Bigg Boss Telugu 8: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో కన్‌ఫ్యూజన్.. 9 మందిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు?
Bigg Boss Telugu 8 Seventh Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్‌లో 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారికి ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్ నమోదు అవుతోంది. మరి ఈ తొమ్మిది మందిలో ఎవరెవరికీ ఎన్ని ఓట్లు పడుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదటి కంటే ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వైల్డ్ క్లాన్ ఎంట్రీలతో గేమ్ జోరందుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో స్మార్ట్ ఫోన్, ఛార్జింగ్ టాస్క్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ రెండు రోజులపాటు రచ్చ రచ్చగా సాగిన విషయం తెలిసిందే.
నామినేషన్స్‌లో 9 మంది
బిగ్ బాస్ 8 తెలుగు ఏడో వారం నామినేషన్స్‌లో 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అలా ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్ కృష్ణ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, నబీల్ అఫ్రిది, నిఖిల్ మలియక్కల్, నాగ మణికంఠ, యష్మీ గౌడ, ప్రేరణ కంబం, హరితేజ ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే ఓటింగ్ పోల్ ఓపెన్ అయిపోయింది.
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం ఓటింగ్ ఊహించని విధంగా ఉంది. ఏడో వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో నిఖిల్, నబీల్ టాప్‌లో ఉన్నారు. అంటే, మొదటి స్థానంలో అత్యధిక ఓట్లతో నిఖిల్ ఉంటే.. రెండో స్థానంలో నబీల్ ఉన్నాడు. నిఖిల్‌కు 16.97 శాతం ఓటింగ్ (4,842 ఓట్లు) రాగా నబీల్‌కు 16.65 శాతం ఓటింగ్ (4,750 ఓట్లు) వచ్చాయి.
టాప్ లేడి కంటెస్టెంట్‌గా
ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉంది. ప్రేరణకు 12.6 శాతం ఓటింగ్ (3,595 ఓట్లు) వచ్చాయి. దీంతో టాప్‌లో ఉన్న లేడి కంటెస్టెంట్‌గా ప్రేరణ నిలిచింది. ఆమె తర్వాత నాగ మణికంఠ 12.33 శాతం ఓటింగ్ (3,518 ఓట్లు)తో నాలుగో ప్లేసులో నిలిచాడు. ఇక ఐదో స్థానంలో 9.36 శాతం ఓటింగ్ (2,671 ఓట్లు)తో యష్మీ ఉంది. 8.67 శాతం ఓటింగ్, 2,474 ఓట్లతో ఆరో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు.
వీరి తర్వాత ఏడో స్థానంలో టేస్టీ తేజ 8.28 శాతం ఓటింగ్‌తో 2,361 ఓట్లు రాబట్టుకున్నాడు. ఇక ఎనిమిది స్థానంలో పృథ్వీ (7.88 శాతం ఓటింగ్, 2,249 ఓట్లు), తొమ్మిదో స్థానంలో హరితేజ (7.24 శాతం ఓటింగ్, 2,065 ఓట్లు) ఉన్నారు. అంటే, ఈ పోలింగ్ ప్రకారం పృథ్వీ, హరితేజ ఎలిమినేషన్‌కు డేంజర్ జోన్‌లో ఉన్నారు.
డిఫరెంట్ ఓటింగ్
మంచి బాడీ బిల్డర్, మోడల్ అయిన పృథ్వీ ఇప్పటికీ చాలాసార్లు డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ, ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా పృథ్వీ మళ్లీ డేంజర్ జోన్‌లో ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఒక్కో ఓటింగ్ పోల్‌లో ఒక్కొక్కరు లీస్ట్ ఓటింగ్‌లో (డేంజర్ జోన్) ఉన్నట్లు చూపిస్తోంది. ఈ పోల్‌లో హరితేజ చివరిలో ఉంటే.. మరొక ఓటింగ్ పోల్‌లో గౌతమ్ కృష్ణ ఉన్నట్లు చెబుతున్నారు.
అలాగే, మరికొన్ని బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్ పోల్స్‌లో టేస్టీ తేజ కూడా ఉన్నట్లు అనధికారిక ఓటింగ్ పోల్ నివేదికలు చెబుతున్నాయి. అంటే, ప్రస్తుతానికి హరితేజ, గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీ నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే. దీంతో బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం ఎలిమినేషన్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.
ఈవారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇలా ఎలిమినేషన్ ఎవరనేది ఓటింగ్ పోల్స్ ద్వారా చెప్పలేకపోవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ఎవరికి నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్‌కు వాళ్లకే ఓటింగ్ చేసుకోవడం బెటర్ అని తెలుస్తోంది. ఎందుకుంటే బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం కష్టమే!.
టాపిక్