Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను ముంచిన కావ్య- సూర్యవంశం టైపులో అప్పు కల్యాణ్- ధాన్యం కన్నింగ్ ప్లాన్-brahmamudi serial august 20th episode a relief for kanakam murthy kavya collects money for tea brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను ముంచిన కావ్య- సూర్యవంశం టైపులో అప్పు కల్యాణ్- ధాన్యం కన్నింగ్ ప్లాన్

Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను ముంచిన కావ్య- సూర్యవంశం టైపులో అప్పు కల్యాణ్- ధాన్యం కన్నింగ్ ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Aug 20, 2024 07:42 AM IST

Brahmamudi Serial August 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో చేసే ప్రతి పనికి కావ్య డబ్బులు అడుగుతుంది. కాఫీ, టీ, టిఫిన్స్‌కు రేట్లు చెప్పి డబ్బు వసూలు చేస్తుంది. మరోవైపు సూర్యవంశం సినిమాలో వెంకటేష్, మీనా తరహాలో అప్పు కల్యాణ్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పు చేసిన వంట కల్యాణ్ తిని అదోలా చూస్తాడు. ఎట్లుంది అని అప్పు అడిగితే.. బానే ఉందని కల్యాణ్ అంటాడు. అప్పు తిని.. ఇదేంద్రా ఇట్లుంది. బాగుందని చెప్పావేంటీ అని అప్పు అడుగుతుంది. బాగాలేదని చెబితే ఇవన్ని ఎక్కడ పడేస్తావో అని చెప్పలేదని కల్యాణ్ అంటాడు.

అంటే నేను గయ్యాలిలా కనిపిస్తున్నానా. ఇప్పటివరకు అమ్మ తినిపిస్తే తినడం తప్పా తెలియలేదు. తను ఎంత బాధపడుతుందో అని అప్పు అంటుంది. తర్వాత సరే నేను రెండు రోజుల్లో వంట మంచిగా నేర్చుకుంటాను అని అప్పు అంటుంది. దానికి సరుకులు కావాలి కదా. ఆరు వేలు ఉన్నాయి కదా. రేపు సరుకులు తెచ్చుకుందాం అని కల్యాణ్ అంటాడు.

భర్తపై కనకం ఫైర్

మనం ఇలా రారా భయ్ పోరా భయ్ అని పిలుచుకోవద్దు. ముద్దు పేర్లు పెట్టుకుందాం. నేను నిన్ను పొట్టి అని పిలుస్తాను అని కల్యాణ్ అంటాడు. నేను నిన్ను కూచి అని పిలుస్తాను. ఇన్నాళ్లు అమ్మ కూచివి. ఇప్పుడు నా కూచివి అని అప్పు అంటుంది. మరోవైపు కూతురు ఎలా ఉందో కొంచెమైనా పట్టింపు ఉందా అని కృష్ణమూర్తిని ఏదో ఒకటి అంటుంది కనకం. ఇంతలో బంటి వచ్చి తినడానికి ఏముందని అడుగుతాడు.

కానీ, కనకం కసురుకుంటుంది. ఇక బంటి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అన్నం పెట్టుకుంటాడు. అప్పు అక్క అడిగితే చికెన్ పెట్టేది. అప్పు అక్క ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటే నా రూమ్‌లోకి తీసుకెళ్లాను. వాళ్లు అక్కడే ఉన్నారు. నా అక్క అనుకున్న కాబట్టే ఇలా చేశాను. కానీ, నన్ను మాత్రం కనీసం అద్దె కొడుకులా అయినా చూసుకోవట్లేదు. వడ్డించడానికి అమ్మ లేకపోతే ఏంటీ నాకు చేతులు ఉన్నాయని బంటి అంటాడు.

టీకి వంద రూపాయలు

దాంతో వాళ్లు ఎలా ఉన్నార్రా అని కనకం, కృష్ణమూర్తి అడుగుతారు. బాగున్నారు. వాళ్లు ఎప్పుడు అక్కడే ఉండేలా ప్లాన్ చేశాను అని బంటి చెబుతాడు. వాళ్లను కలవడానికి వెళ్దాం అని కనకం అంటే.. ఇప్పుడే వాళ్లు కొత్త కాపురం పెట్టారు. ఇప్పుడు వెళ్లడం వద్దని కృష్ణమూర్తి అంటాడు. తర్వాత బంటికి ప్రేమగా కనకం వడ్డిస్తుంది. మరోవైపు టీ పట్టుకుని రాజ్ నిద్రలేవడం కోసం ఎదురుచూస్తుంది కావ్య. రాజ్ లేచి ఏంటే అలా నిల్చున్నావ్. ముందు ఆ టీ ఇవ్వు అని అంటాడు.

