Brahmamudi August 12th Episode: బ్రహ్మముడి- తల్లికొడుకులకు కావ్య టెక్నిక్- చలిలో అప్పు ఫ్రెండ్స్- ధాన్యంతో కళావతి ఫైట్-brahmamudi serial august 12th episode aparna thanks kavya raj asks kalyan to come home brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 12th Episode: బ్రహ్మముడి- తల్లికొడుకులకు కావ్య టెక్నిక్- చలిలో అప్పు ఫ్రెండ్స్- ధాన్యంతో కళావతి ఫైట్

Brahmamudi August 12th Episode: బ్రహ్మముడి- తల్లికొడుకులకు కావ్య టెక్నిక్- చలిలో అప్పు ఫ్రెండ్స్- ధాన్యంతో కళావతి ఫైట్

Sanjiv Kumar HT Telugu
Aug 12, 2024 07:24 AM IST

Brahmamudi Serial August 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో కోపంగా ఉన్న రాజ్‌కు శాంతతో వంట చేయించినట్లు అబద్ధం చెప్పి అన్నం తినేలా చేస్తుంది కావ్య. అదే టెక్నిక్ మీకు వాడానని అత్త అపర్ణతో చెబుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ ఆకలితో ఉండి కిచెన్‌లో పాలు వేడి చేసుకుంటాడు. పాలు గ్లాసులో పోసుకునేటప్పుడు చేయి కాల్చుకుని పాల గిన్నె కింద పడేస్తాడు. దాంతో అక్కడికి కావ్య వస్తుంది. కాలిందా అని సెటైర్లు వేస్తుంది కావ్య. నీకెందుకు అని రాజ్ అంటాడు.

శాంతతో చేయించాను

మరి పక్కింటి పనిమనిషి రాంబాయమ్మకు చెబుతారా అని కావ్య అంటుంది. వెటకారంగా ఉందా నీకు అని రాజ్ అంటే.. మీకు ఆకలిగా ఉందా. సరే పదండి వడ్డిస్తాను అని కావ్య అంటుంది. నీ చేతి వంట తినను అని రాజ్ అంటే.. మీరు తినరని తెలిసే.. సాయంత్రం పనిమనిషి శాంతతో మీకోసం వండించాను అని కావ్య చెబుతుంది. అవునా అని సంతోషిస్తాడు రాజ్.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంపై అలిగితే ఆకలి అనే ఆయుధంతో దహించి వేస్తుంది. అయినా ఇది మీరు సంపాదించిన డబ్బుతో వండింది అని కావ్య అంటుంది. కరెక్ట్‌గా చెప్పావ్. టెక్నికల్‌గా, లాజికల్‌గా నేను సంపాదించిన డబ్బు కాబట్టి, అది కూడా నువ్ వండలేదు కాబట్టి నాకు ఈ అన్నం తినే సర్వహక్కులు ఉన్నాయి అని రాజ్ అంటాడు. పదండి వడ్డిస్తాను అని కావ్య అంటే ఆ హక్కు నీకు లేదని రాజ్ వడ్డించుకుని డైనింగ్ టేబుల్‌పై కూర్చుని తింటుంటాడు.

వారం తర్వాత చెబుతాను

ఆ వంటను మెచ్చుకుంటూ తింటాడు రాజ్. ముసుగులో నీకు బదులు శాంత వచ్చిన బాగుండేది అని రాజ్ అంటాడు. ఇంతలో అపర్ణ వచ్చి రాజ్ అన్నం తినడం చూసి సంతోషిస్తుంది. ఎవరో తినను అని చెప్పి రాక్షసుడిలా అర్థరాత్రి తింటున్నారు అని అపర్ణ అంటుంది. మామ్ ఇది పనిమనిషి శాంత చేసిన వంట. నేను మెనూ ఇస్తాను రోజు నాకోసం ఇలాగే స్పెషల్‌గా చేయించమను అని రాజ్ చెబుతాడు. సరే వారం రోజుల దాకా శాంత రాదు. వచ్చాకా చెబుతాను అని అపర్ణ అంటుంది. దాంతో అలిగి వెళ్లిపోతాడు రాజ్.

వాడు ఆకలికి ఉండలేడు ఎలా అని భయపడ్డాను. కానీ, నీ చేతి వంటను శాంత వంట అని చెప్పి తినిపించావ్ అని అపర్ణ అంటుంది. ఈ టెక్నిక్ ఓసారి మీ దగ్గర కూడా వాడను. మీరు తిననంటే మావయ్యతో పంపించాను అని కావ్య చెబుతుంది. అమ్మనా కోడలా.. ఎంత గడుసుదానివి అని అపర్ణ అంటుంది. అన్నం విలువ తెలియాలనే ఇంతదాకా ఆగాను. మీరెందుకు ఆగారు అని కావ్య అడిగితే.. నువ్ ఉన్నావనే ధైర్యం అని చెబుతుంది అపర్ణ. ఆయన కడుపు నిండింది. నా మనసు నిండింది అని కావ్య అంటుంది.

దున్నపోతు ఆపితే

పడుకున్న రాజ్‌కు నిద్రపట్టకపోవడంతో లేస్తాడు. కల్యాణ్ ఎలా ఉన్నాడో.. దీన్ని ఆపమంటే ఆపలేదు. నాకు నిద్రపట్టట్లేదు. ఇది మాత్రం దున్నపోతులా పడుకుంది అని రాజ్ అంటాడు. నేనేం పడుకోలేదు. ఏంటీ నేను దున్నపోతునా అని కావ్య అంటుంది. కల్యాణ్‌ను ఎందుకు ఆపలేదని మళ్లీ అడుగుతాడు రాజ్. ఇంకా ఎన్నేళ్లు దీని గురించి అంటారు. మీరు, ఇంట్లో ఉన్న పెద్దమనుషులు ఆపితే ఆగలేదు ఈ దున్నపోతు ఆపితే ఎలా ఆగుతారు అని కావ్య అంటుంది.

