Brahmamudi March 30th Episode: బ్రహ్మముడి- రాజ్ కుట్రకు అసహ్యించుకున్న శ్వేత- భర్తను పిల్ల బచ్చా అన్న స్వప్న- కావ్య అలా!-brahmamudi serial march 30th episode swapna warning to rahul rudrani swetha angry at raj brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial March 30th Episode Swapna Warning To Rahul Rudrani Swetha Angry At Raj Brahmamudi Today Episode

Brahmamudi March 30th Episode: బ్రహ్మముడి- రాజ్ కుట్రకు అసహ్యించుకున్న శ్వేత- భర్తను పిల్ల బచ్చా అన్న స్వప్న- కావ్య అలా!

Sanjiv Kumar HT Telugu
Mar 30, 2024 08:05 AM IST

Brahmamudi Serial March 30th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 30వ తేది ఎపిసోడ్‌లో బాబును ఆఫీస్‌కు తీసుకెళ్తారు రాజ్ అండ్ కావ్య. అక్కడ ఆ బాబు గురించి ఉద్యోగులు అడిగితే రాజ్ కొప్పడతాడు. దాంతో బాస్ కొడుకు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 30వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 30వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మనకు మంచి అవకాశం వచ్చిన సరిగ్గా నెట్ క్యాష్ చేసుకోలేకపోతున్నామని అంటుంది రుద్రాణి. రాజ్ కొడుకు విషయమా అని రాహుల్ అంటాడు. అవును, అలా ఎలా బిడ్డ పుట్టుకువస్తాడు. రాజ్ బిడ్డను తీసుకొస్తే.. అంతా అరిచేసి సైలెంట్‌గా ఉండిపోయారు అని రుద్రాణి అంటుంది. రాజ్ కాబట్టి ఊరుకున్నారు. అదే నేను తీసుకొస్తే.. ఎంత పెద్ద గొడవ చేసేవారు అని రాహుల్ అంటాడు.

హ్యాండిల్ చేయలేడు

నీకు రాజ్‌కు పోలిక. తల్లిని అని అనకూడదు కానీ.. నువ్ తీసుకొచ్చే బిడ్డలతో నర్సరీనే రన్ చేయొచ్చు అని రుద్రాణి అంటుంది. రాజ్‌ బిడ్డను తీసుకొచ్చిన విషయం మీడియాకు తెలియాలి. దుగ్గిరాల ఇంటికి కొత్త వారసుడు వచ్చాడని ప్రచారం జరగాలి. అప్పుడు గానీ రాజ్ ఎండీ పదవి నుంచి తప్పుకోడు. ఇక కల్యాణ్ కవితలు రాసుకోవడం తప్పా క్లైంట్స్‌ను హ్యాండిల్ చేయలేడు. కాబట్టి అల్టిమేట్‌గా ఇంటి వారసుడిగా నిన్నే ప్రకటిస్తారు అని రుద్రాణి అంటుంది. దాంతో రాహుల్ సంతోషపడతాడు.

కానీ, ఇంతలో స్వప్న క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. వావ్.. నిలువెత్తు నికృష్టులను చూసి నా జన్మ ధన్యమైపోయింది. ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి. ఉన్న ఇంటి పునాదులనే పెకిలించివేద్దామను చూస్తున్నారా. ఇందాకా ధాన్యలక్ష్మీ ఆంటీకి పెద్దత్తయ్య గడ్డి పెడుతుంటే నీవైపే రాజ్ మాట్లాడాడు. అతను చేసింది తప్పే కావచ్చు. కానీ, నీ విషయంలో నిజాయితీగా ఉన్నాడు. ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా. అది అక్కడే దులిపేసుకుని వచ్చావా అని స్వప్న అంటుంది.

ఓరి నా పిల్ల బచ్చా

ఉన్న ఇంటి పరువు తీసి ఇంటినే కూల్చేయాలనుకుంటున్నారా. అలా అయితే ఇంటి పైకప్పు కూలి ముందు పడేది మీపైనే. అలా జరిగితే రోడ్డున పడేది మీరే అని స్వప్న అంటుంది. మేం రోడ్డునపడితే నువ్ అమెరికాలో పడతావా అని రాహుల్ అంటాడు. ఓరి నా పిల్ల బచ్చా.. నాకు తాతయ్య అంత పెద్ద ఆస్తి రాసిచ్చాడని మర్చిపోయారా. నేను, నా బిడ్డ కలిసి కూర్చుని తిన్న తరగని ఆస్తి అది. మీ వల్ల కావ్యకు ఎలాంటి సమస్య అయినా వస్తే.. మిమ్మల్ని అందరిముందు నిలబెట్టి కడిగేస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.

