Animal Park Movie: ‘యానిమల్ పార్క్’పై అప్‍డేట్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. అప్పటి వరకు వేచిచూడాల్సిందే!-animal park movie update sandeep reddy vanga shares about animal 2 film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Park Movie: ‘యానిమల్ పార్క్’పై అప్‍డేట్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. అప్పటి వరకు వేచిచూడాల్సిందే!

Animal Park Movie: ‘యానిమల్ పార్క్’పై అప్‍డేట్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. అప్పటి వరకు వేచిచూడాల్సిందే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 20, 2024 06:24 PM IST

Animal Park Movie - Sandeep Reddy Vanga: యానిమల్ పార్క్ చిత్రంపై హైప్ మామూలుగా లేదు. యానిమల్ బ్లాక్ బస్టర్ అవటంతో దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఉంది. అయితే, యానిమల్ పార్క్ గురించి తాజాగా అప్‍డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ డీటైల్స్ ఇవే.

Animal Park Movie: ‘యానిమల్ పార్క్’పై అప్‍డేట్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. అప్పటి వరకు వేచిచూడాల్సిందే!
Animal Park Movie: ‘యానిమల్ పార్క్’పై అప్‍డేట్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. అప్పటి వరకు వేచిచూడాల్సిందే!

Animal Park: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన వైలెంట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రంలో మితిమీరిన హింస, మహిళలపై దాడులను ప్రోత్సహించేలా ఉందనే అభ్యంతరాలు, విమర్శలు చాలా వచ్చాయి. చర్చలు సాగాయి. మరోవైపు బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. అయితే, యానిమల్ మూవీకి సీక్వెల్‍గా యానిమల్ పార్క్ తీసుకొస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

యానిమల్ పార్క్ సినిమా ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో మెండుగా ఉంది. ఈ చిత్రంపై క్రేజ్ విపరీతంగా నెలకొని ఉంది. అయితే, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో తాజాగా సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.

షూటింగ్ అప్పటి నుంచే..

యానిమల్ పార్క్ సినిమా షూటింగ్ పనులు 2026లో మొదలవుతాయని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. యానిమల్‍తో పోలిస్తే.. ఈ సీక్వెల్ మరింత వైల్డ్‌గా, భారీగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

యానిమల్ పార్క్ షూటింగ్ 2026లో మొదలైతే.. 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ చిత్రం కోసం ఇంకా కనీసం మూడేళ్లయినా వేచిచూడాల్సిందేనని అర్థమైంది.

సందీప్ రెడ్డి వంగా లైనప్

రెబల్ స్టార్ ప్రభాస్‍తో రూపొందించే ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని ఇటీవల ఆయన చెప్పారు. డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. అలాగే, ఈ మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍తో సందీప్ మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాతే యానిమల్ పార్క్ మూవీని ఆయన సెట్స్‌పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

రామాయణంలో రణ్‍బీర్ బిజీ

హీరో రణ్‍బీర్ కపూర్.. ప్రస్తుతం రామాయణం సినిమా చేస్తున్నారు. మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా స్టార్ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ మూవీలో ఆయన శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటించనున్నారు. ఈ చిత్రానికి రణ్‍బీర్ కపూర్ సుమారు సంవత్సరం సమయం కేటాయించారని తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతోనూ మరో చిత్రం చేయనున్నారు రణ్‍బీర్. దీంతో 2026 యానిమల్ పార్క్‌ను పట్టాలెక్కించేలా సందీప్ రెడ్డి, రణ్‍బీర్ ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతోంది.

యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్నా హీరోయన్‍‍గా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి, చారు శంకర్, శక్తి కపూర్ కీలకపాత్రలు చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.