వంద రూపాయలు ఇవ్వండి అని కావ్య అంటుంది. వందేంటే నీ బొంద అని రాజ్ అంటాడు. నేను మీ ఆస్తి కోసం వెంపర్లాడుతున్న అన్నారు కదా. ఇన్నాళ్లు నా కష్టానికి ఒక్క రూపాయి అయినా వచ్చిందా లేదు కదా. నాకు ఏమైనా ఆస్తి రాసిచ్చారా. చిన్నిల్లు రాసిచ్చారా. నగ నట్రా, పుట్ట గోడు రాసిచ్చారా. అందుకే ఇలా. నేను చేసే ప్రతిదానికి మూల్యం చెల్లించాల్సిందే అని కావ్య అంటుంది. ఇద్దరూ ఇలాగే వాదించుకుంటారు.

భారీ మూల్యం

తర్వాత సరే ఈ టీ ఏదో కింద అడుగుతాను అని కావ్య వెళ్తుంటే పిలిచి రాజ్ వంద ఇస్తాడు. తర్వాత స్తానానికి వంద, సబ్బు పెట్టడానికి వంద అంటూ అన్ని పనులకు డబ్బులు ఇస్తాడు రాజ్. వాటిని లెక్కపెట్టుకున్న కావ్య నేను త్వరలో ఇలా సంపాదించి కోటీశ్వరాలిని అవుతాను. ప్రతిదానికి లెక్క ఉంది. కానీ, టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై. కింద టిఫిన్ రెడీ చేస్తాను. భారీ మూల్యం చెల్లించుకోవాలి అని కావ్య అంటుంది.

అదేంటీ అని రాజ్ అంటాడు. కిందకు వచ్చి అరవండి. అందరూ అశోకవనంలా వచ్చి నిలబడి పంచాయితీ పెడతారు. సరే ఐరన్ ఏమైనా చేయాల అని కావ్య అంటుంది. ఐరన్ వద్దు స్టీలు వద్దు అని రాజ్ అంటాడు. అయినా అవసరం ఏముందిలే ఇప్పుడు పనిపాట ఏం లేదు కదా. తాతయ్య గారు మీ పోస్టింగ్‌ను ఊస్టింగ్ చేసేశారు కదా అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఉల్లిగడ్డలు కోస్తూ అప్పు కన్నీళ్లు పెట్టుకుంటుంది.

సూర్యవంశం సీన్

చిరాకుతో నేను ఉల్లిగడ్డలు లేకుండానే వంట చేస్తా అనుకుంటుంది అప్పు. ఇంతలో వచ్చిన కల్యాణ్ సర్‌ప్రైజ్ అని చెబుతాడు. ఆ మిగిలిన 3 వేలు పెట్టి నీకు బట్టలు తెచ్చాను అని కల్యాణ్ అంటే.. అదేంద్రా భయ్ ఉన్న డబ్బు పెట్టి బట్టలు ఎందుకు తెచ్చావ్. ఇప్పుడు సరుకులు ఎలా కొంటావ్ అని అప్పు అంటుంది. అదేంటీ ఇంకా మూడు వేలు ఉన్నాయి. వాటితో తెస్తాను. ఆ డబ్బు తీసుకురా అని కల్యాణ్ అంటాడు. దాంతో అప్పు వెళ్లి తను కూడా కవర్ తీసుకొస్తుంది.

ఏంటిది అని కల్యాణ్ అడిగితే.. నువ్ ఎలాగు సరుకులు తీసుకొస్తావ్ కదా అని నేను నీకోసం బట్టలు తీసుకొచ్చాను అప్పు అంటుంది. సరిపోయింది నేను నీకోసం బట్టలు కొంటే నువ్ నాకోసం బట్టలు తెచ్చావా. ఇప్పుడు వంట కోసం ఏం చేద్దాం అని అంటాడు కల్యాణ్. ఇది సేమ్ సూర్యవంశం సినిమాలో వెంకటేష్, మీనా సీన్‌లా ఉంటుంది. కట్టుబట్టలతో వచ్చిన మనకు బట్టలు కూడా అవసరమే కదా అని కల్యాణ్ అంటాడు.

ఇదేం స్కీం

మరోవైపు కావ్య కాఫీ ఇస్తావా అని ఇందిరాదేవి అడుగుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ముందు అలాగే అన్న కావ్య తర్వాత రాజ్‌ను చూసి కాఫీకి వంద రూపాయలు అని అడుగుతుంది. దాంతో ఇందిరాదేవి, రుద్రాణి షాక్ అవుతారు. వంద ఏంటీ అని అడుగుతారు. రెండు వందలో సగం అని కావ్య అంటుంది. ఇదేం స్కీం అని రుద్రాణి అంటే.. మీకు తెలియదా అని కావ్య చెప్పబోతుంది. దాంతో రాజ్ ఆపుతాడు. ఏంటండి ఎక్కువ చెప్పానా అని కావ్య అంటుంది.

