Chiranjeevi on Varun Tej: వరుణ్, లావణ్య లవ్ స్టోరీపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇప్పటికీ కోపంగా ఉందంటూ..
Chiranjeevi on Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ లవ్ స్టోరీపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే వరుణ్ పై తనకు కోపంగా ఉందని అతడు అనడం విశేషం.
Chiranjeevi on Varun Tej: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బాగా ఆసక్తి రేపిన లవ్ స్టోరీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీదే. గతేడాదే వీళ్ల మధ్య రిలేషన్షిప్ బయటపడటం, పెళ్లి కూడా జరిగిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య లవ్ స్టోరీని తనకు ముందుగానే లీక్ చేయనందుకు వరుణ్ పై కోపంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడాడు.
చిరంజీవికీ తెలియదా?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ లవ్ స్టోరీ చివరి నిమిషం వరకూ పెదనాన్న చిరంజీవికీ తెలియదట. ఈ విషయాన్ని అతడు చెప్పాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ అడిగిన ఓ ప్రశ్నకు చిరు స్పందించాడు. మామూలుగా చిరు లీక్స్ పేరుతో మెగాస్టార్ తన మూవీ టైటిల్స్, స్టోరీలాంటివి చిరంజీవి ముందుగానే లీక్ చేస్తూ ఉంటాడు.
ఇదే విషయం చెబుతూ.. చిరుని సుమ ఓ ప్రశ్న అడిగింది. "చిరు లీక్స్ అంటే మాకు బాగా ఇష్టం. మరి వరుణ్, లావణ్య లవ్ స్టోరీ మాత్రం ఎందుకు లీక్ చేయలేదు. అంటే మీకు కూడా తెలియదా" అని ప్రశ్నించింది. దీనికి చిరు స్పందిస్తూ.. "వరుణ్ నాతో ప్రతి విషయం చెబుతాడు. కానీ ఈ విషయంలో చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నేనో ఇన్‌స్పిరేషన్ అని వరుణ్ చెబుతూ ఉంటాడు.
ఈ లీక్స్ విషయంలోనూ నా నుంచి ఇన్‌స్పైర్ అయి లావణ్యతో డేటింగ్ విషయం చెప్పాల్సింది. తన తండ్రికి కూడా చెప్పని విషయాలను వరుణ్ నాతో చెబుతాడు. కానీ ఇది చెప్పనందుకు మాత్రం ఇప్పటికీ నాకు కోపంగా ఉంది" అని చిరు నవ్వుతూ చెప్పాడు.
దీనిపై నువ్వేమైనా సంజాయిషీ ఇస్తావా వరుణ్ అని సుమీ అడిగింది. దీనికి వరుణ్ స్పందిస్తూ.. "అది గౌరవంతో కూడిన భయం. అందుకే జాగ్రత్తగా ఉన్నాను. కానీ మా ఫ్యామిలీలో మొదటి చెప్పింది మాత్రం పెదనాన్నకే" అని వరుణ్ అన్నాడు. వరుణ్, లావణ్య గతేడాది ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు పెళ్లి పీటెక్కారు.
ఇలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్న తొలి తెలుగు మూవీ
ఇక ఆపరేషన్ వాలెంటైన్ మూవీపై చిరంజీవి స్పందించాడు. ఇలాంటి సబ్జెక్ట్ తో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అని చిరు అన్నాడు. "చిన్నతనం నుంచే ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల వరుణ్ కూడా ఓ నటుడిగా మారాడు. ఈ సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో గౌరవం. నా అడుగుజాడల్లో అతడు నడిచాడు. అతను ఎంచుకున్న పాత్రలు నాకు నచ్చాయి. ప్రతిసారీ ఓ భిన్నమైన స్టోరీతో వస్తున్నాడు. ఈ ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఈ సబ్జెక్ట్ పై రూపొందిన తొలి తెలుగు సినిమా అని నేను అనుకుంటున్నాను" అని చిరంజీవి అన్నాడు.
వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ నటించిన ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. పుల్వామా దాడి, ఆ తర్వాత దీనికి కారణమైన వారిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారం తీర్చుకున్న తీరు ప్రధాన కథాంశంగా ఈ సినిమా రూపొందింది.