ఇద్దరూ కల్యాణ్ అప్పును ఇంటికి తీసుకురావడం గురించి సరదాగా గొడవ పడతారు. మీరు తాళి కట్టమన్న మిమ్మల్ని ఏమనరు కానీ, మా అక్కచెల్లెళ్లపై పడిపోతారు అని కావ్య అంటుంది. వాళ్లకు ఫోన్ చేసి రమ్మనమని కావ్యతో అంటాడు రాజ్. నాకు మీ అంతా విశాల హృదయం లేదు. కావాలంటే మీరు చేసుకోండి అని కావ్య అంటుంది. నేను కాల్ చేసి రమ్మని పిలుస్తాను అని రాజ్ అంటే.. ఫోన్ ఎత్తకుంటే ఏం చేస్తారు అని కావ్య అంటుంది.

మనస్ఫూర్తిగా రావాలని లేదు

ఎత్తుతాడు. ఎందుకు ఎత్తడు అని రాజ్ అంటుంది. ఇల్లు చీకటిగా మారిపోయింది. ఇంటికి రమ్మని పేపర్‌లో ప్రకటన ఇచ్చి రాడు. ఫోన్‌లో చెబితే వస్తాడా అని కావ్య అంటుంది. వస్తాడు అని కల్యాణ్‌కు రాజ్ కాల్ చేస్తాడు. కల్యాణ్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా ఏదో ఆవేశంలో వెళ్లిపోయావ్. నీ మీద మాకెన్ని రోజులు కోపం ఉంటుంది. ఎక్కడ ఉన్నావ్. ఎలా ఉన్నావ్. ఇంటికి వచ్చేయరా అని రాజ్ అంటాడు. నేను బాగున్నా. ఫ్రెండ్ షెల్టర్ ఇచ్చాడు. రావాలని నాకు మనస్ఫూర్తిగా లేదు అన్నయ్య అని కల్యాణ్ అంటాడు.

వచ్చేవాన్ని అయితే వెళ్లేవాన్ని కాదు. నా సంతోషం కోరుకునే వాడివి అయితే ఇబ్బంది పెట్టకు. సంవత్సరం అయింది వదిన వచ్చి. తనను ఇంట్లో అనకుండే ఎవరు ఆపలేదు. అప్పును కష్టపెట్టలేను. నన్ను ఇబ్బందిపెట్టకండి. ఉంటాను అని కల్యాణ్ కాల్ కట్ చేస్తాడు. దాంతో సెటైర్లు వేస్తుంది కావ్య. ఇప్పుడు నేను దున్నపోతులా. మీరు మేకపోతులా పడుకోండి అని కావ్య అంటుంది. నేను వెళ్లి కలిసి అడిగితే కచ్చితంగా వస్తాడు అని రాజ్ అంటాడు.

ఫ్రెండ్స్ అబద్ధాలు

మరోవైపు కవి ఆలోచిస్తూ ఉండగా.. అప్పు ఫ్రెండ్స్ బయట చలిలో ఇబ్బంది పడుతూ పడుకోవడం చూస్తాడు. అప్పు వచ్చి ఏమైందని అడిగితే.. మనకు ప్రైవసీ ఇవ్వాలని చెప్పి నీ ఫ్రెండ్స్ బయట చలిలో పడుకున్నారు. వాళ్ల రూమ్‌లో వాళ్లు పడుకోలేకపోయారు. ఈ రాత్రికి తప్పలేదు. ఇంకా ఇక్కడ ఉంటే తప్పు అవుతుంది. ఏదోటి చేద్దాం కానీ, ఇంతమంచి ఫ్రెండ్స్‌కు మన వల్ల ఇబ్బంది రాకూడదు. వీళ్లు రోజుకో అబద్ధం చెప్పి ఇలాగే కష్టపడుతుంటారు. కాబట్టి మనం వేరే దారి చూసుకుందాం అని కల్యాణ్ అంటాడు.

నీ ఇష్టం అని అప్పు అని చెబుతుంది. మరుసటి రోజు ఉదయం అప్పు ఫ్రెండ్స్ లేస్తారు. తెల్లారిపోతుంది. మనం ఇక్కడ పడుకున్నామని తెలిస్తే వాళ్లు ఫీల్ అవుతారు. మనం మన ఫ్రెండ్ రూమ్‌లో పడుకుని వచ్చామని చెబుదామని అనుకుంటారు. మీరు రాత్రి ఎందుకు రాలేదు అని కల్యాణ్ అడుగుతాడు. సినిమా చూశాక లేట్ అయింది. అందుకే ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి పడుకున్నామని అంటారు. సరేరా మేము వెళ్తాం అని అప్పు అంటుంది. ఎందుకు. ఏమైంది అని అప్పు ఫ్రెండ్ కిరణ్ అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇందుకే గొడవ పడ్డాను

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్, అప్పును రాజ్ తీసుకొస్తాను అని అంటే.. ఇద్దరు ఎవరు, నాకుంది కొడుకు ఒక్కడే. మిగతా వాళ్లతో నాకు సంబంధం లేదని ధాన్యలక్ష్మీ కోపంగా అంటుంది. ఇందుకే అప్పును కవిగారు చేసుకోవద్దని మీతో గొడవ పడ్డాను. వాళ్లకు మీరు సమాధానం చెబుతారా.. నేనే సమాధానం చెప్పాలా అని కావ్య కోపంగా అంటుంది.