Brahmamudi April 1st Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి బయటకు రాజ్- కుర్చీ కోసం స్వప్న అనామిక ఫైట్- కావ్యకు కంపెనీ బాధ్యతలు
Brahmamudi Serial April 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌లో కంపెనీ బాధ్యతల నుంచి రాజ్ తప్పుకుంటాడు. మరోవైపు రాజ్ కుర్చీలో కూర్చునేందుకు కల్యాణ్, రాహుల్ కోసం అనామిక స్వప్న గొడవపడితే సుభాష్ మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ బిడ్డ కోసం కావ్య బొమ్మలు కొనుక్కుని తీసుకొస్తుంది. దారిలో కావ్యను చూసి కనకం కృష్ణమూర్తి బాధపడతారు. ఏంటమ్మా పరిస్థితులకు తలొంచవా. ఆరోజే మేము ఇంటికి రమ్మన్నాం. అప్పుడే వచ్చేయాల్సింది. కానీ, అక్కడ ఉండి వాళ్లను నిలదీసి నీకు సమాధానం చెప్పాలి అని ధైర్యంగా మాట్లాడావు. కానీ, ఇప్పుడు ఇలా నువ్ చేసేది దానికి పూర్తిగా భిన్నంగా ఉంది అని కృష్ణమూర్తి అంటాడు.
ఏం చెబుతుందో చూద్దాం
మేము నిన్ను అక్కడే ఉండమని చెప్పామా. ఏమైనా అత్తిల్లే అన్ని అన్నామా. ఆఖరికి ఆయగా మారావ్. పెద్దింట్లో ఇలాంటి విషయాలను గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతారు. నీ మొగుడి మోసాన్ని బయటపెడదాం. పదా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మీడియా ముందు నిలదీద్దాం. ఆ దుగ్గిరాల కుటుంబం ఏం చెబుతుందో చూద్దాం అని కనకం అంటుంది. దాంతో ఇంకా.. ఇవి సరిపోతాయా నా మొగుడి పరువు తీసేందుకు అని కావ్య అంటుంది. దాంతో వాళ్లిద్దరు షాక్ అవుతారు.
అప్పుడు వాళ్ల కుటుంబానికి రాజ్ చేసిన ప్రతి ఒక్క మంచి పని గురించి చెబుతుంది. మంచి చేస్తే దేవుడు.. కాస్తా అటు ఇటు అయితే మోసగాడా. మనకు అంత మేలు చేసినందుకు ఆయన మోసగాడే. ఎవరైనా తప్పు చేస్తే మూలాల నుంచి క్షమిస్తారమ్మా. అలాంటిది ఆయన చేశారని ఇంకా రుజువు కాలేదు అని కావ్య చెబుతుంది. అల్లుడు దేవుడేనమ్మా. కుటుంబానికి మేలే చేశారు. కానీ, చివరికీ నీకు కీడే చేశారు కదా అని కృష్ణమూర్తి అంటాడు.
శిక్ష పడాలని
ఇంట్లో అతన్ని అంతా దూరం పెట్టారు. ఎవరు క్షమించలేదు. ఆయనకు కష్టం వచ్చింది. సుఖంలో తోడుగా ఉన్నా నేను దుఖంలో కూడా ఉండాలి. ఆయన భార్యగా అది నా బాధ్యత. నిజంగా ఆయన మరొక ఆడదానితో బిడ్డను కన్నారని రుజువు అయితే.. అప్పుడే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తా. అలా అని కోర్టుకు కూడా వెళ్లను. ఆయనకు ఏ శిక్ష పడాలని కోరుకోను. ఇక నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. అప్పటివరకు ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అని వెళ్లిపోతుంది కావ్య.
అనంతరం ఇంట్లో పెద్ద గొడవ జరగడానికి సమయం అయింది. ఇక సింహాసనం మీద పులి కూర్చుంటుందో శునకం కూర్చుంటుందో.. శునకం అంటే నా కొడుకే కదా. సింహాసనం మీద నా కొడుకు కూర్చుంటాడో చూడాలి అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో రాజ్ బాబుతో వస్తాడు. నీతో మాట్లాడకూడదని నియమం లేదు. కానీ, మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నీ వల్ల్ అందరి పరువు పోయింది. పెద్దరికం పోయింది అని అపర్ణ అంటుంది.
