Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి- మళ్లీ అప్పుపై లొల్లి- తల్లిని గట్టిగా నిందించిన కల్యాణ్- భర్తను క్షమించిన అపర్ణ-brahmamudi serial july 9th episode again appu topic in duggirala family kalyan angry at mother brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి- మళ్లీ అప్పుపై లొల్లి- తల్లిని గట్టిగా నిందించిన కల్యాణ్- భర్తను క్షమించిన అపర్ణ

Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి- మళ్లీ అప్పుపై లొల్లి- తల్లిని గట్టిగా నిందించిన కల్యాణ్- భర్తను క్షమించిన అపర్ణ

Sanjiv Kumar HT Telugu
Jul 09, 2024 08:16 AM IST

Brahmamudi Serial July 9th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 9వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అప్పుపై టాపిక్ తీసుకొస్తుంది రుద్రాణి. దాంతో రెచ్చిపోయిన ధాన్యలక్ష్మీ లొల్లి చేస్తుంది. అందుకు కల్యాణ్ తల్లిని చాలా గట్టిగా నిందిస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్యతో అనామిక అన్న మాటల గురించి తలుచుకుంటాడు కల్యాణ్. అవి గుర్తు చేసుకుని బాధపడిపోతాడు. తర్వాత కల్యాణ్ డౌన్ డౌన్ అనే నిరసనల నినాదాలు కల్యాణ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అది తట్టుకోలేక చెవులు మూసుకుంటాడు. తర్వాత తన పెళ్లి ఫొటోలు తీసుకుని బయటకు వచ్చి కాల్చేస్తాడు.

మంచి పని చేశారు

అనామికతో జరిగిన పెళ్లి ఫొటోలను పెట్రోల్ పోసి నిప్పు అంటించేస్తాడు. అప్పుడే బయటకు వచ్చిన కావ్య.. అగ్నికి దూరంగా కల్యాణ్‌ను తీసుకొస్తుంది. ఫొటోలు కాలిపోవడం చూసిన కావ్య మంచి పని చేశారు. ఇవి ఉంటే మీకు ఇంకా అనామిక చేసిన అన్యాయమే గుర్తుకు వచ్చి బాధపడుతుంటారు అని కావ్య అంటుంది. దాంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు కల్యాణ్. భోజనానికి రమ్మని, అందరు తనకోసమే చూస్తున్నారని కావ్య చెబుతుంది.

నాకు తినాలని లేదని కల్యాణ్ అంటే.. ఇప్పుడు మీకోసం కాదు. ఇంట్లో వాళ్ల కోసం చేయాలి. లేకుంటే అంతా బాధపడిపోతారని నచ్చజెప్పి భోజనానికి తీసుకొస్తుంది కావ్య. కల్యాణ్ తినకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అందులో నీ తప్పు ఏం లేదని ప్రపంచానికి తెలిసిపోయింది కదరా. ఇంకా ఎందుకు బాధపడటం అని అపర్ణ అంటుంది. మన ఇంట్లో విడాకులు మొదటి సారి. అనామిక నీకు కరెక్ట్ కాదని చాలాసార్లు అనిపించింది అని ఇందిరాదేవి అంటుంది.

అప్పు కోసం

ఇక నుంచి ఇంట్లో ఎవరు అనామిక పేరు ఎత్తి వాడికి గుర్తు చేయకండని రాజ్ అంటాడు. అవునురా అనామిక పేరే ఎత్తం. ఇక నువ్ బాధపడకు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. ఆమాత్రం బాధ ఉంటుందని స్వప్న అంటుంది. ఇంకా ఎంతసేపు అలా చూస్తూ ఉంటావురా తిను అని ప్రకాశం అంటాడు. అయ్యో చిన్నన్నయ్య వాడి బాధ అనామిక అలా చేసిందని బాధపడటం లేదు. తను మూలంగా అప్పుకు దారుణమైన నష్టం జరిగిందని వాన్ని మరింత కృంగదీస్తుందని రుద్రాణి అంటుంది.

దానికి కల్యాణ్‌తోపాటు అంతా షాక్ అవుతారు. దాంతో ప్లేట్‌లో ఉన్నది అన్నమేగా. కడుపుకు అదేగా తింటున్నారు అని స్వప్న అంటుంది. మీరు ఎదుటి వాళ్ల మనసులు బాగా గ్రహిస్తారు. ఎవరు చెప్పకుండానే అన్ని చెబుతారు. ఇప్పుడు మీపై అందిరికీ వచ్చిన అసహ్యాన్ని కూడా గుర్తిస్తే మర్యాదగా ఉంటుందని కావ్య అంటుంది. మా మామ్ అన్నదాంట్లో తప్పేముంది. అప్పు వల్లేగా ఇలా జరిగింది. అప్పు లేకుంటే అనామిక తన లైఫ్‌లో ఉండేది కదా అని రాహుల్ అంటాడు.

