Brahmamudi May 11th Episode: బ్రహ్మముడి- కావ్య ఉగ్రరూపం- అత్త మామలను నిలదీసిన కళావతి- రుద్రాణి, అనామికకు చురకలు-brahmamudi serial 11th episode aparna task to kavya subhash try to reveal raj son birth truth brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 11th Episode: బ్రహ్మముడి- కావ్య ఉగ్రరూపం- అత్త మామలను నిలదీసిన కళావతి- రుద్రాణి, అనామికకు చురకలు

Brahmamudi May 11th Episode: బ్రహ్మముడి- కావ్య ఉగ్రరూపం- అత్త మామలను నిలదీసిన కళావతి- రుద్రాణి, అనామికకు చురకలు

Sanjiv Kumar HT Telugu
May 11, 2024 07:38 AM IST

Brahmamudi Serial May 11th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 11వ తేది ఎపిసోడ్‌లో కావ్య తాండవం చేసి బీభత్సం సృష్టించింది. అత్త అపర్ణ, మామ సుభాష్, భర్త రాజ్‌తోపాటు రుద్రాణిలకు చుక్కలు చూపించింది. తన ఉగ్రరూపంతో అపర్ణను బయటకు వెళ్లకుండా ఆపింది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 11వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 11వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అపర్ణ మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తుంటాడు సుభాష్. నేను తప్పు చేస్తున్నా. అపర్ణకు ఏదో జరుగుతుందని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఇప్పుడు అపర్ణ ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లో, ఆఫీస్‌లో చాలా సమస్యలు వస్తున్నాయి. నా వల్ల రాజ్ కావ్య చాలా అవమానాలు పడుతున్నారు. నేను ఇంటికి పెద్దవాన్ని అయి ఉండి ఇలా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు అనుకుంటాడు సుభాష్.

విలవిల్లాడిన రుద్రాణి

ఏది అయితే అది అయింది. అపర్ణకు నిజం చెప్పేయాలి. అవసరం అయితే చేసిన తప్పుకు అపర్ణ కాళ్లు పట్టుకుని అయినా బ్రతిమిలాడాలి. ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. కానీ తనకు మాత్రం నిజం చెప్పేస్తాను. చెప్పేస్తాను అని సుభాష్ నిశ్చయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం స్వప్న కొట్టిన దెబ్బలకు నొప్పితో విలవిల్లాడుతుంది రుద్రాణి. రాహుల్ వచ్చి నా కన్ను చూడు మామ్. ఎలా చేసిందో. అది నిద్రలో చేయలేదు మామ్. కావాలనే చేసింది అని రాహుల్ అంటాడు.

నాకు తెలుసు. ఇప్పుడు స్వప్న గురించి కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఇవాళ రాజ్ నిజం చెప్పకపోతే వదినా ఇంట్లోంచి వెళ్లిపోతానంది కదా. పదా వెళ్దాం అని రుద్రాణి అంటుంది. ఈ దెబ్బతో వెళితే పెళ్లాం చేతిలో దెబ్బ తిన్న వెధవ అనుకుంటారు. ఈ తగిలిన గాయానికి మేకప్ వేసుకుని వస్తానని రాహుల్ వెళ్తాడు. అపర్ణ లగేజ్ పట్టుకుని రెడీగా ఉంటుంది. అంతా హాల్లో ఉండి చూస్తారు. వెళ్లిపోడానికే నిర్ణయించుకున్నావా అని సుభాష్ అడుగుతాడు.

దేవుడు సాయం చేస్తాడు

నీ వంశోద్ధారకుడు రాని. ఎవరు వెళ్లాలో, అంతా కలిసి ఉండాలో తేలుతుంది అని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్ బాబుతోపాటు లగేజ్ పట్టుకుని కిందకు దిగుతాడు. అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఇదేంట్రా వదినా వెళ్తుందనుకుంటే వీడే వెళ్లిపోతున్నాడని రుద్రాణి గుసగుసలాడుతుంది. మనలాంటి చెడ్డవాళ్లకు కూడా దేవుడు సాయం చేస్తాడు అని రాహుల్ అంటాడు.