మరోవైపు ఆఫీస్‌కు బిడ్డతోపాటు రాజ్ కావ్య వెళ్తారు. అక్కడ వాళ్లను అంతా చూస్తుంటారు. ఇంతలో సెక్రటరీ వచ్చి బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడు. ఎవరి బాబు సార్. మీ బంధువల బాబా అని అడుగుతుంది. దానికి డిజైన్స్ మెయిల్ చేయడం, కొత్త డిజైన్స్ గురించి చూడటం వంటివి రెండు మూడు పనులు చేశావా అని అడుగుతాడు. దానికి చేయలేదు అని సెక్రటరీ అంటుంది. చెప్పిన పనులు చేయవు కానీ, అనవసరమైనవాటిలో కాలు చేయి దూరుస్తావ్. వెళ్లి పని చూసుకో అని మందలిస్తాడు రాజ్.

క్లైంట్స్ మీటింగ్ గురించి

దాంతో వెళ్లిపోతుంది సెక్రటరీ. అనంతరం నేను ఏమన్నాను అని అంతలా చిరాకు పడ్డారు. ఇంతకీ ఆ బాబు ఎవరు అని ఆలోచిస్తుంది సెక్రటరీ. అప్పుడే వచ్చిన కావ్య అలా ఆలోచించకుండా పని చేసుకుంటే నీ ఒంటికి, జాబ్‌కు మంచిది అని కావ్య సలహా ఇస్తుంది. తర్వాత ఇద్దరూ డిజైన్స్ అప్రూవ్ కోసం రాజ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే రాజ్ బాబును ఆడిస్తుంటాడు. డిజైన్స్ చూపిస్తారు. ఇంతలో మరో పర్సన్ వచ్చి విజయవాడ క్లైంట్స్ మీటింగ్ గురించి అడుగుతాడు. లంచ్ తర్వాత పెట్టమని రాజ్ అంటాడు.

అనంతరం ఈ బాబు ఎవరు అని అతను అడుగుతాడు. దాంతో కావ్యను కవర్ చేయమని సైగ చేస్తాడు రాజ్. కానీ, కావ్ సైలెంట్‌గా ఉంటుంది. సర్ మీకెందుకు సార్. మనం ఆఫీస్‌కు వచ్చింది పని చేసుకోడానికి అని సెక్రటరీ శ్రుతి అరుస్తుంది. అయినా అతను వినకపోయేసరికి రాజ్ ఏదో అనబోతుంటే.. తనకంటే ముందే అతనిపై శ్రుతి అరుస్తుంది. అరిచేసి అతన్ని తీసుకెళ్లిపోతుంది. ఏంటీ ఎప్పుడు లేనిది అలా అరిచావ్ అని అతను శ్రుతిని అడుగుతాడు.

కావ్య వార్నింగ్

నేను కాకుంటే బాస్ మిమ్మల్ని కరిచేవారు. ఆ బాబు గురించి ఎవరు అడిగినా అంత ఎత్తున లేస్తున్నారు. ఆ బాబు బాస్ కొడుకు అయి ఉంటాడు. బాస్ తండ్రి కావడానికి కావ్య మేడమ్ కాకపోతే ఇంకా వేరే మేడమ్ కారణం కావచ్చు కదా అని శ్రుతి అంటే.. హో.. రెండో ఇల్లా అని అతను అంటాడు. ఆ మాటలు విన్న కావ్య షటప్.. అని వాళ్లపై అరిచేస్తుంది. మీరు ఆఫీస్‌కు వచ్చేది ఇలా చెత్త మాట్లడానికా. నిజాలు తెలియకుండా ఒక మనిషి క్యారెక్టర్‌ గురించి అలా ఎలా అంటారు. ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను అని ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది కావ్య.

మరోవైపు కోపంగా వచ్చిన అప్పును ఏమైంది అడుగుతుంది కనకం. నీ వాలకం చూస్తుంటే గొడవ పడినట్లు ఉన్నావ్ అని కనకం అంటుంది. అవును పడ్డాను. నాకు అందరితో గొడవ పడటం ఇష్టమా. నాకు అక్కడ ఏం నచ్చలేదు. నేను అసలు పోలీసే అవ్వను. లోకంలో అదొక్కటే జాబ్ ఉందా. ఇంకా వేరే ఏదైనా చూసుకుంటాను. లేకుంటే మళ్లీ పిజ్జా డెలీవరీ చేసి సంపాదిస్తాను. బయటే అనుకుంటే ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని వెళ్లిపోతుంది అప్పు.

