాణి, మాయ దెప్పి పొడుస్తుంటారు. ఇప్పటికైనా అర్థమైందా ఈ రుద్రాణి అంటే.. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు. నాపై గెలవడం అని రుద్రాణి అంటుంది.
పిట్ట కథ చెప్పిన కావ్య
ఇప్పుడేమైనా ఛాలెంజ్ చేస్తుందేమో అడగండి. గెలిచి చూపిద్దాం అని మాయ అంటుంది. ఇంతలో అప్పు కాల్ చేసి మాయ అడ్రస్ దొరికిందని చెబుతుంది. సైలెంట్‌గా ఉన్న కావ్యతో ఇంత మంచి గుడ్ న్యూస్ చెబితే సైలెంట్‌గా ఉంటావేంటీ అని అప్పు అడుగుతుంది. ఎంగిలి విస్తరాకు ఎంత ఎగిరిపిడిన చేరుకోవాల్సింది చెత్తలోకే అని కావ్య అంటుంది. తర్వాత అసలు మాయ ఉదయం రావడం గురించి చెబుతుంది అప్పు. సరే రేపు ఉదయాన్నే వెళదామని అంటుంది కావ్య
ఎక్కడికో అని రుద్రాణి అడిగితే.. గుడికి వెళ్లి దండం పెట్టుకుందామని మాయ అంటుంది. దాంతో ఓ పిట్ట కథ చెబుతానని వేటగాడు, రెండు గుంటనక్కల స్టోరీ చెబుతుంది కావ్య. వేటగాడు ఎంత బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న గుంట నక్కలు ఓవరాక్షన్ చేయకూడదని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. అమ్మో కావ్యతో జాగ్రత్తగా ఉండాలని మాయ అంటుంది. ఇది ఇంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని రుద్రాణి అనుకుంటుంది.
రాజ్ గదిలో పడుకునేందుకు
కట్ చేస్తే.. హాల్లో అంతా ఉంటే.. మాయ లగేజ్ పట్టుకుని వస్తుంది. మాయ వెళ్లిపోతుంది. సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామా అని స్వప్న అంటుంది. నేను వెళ్తున్నానని ఎవరన్నారని మాయ అంటే.. మరి సూట్ కేస్ పట్టుకుని టాయ్ లెట్‌కు వెళ్తున్నావా అని స్వప్న అంటుంది. మరి సూట్ కేస్ పట్టుకుని ఎక్కడికీ వెళ్తున్నట్లు అని రుద్రాణి అడుగుతుంది. ఇంటి గుమ్మం బయటపడుకోవాలా, ఇంట్లో పడుకోవాలో తెలియట్లేదు. ఇంట్లో నా స్థానం ఏంటో అర్థం కావడంలేదని డ్రామా స్టార్ట్ చేస్తుంది మాయ.
నీ పెళ్లికి అభ్యంతరం లేదని కావ్య రాసిచ్చింది కదా. ఇంకా దేనికి భయపడుతున్నావ్ అని రుద్రాణి అంటుంది. నేను నా బిడ్డతో ఉంటున్నాను. కానీ నా బిడ్డ రాజ్‌కు అలవాటు పడ్డాడు. వాడు లేకుంటే నేను దిగులు పెట్టుకుంటాను. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను అని రాజ్ గదిలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది మాయ. రాజ్ గదిలో కావ్య ఉందిగా అని స్వప్న అంటుంది. బిడ్డను వదిలి కన్నతల్లి ఉండలేకపోతుంది అని రుద్రాణి అంటుంది.
పళ్లు రాలగొడతానన్న ఇందిరాదేవి
ఇన్నాళ్లు ఏమైంది ఈ తల్లి మనసు. తను ఉండలేకపోతుందని నువ్ చెబుతున్నావా రుద్రాణి అని ఇందిరాదేవి అంటుంది. నేను నా బిడ్డతోపాటే ఉంటాను. నా బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని మాయ అంటే.. ఆ బిడ్డ రాజ్ గదిలో ఉన్నాడు. నువ్వెళ్లి రాజ్ గదిలో ఉంటావా అని స్వప్న అడుగుతుంది. ఏంటీ ఉంటావా అని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు అందరూ అనుమతిస్తే అని మాయ చెప్పబోతుంటే.. పళ్లు రాలగొడతా అని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది.
దాంతో మాయ షాక్ అవుతుంది. నీ మొహం చూస్తుంటే ఏ కొసానా అమ్మతనం కాదు కదా ఆడతనం కూడా కనిపించట్లేదు. నువ్వెళ్లి నా మనవడి గదిలో ఉంటానంటావా అని ఇందిరాదేవి అంటుంది. మీకెందుకు మొదటి నుంచి నేనంటే కోపంగా ఉంది అమ్మమ్మ గారు అని మాయ అంటుంది. కోపం కాదు కోసి కుక్కలకు వేయాలనంత కంపరంగా ఉందని ఇందిరాదేవి అంటుంది. ఆ గదిలో ఉండే హక్కు నా మాత్రమే ఉంది కదా అని మాయ అంటుంది.
ఇంట్లోంచి గెంటేస్తుంది
ఏమన్నావ్. ఎంత ధైర్యం నీకు. నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావ్. అలా ఉండటానికి నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా. సక్రమంగా బిడ్డను కన్నావా. అక్రమంగా బిడ్డను కని ఇప్పుడు వచ్చి హక్కులు అంటూ మాట్లాడుతున్నావా అని ఇందిరాదేవి నిలదీస్తుంది. చీర దిగ్గట్టి.. ఏది వెళ్లు రాజ్ గదిలోకి వెళ్లు. నా సంగతి నీకు తెలియదు అని స్వప్న భయపెడుతుంది. రాజ్ తప్పు చేస్తే అంతా నన్ను అంటారేంటీ అని మాయ అంటుంది. నోర్మూయ్ అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.
