Balakrishna: బాలకృష్ణకు రిలేట్ అయ్యేలా ఉంటుంది.. ఆయన మాట్లాడితే అది ఉండదు.. కొత్త హీరోయిన్ కామెంట్స్-tiragabadara saami heroine malvi malhotra comments on balakrishna and his character malvi malhotra biography tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: బాలకృష్ణకు రిలేట్ అయ్యేలా ఉంటుంది.. ఆయన మాట్లాడితే అది ఉండదు.. కొత్త హీరోయిన్ కామెంట్స్

Balakrishna: బాలకృష్ణకు రిలేట్ అయ్యేలా ఉంటుంది.. ఆయన మాట్లాడితే అది ఉండదు.. కొత్త హీరోయిన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 10:44 AM IST

Tiragabadara Saami Heroine About Balakrishna: బాలకృష్ణకు రిలేట్ అయయేలా తిరగబడరా సామి సినిమా ఉంటుందని కొత్తగా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న మాల్వీ మల్హోత్రా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బాలకృష్ణకు రిలేట్ అయ్యేలా ఉంటుంది.. ఆయన మాట్లాడితే అది ఉండదు.. కొత్త హీరోయిన్ కామెంట్స్
బాలకృష్ణకు రిలేట్ అయ్యేలా ఉంటుంది.. ఆయన మాట్లాడితే అది ఉండదు.. కొత్త హీరోయిన్ కామెంట్స్

Malvi Malhotra About Balakrishna: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తిరగబడర సామి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది.

ముందుగా మీ గురించి చెప్పండి?

మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబై వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్ సినిమా చేశాను. ఇది తెలుగులో నా మొదటి సినిమా.

ఈ సినిమాలో మీరు బాలకృష్ణ గారి అభిమాని కదా. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా ఉంటుంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ ఉండదు. ఆయన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు.

ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. నా క్యారెక్టర్ విమన్స్‌కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా ఉంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరిని చాలా ఎంజాయ్ చేశాను.

డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి?

రవికుమార్ గారు చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

సినిమాలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటీ?

ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఫన్ ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారికి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. సైలెంట్‌గా మొదలై వయలెంట్‌గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

నిర్మాత మల్కాపురం శివకుమార్ గురించి ?

శివ గారు వెరీ నైస్ పర్సన్. ఫ్యామిలీ పర్సన్‌లా ఉంటారు. వాళ్ల అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసినందుకు ఆయనకి రుణపడి ఉంటాను.

జెబి మ్యూజిక్ గురించి?

చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపథ్య సంగీతం కూడా సీన్స్‌ని ఎలివేట్ చేస్తోంది.

మకరంద్ దేశ్ పాండే గారి గురించి?

మకరంద్ దేశ్ పాండే గారు గ్రేట్ యాక్టర్. చాలా వినయంగా ఉంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

WhatsApp channel