ఏమైందని ఇందిరాదేవి అంటుంది. ఏదోటి వాగుతుందిలే అమ్మ అని టిఫిన్ చేసినట్లే కనిపించట్లేదని రుద్రాణి అంటుంది. ఇకనుంచి టిఫిన్స్ ఆర్డర్‌పై చేయబడతాయి అని కావ్య అంటుంది. నాకు పెసరట్టు ఉప్మా కావాలని రుద్రాణి అంటుంది. అయితే, ఐదు వందలు. ప్లస్ జీఎస్టీ, సర్వీస్ ఛార్జీ అని కావ్య చెబుతుంది. అసలు ఏంటమ్మా ఇది అని ఇందిరాదేవి అడుగుతుంది. కావ్య చెప్పబోతుంటే రాజ్ ఆపుతాడు. ఏం జరగలేదని కవర్ చేస్తాడు.

రేట్లు పెంచాలి

మధ్యలో వీడేంటీ.. టిఫిన్‌లకు రేట్లేంటీ, కాఫీకి వందేంటీ అని రుద్రాణి, ఇందిరాదేవి అనుకుంటారు. అపర్ణ వచ్చి టీ అడిగితే.. కావ్య వంద రూపాయలు అని అంటుంది. వందేంటీ అని అపర్ణ అడుగుతుంది. రుద్రాణి రేట్లు చెబుతుంది. అదేం లేదు మొన్న రెస్టారెంట్‌లో వాటి ధరలు చెబుతుంది అంతే అని రాజ్ కవర్ చేస్తాడు. రెస్టారెంట్ రేట్స్ పెట్టానా. అయితే రేట్లు పెంచాలి. ఎంతైనా ఇవాళ రుబ్బిన పిండి కదా అని కావ్య అంటుంది.

ఎవరికీ ఏం అర్థం కాలేదు అని వాళ్లు అనుకుంటారు. తర్వాత కావ్యను బలవంతంగా బయటకు లాక్కెళ్తాడు రాజ్. వాళ్లను సస్పెన్స్‌లో ఉంచి తీసుకొచ్చారు అని కావ్య అంటే.. సస్పెన్స్ కాదే.. నన్ను నిలువునా ముంచేసి వచ్చావ్ అని రాజ్ అంటాడు. మీరు అడ్డంగా దొరికిపోతారానా అని కావ్య అంటే.. వాళ్లకు నీ మాటలు అర్థమైతే నన్ను కూడా కల్యాణ్‌లా బయటకు పంపేవారు. అప్పుడు నేను కూడా సింగిల్ రూమ్ చూసుకోవాల్సి వచ్చేదని రాజ్ అంటాడు.

సొంత బ్రెయిన్ లేదు

నేను మీ ఆస్తుల కోసం ఆశపడ్డానా. మీ పిన్నికి సొంత బ్రెయిన్ లేదు. మీ అత్తకు అసలు బ్రెయినే లేదు. వాళ్లు ఏదోటి అంటూనే ఉంటారు. మీకేమైందండి. ఏనాడు మీ ఆస్తుల కోసం ఆశపడ్డాను. మా అమ్మ నాన్నకు పది లక్షలు ఫ్రీగా ఇస్తానంటే వద్దన్నాను. అప్పు పెళ్లికి మీ వద్ద అప్పు చేసి ఎగ్గొట్టామా. అలా ఎలా అన్నారండి. ఎందుకు అన్నారు అని నిలదీస్తుంది కావ్య. నా దగ్గర కాఫీకి డబ్బులు వసూలు చేస్తే తింగరి మొహం అనుకున్నాను. వాళ్ల దగ్గర కూడా అడుగుతున్నావ్ అని రాజ్ అంటాడు.

అవును నాకు డబ్బు పిచ్చి పట్టింది. ఆస్తులు రాయించుకుందామంటే మీరెవరు జేబులో పెన్ పెట్టుకుని తిరగట్లేదు. ఇంతవరకు రాయించుకోలేదు అని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్, అప్పుతో వరలక్ష్మీ వ్రతం చేయించాలనుకుంటున్నట్లు ఇందిరాదేవి చెబుతుంది. అప్పు ఇంటి కోడలిగా పనికిరాదని రుజువు చేసి పంపిస్తాను అని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది ధాన్యలక్ష్మీ.