మామ్ నా మూలంగా నువ్ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయి మాట పడటం, పేరు పొగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్లిపోతున్నాను అని రాజ్ అంటాడు. అదే నీ నిర్ణయమా అని అపర్ణ అంటే.. అవును అని రాజ్ అంటాడు. అర్థమైందిరా.. ఆ రహస్యాన్ని నీ ప్రాణం పోయిన బయటపెట్టవని అర్థమైపోయింది. ఆ బిడ్డ కోసం నీ సర్వస్వాన్ని ధారపోసి వెళ్లిపోగలవని పూర్తిగా అర్థమైపోయింది. నిన్ను ఇంట్లోంచి పంపిస్తే నిజం బయటపెడతావని అనుకున్నా. కానీ, నువ్ ఎక్కడ బయటపడట్లేదు అని అపర్ణ అంటుంది.

ఇలాంటి పరిస్థితి రాకూడదనే

నీ ఒంట్లో నా ఒంట్లో ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్ వెళ్లిపోతే ఇల్లు రచ్చబండ అవుతుంది. నేను ఒక్కదాన్నే దోషిలా మారుతాను.. ఇంట్లో అందరూ ధర్మాసనం మీద నిలబడి తీర్పు చెప్పడం మొదలుపెడతారు. నేనే వెళ్లిపోతాను అని లగేజ్ పట్టుకుని అపర్ణ వెళ్లిపోతుంటుంది. రాజ్ ఆపుతాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే కదా నేను వెళ్తున్నానంటున్నాను అని రాజ్ అంటాడు.

నాకు కావాల్సింది నిజం. నువ్ వెళ్లిపోవడం కాదు. నువ్ నా మాటకు విలువ ఇవ్వనప్పుడు, ఇంట్లోవాళ్లు నా నిర్ణయాన్ని తప్పని తేల్చినప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను మన్నించాల్సిన అగత్యం లేదు అని అపర్ణ అంటుంది. నువ్ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సంతోషంగా ఉండలేవు అని రాజ్ అంటే.. చేతులెత్తి దండం పెడుతుంది అపర్ణ. నీ త్యాగాలను చూసి భరించే శక్తి నాకు లేదు. ఈ లోకంలో నాకు చోటు, సంతోషం లేకపోతే ఇంకో లోకానికి దారి చూసుకుంటాను తప్పా. వెనక్కి తిరిగి రాను అని అపర్ణ తెగేసి చెబుతుంది.

రహస్యం బద్ధలైపోవాలి

అపర్ణ వెళ్లిపోతుంటే.. ఒక్క నిమిషం అపర్ణ అని సుభాష్ అంటాడు. దాంతో ఆగిపోతుంది అపర్ణ. నువ్వెళ్లిపోయే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. రాజ్ తప్పు చేశాడని నిజం దాచిపెడుతున్నాడన్న కోపంతో నువ్ వెళ్లిపోతున్నావ్ తప్పా. ఎందుకు వాడు నోరు విప్పడం లేదని, దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటని ఆలోచించట్లేదు అని సుభాష్ అంటాడు. ఆ నిజం మీకు తెలుసా. ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసా అని అపర్ణ అంటుంది.

అసలు ఇవాళ్టితో ఈ రహస్యం బద్ధలైపోవాలి. అసలు రాజ్ ఎలాంటివాడో మీరందరు తెలుసుకోవాలి అని సుభాష్ అంటాడు. దాంతో కావ్య, రాజ్ షాక్ అవుతారు. అసలు రాజ్ అని సుభాష్ అంటుంటే మావయ్య గారు మీరు ఆగండి.. అని కావ్య అంటుంది. అంతా కావ్యను చూస్తారు. కావ్య అని సుభాష్ అంటే.. మావయ్య నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీ అబ్బాయిని అడగాలి. మా అత్తగారిని అడగాలి అని కావ్య అంటుంది. కానీ నేను చెప్పాల్సింది చెప్పి తీరాలి అని సుభాష్ అంటాడు.