ఆ దరిద్రపుగొట్టు పని గురించి సంస్కారం ఉన్న ఇళ్లలో మాట్లాడుకుంటారా. తప్పు నా మనవడు ఒక్కడే చేశాడే. నువ్ పవిత్ర మూర్తివా. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు. ఇది ఇంటి పరువుకు సంబంధించిన సమస్య కాబట్టి.. నిన్ను ఇంట్లోకి రానిచ్చాం. నువ్ వచ్చి ఇప్పుడే హక్కుల గురించి మాట్లాడుతున్నావే అని ఇందిరాదేవి గడ్డి పెడుతుంది. ఇలాగే వదిలేస్తే మాయను ఇప్పుడే మా అమ్మ ఇంట్లోంచి గెంటేస్తుంది అనుకుని మధ్యలో దూరుతుంది రుద్రాణి.
రుద్రాణిపై పంచ్‌లు
మన ఇంటి గుట్టు మనమే మాట్లాడుకోవడం ఎందుకు. ఆవేశపడకు అని రుద్రాణి అంటుంది. కావ్య ఒప్పుకుంది పెళ్లికి మాత్రమే. ముందు పెళ్లి కానీ. ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలో ఆలోచిస్తాను అని అపర్ణ అంటుంది. సరేనని మాయ అంటుంది. మా వదినా మాట అంటే మాటే. ఏం చేస్తావ్. ఎవరికీ తప్పినా నాకు తప్పదు కదా. నా రూమ్‌లోకి పదా అని రుద్రాణి అంటుంది. రుద్రాణి, రాహుల్‌పై పంచ్‌లు వేస్తుంది స్వప్న. అపర్ణ వెళ్లిపోతుంటే.. అత్తయ్య గారు అని మాయ పిలుస్తుంది.
దాంతో షాక్ అవుతుంది అపర్ణ. ఏమన్నావ్ అని అపర్ణ కోపంగా అడుగుతుంది. అత్తయ్య అన్నాను అని మాయ అంటే.. నాలుక చీరేస్తా.. నువ్ తప్పు చేసింది నా కొడుకుతో అయిన సరే. కానీ, నా దృష్టిలో నువ్ పెళ్లికి ముందు తొందరపడి బిడ్డను కన్న ఆడదానివి. నువ్వంటే నాకు పరమ అసహ్యం. ఈ ఇంటి గుట్టు బయటకు పడొద్దని నీకు పెళ్లి చేస్తున్నాను. నువ్ చచ్చేదాక నన్ను అత్తయ్య అని పిలవకూడదు. జాగ్రత్త. వెళ్లే అని స్ట్రాంగ్ ధమ్కీ ఇస్తుంది అపర్ణ.
మాయకే అర్హత ఉంది
తర్వాత మాయ భయంగా వెళ్లిపోతుంది. నువ్ ఇక్కడ ఎందుకు నిలబడ్డావే. ఏ అర్ధరాత్రో వచ్చి గదిలో దూరే రకం అది వెళ్లు అని కావ్యను స్వప్న అంటుంది. అనంతరం కల్యాణ్ బుక్ చదువుకుంటుంటే తప్పు చేసినవాళ్లు మాత్రం సుఖంగా ఉంటున్నారు. ఆ తప్పుకు బలైనవాళ్లు మాత్రం అవమానాలు పడుతున్నారు అని అనామిక అంటుంది. ఎందుకు గొణుకుతావ్ సూటిగా చెప్పు అని కల్యాణ్ అంటాడు. బావ గారు చేసిన తప్పుకు మాయను ఎందుకు అవమానిస్తున్నారు. ఆయనతో ఉండే అర్హత మాయకే ఉందని అనామిక అంటుంది.
మరి మా వదినా అని కల్యాణ్ అంటే.. ఇంకా వదినా అని ఎలా అనగలుగుతున్నావ్. బావగారి జీవితంలో మరొక ఆడది ఉందని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంటిని పట్టుకుని వేలాడుతుందంటే ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం కావట్లేదా. మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇంటి హోదా ఎక్కడ పోతుందో అని ఇక్కడే ఉంటుంది అని అనామిక అంటుంది. అనామికపై ఫైర్ అవుతాడు కల్యాణ్. వదినే మనకు సపోర్ట్ చేసిందని మర్చిపోయావా అని కల్యాణ్ అంటాడు.
రెండు రోజుల్లో పెళ్లి
నువ్ ఎలాగు ఆవిడ భజన చేస్తావని తెలుసు. నీకు హెల్ప్ చేస్తే నేను కూడా ఆమెకు సపోర్ట్‌గా ఉంటానని ఆశపడింది. అది జరగ్గపోయేసరికి అప్పును అడ్డుపెట్టుకుని మన మధ్యలో గొడవలు పెడుతుంది. ఎవరికీ తెలియవు ఆవిడ నాటకాలు అని అనామిక అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో పెళ్లికి ముహుర్తాలు ఏమైనా ఉన్నాయా అని పంతులుని పిలిచి అడుగుతుంది అపర్ణ. రెండు రోజుల్లో కష్టంగా ఓ ముహుర్తం కుదిరింది అని పంతులు చెబుతాడు. కట్ చేస్తే కావ్యకు అప్పు కాల్ చేస్తుంది. అప్పుడే రుద్రాణి వాళ్ల మాటలు వింటుంది. ఆ నిజమైన మాయ వస్తుందా అని కావ్య అనడం విని రుద్రాణి షాక్ అవుతుంది. చూస్తుంటే కావ్య ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యేలా ఉంది.