దాంట్లో తప్పేంటీ

ఇప్పుడు దాన్ని ఎందుకు లాగుతున్నావ్. నోరు మూసుకుని తినొచ్చు కదా అని స్వప్న అంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో విజ్ఞత ఉంటుంది. అది నీకు మీ అమ్మ నేర్పలేదు. ఎందుకంటే అది మీ అమ్మకు లేదు అని రాజ్ అంటాడు. అవునురా. విజ్ఞత గురించి నువ్ నీ భార్య ట్యుటోరియల్ పెట్టండి. అప్పు వల్లే ఇదంతా జరిగలేదని ధాన్యలక్ష్మీని అడగండి అని రుద్రాణి అంటుంది. ఏరా నువ్వింకా అప్పు గురించే ఆలోచిస్తున్నావా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది.

తప్పేంటీ అని కల్యాణ్ అంటాడు. అంతా షాక్ అవుతారు. ఇంకా ఆ దరిద్రం గురించి ఎందుకురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇన్నాళ్లు అని అని అనామిక వెళ్లిపోయింది. ఇప్పుడు తన స్థానంలో నువ్ మొదలుపెట్టాలనుకుంటున్నావా అని కల్యాణ్ అంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అసలు నీ ఉద్దేశం ఏంటీ అని కల్యాణ్ అరుస్తాడు. అరేయ్ ఆవేశపడకు అని రాజ్ అంటే.. అరేయ్ తినేటప్పుడు అదంతా ఎందుకు అని సుభాష్ అంటాడు.

బ్రహ్మారాక్షసిలా మార్చింది

రుద్రాణి అంటే మనిషి జన్మ ఎత్తలేదు. నీకేమైంది. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని ప్రకాశం అంటాడు. అంతా నన్ను అంటారేంటీ అప్పు మూలంగే కదా అనామిక వెళ్లిపోయిందని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పు మూలంగా కాదమ్మా. నీ మూలంగా వెళ్లిపోయింది. మొదటిసారి నా కొడుకు అలాంటి వాడు కాదని నీ కోడలికి బుద్ధి చెప్పి ఉంటే తను వినేది. ఆల్రెడీ రాక్షసిగా పుట్టినదాన్ని బ్రహ్మారాక్షసిగా మార్చింది నువ్వు. నువ్ అనామికను సపోర్ట్ చేయకుండా ఉండుండే ఇవాళ అప్పుమీద ఇంత పెద్ద నింద పడేది కాదని కల్యాణ్ అంటాడు.

నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన అప్పును వెనుకేసుకురాకు. నేను ఊరుకోను. నేనేం చేశాను. అసలు నువ్వేం చేశావ్. గొడవలు వస్తున్నాయని తెలిసినా వెంటేసుకుని తిరిగావ్. నీ జీవితం ఇలా కావడానికి కారణం అప్పునే అని ధాన్యలక్ష్మీ అంటుంది. స్టాపిట్.. మీరు ఇంకా ఎదగలేరు. మీ మూర్ఖత్వానికి అనామిక తోడు అయింది. ఇద్దరు కలిసి వాళ్లను అని అందరినీ అని రచ్చ రచ్చ చేసి చివరికి ఇక్కడికీ తీసుకొచ్చారు అని కల్యాణ్ ఫైర్ అవుతాడు.

అప్పు గురించే ఆలోచిస్తాను

వాళ్లు మధ్యతరగతి వాళ్లమ్మా. వాళ్ల ఇల్లు వీధుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ అమ్మాయి హోటల్‌లో దొరికిందట కదా. డబ్బున్న వాన్నే పట్టిందంట కదా అని అందరూ అంటుంటే వాళ్లకు ఎలా ఉంటుంది. అసలు నీకు అప్పు గురించి మాట్లాడే హక్కు లేదు. ఇకనుంచి నేను అప్పు జీవితం ఎలా బాగుచేయాలనే ఆలోచిస్తాను. నువ్ ఏం చేస్తావో కూడా చూస్తాను అని కల్యాణ్ వెళ్లిపోతాడు. కావ్య నచ్చజెప్పి తీసుకొస్తే.. రెచ్చగొట్టి పంపించేవేంటే అని ప్రకాశం అంటాడు.

ఈవిడగారు అప్పుకు అన్యాయం జరిగిందని ఊదరగొట్టి తీసుకొస్తే వాడు అలా మాట్లాడుతున్నాడని ధాన్యలక్ష్మీ అంటుంది. చాలా బాగా అర్థం చేసుకున్నావ్. నీ కొడుకుని, భర్తను, నా కోడలిని చాలా బాగా అర్థం చేసుకున్నావ్. ఛీ.. ఏ మనిషివి నువ్. అసలు నువ్ ఒక తల్లివేనా. నోరు ఎత్తావంటే మర్యాదగా ఉండదు. వెళ్లు అని అపర్ణ ఫైర్ అవుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. సరిపోయిందా. నీకు కావాల్సింది జరిగిందా. ఇక కడుపు నిండ తిను అని స్వప్న అంటుంది.