నాతో మాట్లాడకూడదని
కన్న బిడ్డను దూరం చేసుకోమంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు అని రాజ్ అంటాడు. ఆ బిడ్డ ఎవరు అని ఆఫీస్‌లో అడిగితే ఏమని చెబుతావ్ అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లు అడగరు అని రాజ్ అంటాడు. వాళ్లు అడగరు కానీ, చెవులు కొరుక్కుంటారు అని ఇందిరాదేవి అంటుంది. అసలు నువ్ ఆఫీస్‌కు బిడ్డను ఎందుకు తీసుకెళ్లావ్. దానికి నీ సంజాయిషీ ఏంటి అని అపర్ణ నిలదీస్తుంది. ఇంట్లో నాతో మాట్లాడకూడదని తీర్మానం చేశారు. ఇంట్లోని ఓ అతిథి కొడుకుని వదిలేసిపోలేక ఆఫీస్‌కు తీసుకెళ్లే అవసరం వచ్చింది అని రాజ్ అంటాడు.
ఆ అవసరం పదిమంది మాట్లాడుకునేలా చేస్తే అని అపర్ణ అంటుంది. ఆ పదిమంది ఇంట్లోనే ఉన్నారుగా అని రాజ్ అంటాడు. నీకు ఇంకా అర్థం కాలేదా వదినా. రాజ్ అంతా స్పష్టంగా చెబుతుంటే ఇంకా ప్రశ్నలు అడుగుతున్నావ్. ఇంట్లో నువ్ చెప్పింది ఏం జరిగింది. నీకున్న టెంపర్‌కు రాజ్‌ను బిడ్డతో రానివ్వకుండా బయటే ఉంచుతావనుకున్నా. రాజ్‌తో మాట్లాడొద్దు అంటే వాడి భార్య సతికళావతిలా సపర్యలు చేస్తుంది. ఏ విషయాన్ని మనం ఆపగలిగాం అని రుద్రాణి అంటుంది.
తప్పు ఒప్పుల గురించి
ఇంతకుముందు నా కొడుకు అసమర్థుడు అమ్మాయిలతో తిరుగుతాడని వాడిని ఆఫీస్‌కు రానివ్వలేదు. ఇప్పుడు నీ కొడుకు వెలగబెట్టింది ఏంటీ. ఎవరికీ తెలియకుండా ఓ ఆడదానితో సంబంధం కొనసాగించి ఇప్పుడు ఏకంగా బిడ్డనే ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మాయిలతో తిరిగిన నా కొడుకుకు ఆఫీస్ బాధ్యతలు తీసుకునే అర్హత లేనప్పుడు రాజ్‌కు ఎలా ఉంది. రాజ్ కరెక్ట్ అయితే రాహుల్ కూడా కరెక్టే అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు తప్పు ఒప్పుల గురించి నువ్ మాట్లాడుతున్నావా అని ప్రకాశం అంటాడు.
మరి నువ్వే చెప్పు చిన్నన్నయ్య అని రుద్రాణి అంటుంది. ఇలా అందరికీ మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నావురా. పులిలా ఉండేవాడివి. ఇలా దోషిలా నిలబడితే చూడలేకపోతున్నాను. ఏది ఏమైనా నువ్ బిడ్డను ఆఫీస్‌కు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని రాజ్‌ను ప్రకాశం అడుగుతాడు. చూశావా ఎప్పుడు రుద్రాణికి అడ్డుపడే నేను ఏం అనలేకపోతున్నా. నువ్ చేసింది అంతా తప్పే అంటున్నారు. బాబాయ్ కూడా నిన్ను సమర్ధించలేకపోతున్నారు అని అపర్ణ అంటే.. ఏం చేయమంటావో చెప్పు మమ్మీ అని రాజ్ అంటాడు.