తర్వాత మాట్లాడుతాను

ఏం చెబుతారు మావయ్య గారు. బిడ్డతో వచ్చిన మీ కొడుకు గుణవంతుడు అని చెబుతారా. ఈ గుణవంతుడు తల్లి నిర్ణయానికి కట్టుబడి కట్టుకున్న పెళ్లాన్ని వదిలేసి పోతుంటే అప్పుడు చెప్పలేదు ఏంటండి. మీ కొడుకు భార్య ఏమైపోయినా కానీ మీకు నష్టం లేదు కానీ, మీ భార్య వెళ్లిపోతుంటే చెప్పడానికి ముందుకు వచ్చారా అని కావ్య అంటుంది. నా ఉద్దేశం అది కాదు అని సుభాష్ అంటే.. మీరు ఆగండి మావయ్య గారు. మీ కొడుకుతోను మీతోను నేను తర్వాత మాట్లాడుతాను అని కావ్య అంటుంది.

ఇప్పుడు అత్తగారు బయటకు వెళ్లడానికి ఇంట్లో ఉండటానికి గడప ఒక్కటే ఉంది. బయటకు వెళితే అడగలేను. ఇప్పుడు నేను మా అత్తగారితో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని కావ్య అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఏంటీ తేల్చుకునే లెక్కలు. నువ్వంటేనే లెక్కలేని నన్ను ఏం లెక్కలు అడుగుతారు అని అపర్ణ అంటుంది. మీరు ఏదైనా సాధించి ఆ గర్వంతో ఇంటిని విడిచి వెళ్లిపోతున్నారా. అలా వెళ్తే అదొ లెక్క. నేనంటే లెక్కచేయని మిమ్మల్ని నేను లెక్కలు తేల్చుకునే సమయం వచ్చింది అని కావ్య అంటుంది.

గడప దాటకముందే

అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు. ఎవరు వెళ్లమన్నారు. మీరు ఏదో సాధించి వెళ్తున్నా అనుకుంటున్నారు. కానీ, మీరు ఓడిపోయి ఎవరికి మొహం చూపించలేక వెళ్లిపోతున్నారు అని కావ్య అంటుంది. ఏలాగు వెళ్తోంది. ఏం చేయలేదు అని కడుపులో ఉన్నవన్ని కక్కెస్తున్నావా. మా వదినే ఓడిపోయిందని ఎద్దేవా చేస్తున్నావా. అవమానిస్తున్నావా. గడప దాటకముందే అవమానించాలని నిర్ణయం తీసుకున్నావా అని రుద్రాణి అంటుంది.

దాంతో రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది కావ్య. నన్నే ఏకవచనంతో పిలుస్తావా అని రుద్రాణి అంటుంది. ఇది మా అత్త కోడళ్ల మధ్య సమస్య అని కావ్య అంటుంది. ఇంకా ఆగితే ఏమే అంటుంది. అవసరమా అని స్వప్న అంటే.. హేయ్.. అని రాహుల్ అరుస్తాడు. నిన్ను అరేయ్ అంటుంది. ఇది దుగ్గిరాల ఇంటి సమస్య. దుమ్ము కొట్టుకుపోయే సమస్య కాదు అని స్వప్న బెదిరిస్తుంది. నేను ఓడిపోయాను అంటున్నావా అని అపర్ణ అడుగుతుంది.

మీ పెంపకంపై నమ్మకం లేదు

మరి గెలిచారా అని కావ్య తిరిగి ప్రశ్నిస్తుంది. తల్లిగా తప్పుకుని గెలిచారా. భార్యగా తప్పుకుని గెలిచారా. కోడలిగా తప్పుకుని గెలిచారా. ఎందులో గెలిచారా ఒక్క విషయంలో రుజువు చేయండి. మీకు మీ మీద నమ్మకం లేదు. అందుకే వెళ్లిపోతున్నారు. మీ కొడుకు నిజం చెప్పలేదని కోపంతో వెళ్లిపోతున్నారు. నిజమేంటో బయటపెట్టించే సత్తా లేదు. అందుకే వెళ్లిపోతున్నారు. నేను వచ్చిన సంవత్సర కాలంలో ఆయన మనస్తత్వం అర్థం చేసుకున్నాను. అందుకే ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నాను అని కావ్య అంటుంది.

