Raj Tarun: లావణ్యతో శారీరక రిలేషన్‌షిప్ ఉంది.. తండ్రినే మోసం చేసింది.. హీరో రాజ్ తరుణ్ క్లారిటీ-raj tarun clarity on living relationship with lavanya and she dating another person and malvi malhotra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raj Tarun: లావణ్యతో శారీరక రిలేషన్‌షిప్ ఉంది.. తండ్రినే మోసం చేసింది.. హీరో రాజ్ తరుణ్ క్లారిటీ

Raj Tarun: లావణ్యతో శారీరక రిలేషన్‌షిప్ ఉంది.. తండ్రినే మోసం చేసింది.. హీరో రాజ్ తరుణ్ క్లారిటీ

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 04:45 PM IST

Raj Tarun Clarity On Lavnya: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే లావణ్యతో రిలేషన్‌లో ఉన్నది నిజమేనని ఒప్పుకున్న రాజ్ తరుణ్ ఆమె గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు.

లావణ్యతో శారీరక రిలేషన్‌షిప్ ఉంది.. తండ్రినే మోసం చేసింది.. హీరో రాజ్ తరుణ్ క్లారిటీ
లావణ్యతో శారీరక రిలేషన్‌షిప్ ఉంది.. తండ్రినే మోసం చేసింది.. హీరో రాజ్ తరుణ్ క్లారిటీ

Raj Tarun Clarity On Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే లావణ్యతో రిలేషన్‌షిప్, ఇతర విషయాలను మీడియాకు క్లారిటీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్.

"లావణ్యతో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట నిజమే. నేను షార్ట్ ఫిల్మ్స్ తీసిన రోజుల నుంచి నాకు లావణ్య తెలుసు. ఆమె మంచి వ్యక్తే. నాకు గతంలో చాలా సహాయం చేసింది. అందుకు నేను కృతజ్ఞతగా ఉంటాను. మేము 2017 వరకు మాత్రమే శారీరకంగా, మానసికంగా రిలేషన్‌లో ఉన్నాం. ఆ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయింది. చెడు స్నేహాలకు అలవాటు పడింది. దాంతో నేను ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమని అడిగితే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది" అని రాజ్ తరుణ్ అన్నారు.

"ప్రస్తుతం ఆమె ఉన్న ఇంటిని దక్కించుకోడానికే ఈ కేసు పెట్టడం. ఇదో రకమైన బ్లాక్ మెయిల్. లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. ఆమెకు నేను నిజంగా అవసరమైతే లావణ్య మస్తాన్ సాయితో ఎందుకు డేటింగ్ చేస్తుంది. అతనిపై గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఫిర్యాదు చేస్తుంది. ఆమె తన కన్నతండ్రినే మోసం చేసింది. నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను. ఇదే విషయం చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను" అని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు.

రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ లావణ్య టార్చర్ పెట్టేది. సైకోలా ఫోన్స్, టీవీలు పగులగొట్టేది. ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియదు. లావణ్య తల్లిదండ్రులు చాలా మంచి వ్యక్తులు. లావణ్య తమ్ముడు నాకు చాలా క్లోజ్. వాడు నాకు చిన్నప్పుటి నుంచి, 2014 నుంచి తెలుసు. వాళ్ల సపోర్ట్ ఎవరికి ఉందో నాకు తెలియదు. ఇక నేను లావణ్యతో మాట్లాడను. ఏది ఉన్న లీగల్ అడ్వైజర్ ముందే మాట్లాడుతాను" అని రాజ్ తరుణ్ చెప్పారు.

"తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో మీరు రిలేషన్ పెట్టుకునే తనను పట్టించుకోవట్లేదని లావణ్య ఆరోపిస్తున్నారు" అన్న ప్రశ్నకు కూడా రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. మాల్వీ మల్హోత్రా నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆమె ముంబైలో ఉంటుంది. నేను హైదరాబాద్‌లో ఉంటాను. మాకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా సాధ్యమవుతుంది. ఆమెతో నేను తిరగబడరా సామీ సినిమా చేస్తున్నాను అంతే" అని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇదిలా ఉంటే, లావణ్య చెప్పే విషయాలు మరోలా ఉన్నాయి. "మేము 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఉయ్యాల జంపాల కంటే ముందునుంచే మాకు పరిచయం ఉంది. నా నుంచి విడిపోడానికి కారణం హీరోయిన్ మాల్వీ మల్హోత్రానే. తనే ఇన్‌ఫ్ల్యూయెన్స్‌తోనే దూరం అవుతున్నాడు. రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీని మాయం చేస్తామని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు బెదిరిస్తున్నారు" అని లావణ్య తెలిపారు.

"మేమిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం. కానీ, అఫిషీయల్‌గా కాదు. తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పాం. వాళ్లు ఓకే అన్నారు. రాజ్ తరుణ్ నాకు కావాలి. నాకు న్యాయం కావాలి" అని లావణ్య డిమాండ్ చేశారు.

Whats_app_banner