మంచివాడికి ఆవేశం వస్తే

ఏయ్.. అని రాహుల్ అంటే.. నోర్మూయ్. వేడి వేడి సాంబార్ నీ అమ్మ మొహం మీద పోస్తా. మూసుకుని తిను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికే నలిగిపోతున్న నా చెల్లిని ఎక్కడో పడి ఏడుస్తుంటే దాన్ని బయటకు లాగారు. అసలు మీరు మనుషులేనా ఛీ అని స్వప్న అంటుంది. కట్ చేస్తే.. బెడ్‌పై కల్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. కావ్య వెళ్తుంది. కల్యాణ్‌కు నీళ్లు తాగిస్తుంది కావ్య. కూల్‌గా ఉండండి. ఎందుకు ఆవేశం అని కావ్య అంటుంది.

ఇది ఆవేశమా. జరిగింది తలుచుకుంటుంటే నా గుండె ఎంత మండిపోతుందో తెలుసా అని కల్యాణ్ అంటాడు. చెడ్డవాడికి ఆవేశం వస్తే ఇతరులు నష్టపోతారు. మంచివాడికి ఆవేశం వస్తే తన మనసే రగిలిపోతుంది అని కావ్య అంటుంది. ఇంత జరిగింది. అసలు అప్పు తప్పుందా. ఎందుకు ఇంకా తనదే తప్పు అంటుంది. మా అమ్మ వల్లే కదా అప్పుకు నష్టం జరిగింది అని కల్యాణ్ అంటాడు. ఎక్కడ జరిగింది. కోర్టులో అనామిక మాటలు అందరికీ సాక్ష్యంగా నిలిచాయి. తనకు జైలు శిక్ష కూడా పడింది కదా అని కావ్య అంటుంది.

పల్లవి ఉందని రాయండి

కోర్టు తీర్పు ఎందరికీ తెలుస్తుంది. అందరికీ అనామిక చేసిన పుకార్లే కావాలి అని కల్యాణ్ అంటాడు. అప్పు ఆడపిల్లే. కానీ, తన తప్పు లేకుంటే తల వంచే రకం కాదు. ఎదురిస్తుంది. మీ అమ్మగారు ఒక్కరు అన్నంతా మాత్రానా నిజమైపోదు. ఆమెను ఎవరు ఇంట్లో సపోర్ట్ చేయలేదు అని కావ్య నచ్చజెబుతుంది. ఇక మీ పాటకు పల్లవిలేదు అని కాదు. పల్లవి ఉందని రాయండి అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. కట్ చేస్తే కల్యాణ్ ఎలా ఉన్నాడని కావ్యను అడుగుతాడు రాజ్.

పగిలిన అద్దంలా ఉన్నారు. నేను ఎంతో కష్టపడి తీసుకొస్తే.. అన్నం తినకుండా చేశారు. కావాలనే మీ అత్తయ్యే రెచ్చగొట్టారు. మా స్వప్న పూటకోసారి గడ్డి పెట్టిన ఆవిడ మారేలా లేదు అని కావ్య అంటుంది. వాడు మారే అవకాశం ఉందా అని రాజ్ అంటే.. మారుతారనే నమ్మకం పోతుందని కావ్య అంటుంది. అప్పు సంతోషంగా ఉందని తెలిస్తే మారే అవకాశం ఉందా అని రాజ్ అంటే.. ఉండొచ్చు అని కావ్య అంటుంది. నేను అందుకు ఏమైనా చేయగలనా అని రాజ్ అడుగుతాడు.

మరింత ఒంటరిగా

మాకు ఒకరు సహాయం చేస్తే నచ్చదని కావ్య అంటుంది. దీన్నే పొగరు అంటారని రాజ్ అంటే.. మా ఊరిలో ఆత్మాభిమానం అంటారని కావ్య అంటుంది. గాడిద గుడ్డేం కాదు. ఇలాగే మనం గొడవ పడదామా. తమ్ముడి గురించి ఆలోచిద్దామా. వాడిని ఒంటరిగా పంపించి ప్రశాంతంగా ఉంచుదామా అని రాజ్ అంటాడు. అప్పుడు మరింత ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇది కూడా తెలియదు. ఎండీగా ఎలా ఉంటున్నారో అని కావ్య అంటుంది. చురకలు వేయడం ఆపుతావా అని రాజ్ అంటుండంగా ఏదో మెసేజ్ వస్తుంది.

ఫోన్‌లో మెసేజ్ చూసి అవును రేపు మా అమ్మనాన్న పెళ్లి రోజు కదా. ఇదెలా మర్చిపోయాను రాజ్ సంతోషంగా అంటాడు. అవును, నాకు రిమైండర్ ఎవరు పెట్టారని రాజ్ అంటే.. నేనే పెట్టాను అని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ కావ్య సుభాష్‌కు విషెస్ చెప్పి ఓ గిఫ్ట్ ఇస్తారు. అది మీరిచ్చినట్లుగా అత్తయ్యకు ఇవ్వమని కావ్య అంటుంది. ఆ గిఫ్ట్‌ను అపర్ణకు ఇస్తే తీసుకుంటుంది. దాంతో సంతోషంతో రాజ్‌ను వెళ్లి హగ్ చేసుకుంటాడు సుభాష్. భర్తను అపర్ణ క్షమించినట్లు తెలుస్తోంది.

Whats_app_banner