మీరు పాతికేల్లు పెంచారు. అయినా ఒక్కసారి చెప్పడంతో నమ్మేశారు. మీ పెంపకంపైనే మీకు నమ్మకం లేదు. మీ కొడుకు మీద మీకే నమ్మకం లేదు. ఉండి ఆయనకు న్యాయమే చేస్తారో. ఆయన భార్యకో అన్యాయమే చేస్తారో.. ఏదో ఒకటి చేసి అప్పుడు గెలిస్తే ఓ లెక్క. ఓడినా ఓ లెక్క. కూడిక తప్పిందని వెళ్లిపోతే వెళ్లిపోండి. ఓడిపోయానని చెప్పి వెళ్లిపోండి అని కావ్య అంటుంది. కళావతి మా అమ్మనే ఎదిరించి మాట్లాడుతావా. మా అమ్మ తప్పొప్పులను ఎంచే దానివి అయిపోయావా అని రాజ్ అంటాడు.

పిల్లి కూనలా ఉండేదానివి

మీ అమ్మ గారు వెళ్లిపోమనగానే నన్ను దిక్కు లేనిదానిలా మీ దారి చూసుకున్నారు. మీకు నన్ను అనే రైట్ లేదు. మిమ్మల్ని దులిపేసే టైమ్‌లో దులిపేస్తాను. అంతవరకు ఆగండి అని కావ్య అంటుంది. హేయ్.. నువ్వెంటి మమ్మల్ని నిలదీసేది. మాతో లెక్కలు తేల్చుకునేదానివి అయ్యావా. పిల్లి కూనల పడి ఉండేదానివి నేను వెళ్లిపోతాను అనేసరికి నోరు లేస్తుంది అని అపర్ణ అంటుంది.

కదా.. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గడపదాటిన క్షణం పిల్లికూన కూడా పులి అవుతుంది. ఈ రుద్రాణి రాజమాత అనుకుంటుంది. ఆ ధాన్యలక్ష్మీ గారు ఏక చత్రాధిపత్యంలా ఏలేద్దామనుకుంటారు. ఆ అనామిక ఈ ఇంటికే మహారాణి అయిపోయి మొగున్నే లెక్కచేయని ఆడదై ఇంటి పెద్దరికాన్నే ప్రశ్నిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ ఆలోచిస్తుంటుంది.

ముక్కలైపోతుంది

మీరు వెళ్లిపోతే నిజం బయటపడుతుందా. అబద్ధమే రాజ్యం ఏలుతుంది. అసమర్థులే అందెలం ఎక్కుతారు. మీరు తాటిపై నడిచిన ఇల్లు ముక్కలైపోతుందండి. అంతకన్నా ఏం మారిపోతుంది. ప్రపంచం అంతా మీ అంతా స్వచ్ఛంగా ఉండాలని కోరుకోదండి. అసలు ఇల్లు అలా ఉండదు. నిజం నిద్రపోతూ ఉంటుంది. అడిగేవారు లేక ఎవరికీ వారే అన్నట్లు ఉంటారు. అన్నిటికిమించి మీ మనవడిగా. మీ అబ్బాయి కొడుకుగా దుగ్గిరాల వారసుడిగా ఆ బాబు ఇక్కడే ఉంటాడు అని కావ్య అంటుంది.

ఉండనిది మీరు ఒక్కరే. అది మర్చిపోకండి. మరి ఏం సాధించారని ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు అని కావ్య అంటుంది. దానికి ఆలోచించినా అపర్ణ సరే.. నేను ఎలా వెళ్తున్నానో అది పక్కన పెట్టు. నేను వెళ్లిపోను. ఇక్కడే ఉంటాను. అందరితో కలిసి ఉంటాను. ఇదంతా భరించే శక్తి నాలో ఉంది. మరి నిజాన్ని భయపెట్టే సత్తా నీలో ఉందా అని అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. సుభాష్, రాజ్ కూడా ఆశ్చర్యపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point