ఇగో సమస్య అనుకున్నా

తను ఏదో చిరాకులా ఉంది అని కనకంకు సర్ది చెప్పుతాడు కృష్ణమూర్తి. మరోవైపు ఆఫీస్‌కు వచ్చిన శ్వేతకు జరిగింది చెబుతాడు రాజ్. లేదు ఇంత పెద్ద పని ఎలా చేశావ్. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని ఫైర్ అవుతుంది. కళావతి కూడా నమ్మలేకపోతుంది. కానీ కళ్ల ముందు బాబు కనిపిస్తున్నాడు కదా అని రాజ్ అంటాడు. అప్పుడే వచ్చిన కావ్య వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. షటప్ రాజ్. అలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా. ఇన్నాళ్లు కావ్య వద్దనుకుంటే ఇగో సమస్య అనుకున్నా. కానీ, మనసులో ఇంకో ఆడది ఉందని అంచనా వేయలేకపోయాను అని శ్వేత అంటుంది.

నన్ను అడ్డు పెట్టుకుని కావ్యకు విడాకులు ఇవ్వాలని చూస్తే.. ఏదో ఒక రోజు కావ్య గొప్ప మనుస అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను. సంవత్సరం ఒకే గదిలో ఉన్నారు కదా. ఆ పిచ్చిదాన్ని చూస్తే జాలి కలగలేదా. నువ్ చెబుతుంటే నాకే రక్తం మరిగిపోతుంది. ఆ పిచ్చిది ఈ బాధను గుండెల్లో ఎలా మోస్తుందో. నువ్ జీవితం అనుకుని బతుకుంది. అలాంటిది నువ్ ఇలా చేస్తావా. మీ అమ్మ, ఇంట్లోవాళ్లు సూటిపోటి మాటలు అంటున్నా నీకోసం బతుకుతుంది. కనీసం బలి ఇచ్చే మేకకు అయిన అప్పటివరకు బాగా చూసుకుంటారు. కానీ, నువ్ ఇప్పటివరకు నరకం చూపించి మరి బలి ఇచ్చావ్ అని శ్వేత అంటుంది.

మంచితనం ముసుగులో

నీ మనసులో ఇంత పెద్ద కుట్ర ఉందని ఊహించలేదు. ఆడవాళ్లు అంటే దేవతలు అని మీటింగ్‌లో చెబుతుంటావ్. ఇదేనా నీ సంస్కారం. నలుగురికి చెప్పడానికేనా నీ నీతులు. నీకన్నా నా మొగుడే నయం కదా రాజ్. వాడు శాడిస్ట్ అని చెప్పి మరి టార్చర్ చేశాడు. వాడు చేసిన గాయాలు మానిపోతాయి. కానీ, నువ్ మంచితనం ముసుగులో చేసిన గాయం ఆ పిచ్చిది జీవింతాతం మోయాల్సిందే. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని చాలా ఫైర్ అయి వెళ్లిపోతుంది శ్వేత.

అప్పటి వరకు ఆ మాటలు విన్న కావ్య.. అంటే ఆయన ఫ్రెండ్‌కు కూడా బాబు గురించి తెలియదన్నమాట. ఇన్నాళ్లు దాచిపెట్టి ఇప్పుడే ఎందుకు బాబును తీసుకొచ్చాడు. అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది అని ఆలోచిస్తుంది. మరోవైపు బాబుకు బొమ్మలు కొంటుంది కావ్య. అటువైపు మార్కెట్‍‌కు వెళ్లి వస్తూ కనకం, కృష్ణమూర్తి కావ్యకు ఎదురుపడతారు. కావ్యను బొమ్మలతో చూసి షాక్ అవుతారు తన తల్లిదండ్రులు.

రోడ్డున పడింది

నా కూతురు జీవితం ఎంత గొప్పగా ఉందో చూశావా. ఆ అంతపురంలో రాజ్ చిన్న యువరాణి కొడుకుకు ఆట వస్తువులు తీసుకెళ్లేందుకు రోడ్డున పడింది అని కనకం అంటుంది. ఏంటమ్మా.. ఇవి నువ్ తీసుకెళ్లడం ఏంటీ. పరిస్థితులతో రాజీపడిపోయావా అని కావ్యను తండ్రి కృష్ణమూర్తి అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point