కోట్లల్లో టర్నోవర్
పరిష్కారాలు రెండే ఉన్నాయి. ఒకటి పరిహారం చెల్లించక తప్పదు. ఇంకోటి పశ్చాత్తాపం చెందక తప్పదు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా బిడ్డను నువ్ వదిలేసి రావాలి. లేదు అంటే, దీనికి పరిహారంగా నువ్ కంపెనీ బాధ్యతలు వదిలేసుకోక తప్పదు అని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అనుకున్నది జరుగుతున్నట్లు రుద్రాణి, రాహుల్ చూసుకుంటారు. అపర్ణ ఏం మాట్లాడుతున్నావ్. వాడు ఈ కంపెనీకు కోట్లల్లో టర్నోవర్ తెచ్చాడు. మేమంతా కలిసి వాడికి బాధ్యత ఇచ్చాం. ఇప్పుడు వాడి లేకుంటే కోట్లల్లో నష్టాలు వస్తాయని సుభాష్ అంటాడు.
మీరు కంపెనీ నష్టాల గురించి మాట్లాడితే.. నేను ఇంటి పెద్ద కోడలిగా వంశం నష్టం గురించి మాట్లాడుతున్నా అని అపర్ణ అంటుంది. నేను కూడా ఈ ఇంటి కోడలిగానే మాట్లాడుతున్నా బావగారు. రాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ తనే పోగొట్టుకుంటున్నాడు. ఆ బిడ్డను వదిలేసి వస్తే ఏ గొడవ ఉండదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. చెప్పు రాజ్ అని అపర్ణ అంటే.. ఏం చెప్పాలి మమ్మీ. అధికారం కోసం రక్త సంబందాన్ని వదులుకోవాల. రక్త సంబంధం కోసం అధికారాన్ని వదులుకోవాలా అని రాజ్ అంటాడు.
సంబరంలో అనామిక రుద్రాణి
అసలు ఈ నియమాంశత లేదు. నాలో ఏ పశ్చాత్తాపం లేదు. పరిహారం చెల్లించడానికి భయము లేదు. నేను కంపెనీ చూసుకోడానికి నాకు అర్హత లేదనుకుంటే సంతోషంగా కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను. అంతేగానీ ఈ పసివాడిని అనాథను చేయను అని రాజ్ అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి వాళ్లు షాక్ అయితే.. రుద్రాణి, అనామిక సంబరపడిపోతారు. నేను బిడ్డ బాధ్యత తీసుకున్నానక. తల్లి చెప్పిన వినను. తండ్రి ఆపిన ఆగను. మీకు ఇష్టముంటే ఇంట్లో ఉంటాను. లేకుంటే వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతాను. ఆ నిర్ణయం కూడా మీకే వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకోండి అని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు.
దాంతో అపర్ణ షాక్ అవుతుంది. కానీ, ధాన్యలక్ష్మీ, అనామిక, రుద్రాణి, రాహుల్ సంతోషపడతారు. అనుకున్నది జరిగింది అని రుద్రాణి, రాహుల్ సైగలతో సంతోషపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ బావగారి స్థానంలో కూర్చోడానికి వారసత్వం కావాలి. కల్యాణ్ మాత్రమే ఆ స్థానంలో కూర్చోవాలి అని అనామిక అంటే.. ఎక్స్‌పీరియన్స్ ఉన్న రాహుల్‌ను పక్కన పెట్టి అసలు ఇంట్రెస్ట్ లేని కల్యాణ్‌ను రాజ్ ప్లేసులో కూర్చోబెట్టమంటారేంటీ అని స్వప్న అంటుంది.
సుభాష్ బిగ్ ట్విస్ట్
ఇలా ఇద్దరు రాజ్ కుర్చి కోసం గొడవపడతారు. ఈ ఇంట్లో రాజ్ స్థానంలో కూర్చోడానికి ఒక్కరికే అర్హత ఉంది. ఆ ఒక్కరు ఎవరో కాదు. నా కోడలు కావ్య అని సుభాష్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. దాంతో అనామికతోపాటు అంతా షాక్ అవుతారు. ఇందిరాదేవి మాత్రం సంతోషపడుతుంది.
టాపిక్