Animal Park Movie: ‘యానిమల్ పార్క్’ సినిమా ఎలా ఉండనుందో హింట్ ఇచ్చిన రణ్‍బీర్ కపూర్-bollywood news ranbir kapoor says animal park movie more deeper and darker ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Park Movie: ‘యానిమల్ పార్క్’ సినిమా ఎలా ఉండనుందో హింట్ ఇచ్చిన రణ్‍బీర్ కపూర్

Animal Park Movie: ‘యానిమల్ పార్క్’ సినిమా ఎలా ఉండనుందో హింట్ ఇచ్చిన రణ్‍బీర్ కపూర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 28, 2024 11:22 PM IST

Ranbir Kapoor about Animal Park Movie: యానిమల్ పార్క్ సినిమా గురించి తాజాగా ఓ హింట్ ఇచ్చారు హీరో రణ్‍బీర్ కపూర్. మూవీ ఎలా ఉండొచ్చో చెప్పారు. యానిమల్ సినిమాతో చర్చ మొదలైందని అని అన్నారు.

రణ్‍బీర్ కపూర్
రణ్‍బీర్ కపూర్

Animal Park Movie: యానిమల్ సినిమా ఎంత బ్లాక్‍బాస్టర్ అయిందో.. అంతే వివాదాస్పదమైంది. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్‍గా నిలిచింది. అయితే, విపరీతమైన హింస, మహిళలను కించపరిచే విధంగా యానిమల్ ఉందంటూ విమర్శలు వచ్చాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇలా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్‍పై విభిన్న స్పందనలు వినిపించాయి. అయితే, యానిమల్‍కు సీక్వెల్‍గా ‘యానిమల్ పార్క్’ కూడా మేకర్స్ ప్రకటించేశారు.

yearly horoscope entry point

యానిమల్ పార్క్ మరింత వైలెంట్‍గా ఉండనుందో యానిమల్ సినిమా చివర్లోనే చూపించేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి అధికంగా పెరిగిపోయింది. ఈ తరుణంలో ఈ చిత్రంపై హీరో రణ్‍బీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ కోసం స్టాండప్ కమెడియన్ అనుభవ్ సింగ్ బాసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘యానిమల్ పార్క్’ గురించి రణ్‍బీర్ స్పందించారు.

యానిమల్ సినిమా మంచి సక్సెస్ అవడంతో యానిమల్ పార్క్‌ను సందీప్ రెడ్డి వంగా మరింత డార్క్ గా, లోతుగా తెరకెక్కించే ధైర్యం చేస్తారని రణ్‍బీర్ చెప్పారు. అంటే, ఆ మూవీ మరింత వైలెన్స్, బోల్డ్‌గా ఉంటుందని హింట్ ఇచ్చారు. “ఆయన (సందీప్ రెడ్డి వంగా) నాకు ఒకటి, రెండు సీన్లు చెప్పారు. అవి చాలా ఎగ్జైటింగ్‍గా ఉన్నాయి. పార్ట్ వన్ సక్సెస్ అవడంతో.. మరింత డార్క్‌గా, డీప్‍గా, సంక్లిష్టతతో తెరకెక్కించేందుకు నమ్మకం, ధైర్యం ఆయనకు వచ్చింది. ఆయన ఏమైనా చేయగలడు” అని రణ్‍బీర్ కపూర్ చెప్పారు.

నెగెటివ్ స్పందన గురించి..

యానిమల్ మూవీకి వచ్చిన నెగెటివ్ అభిప్రాయాల గురించి కూడా రణ్‍బీర్ కపూర్ స్పందించారు. ఈ సినిమా వల్ల సమాజంలో ఆరోగ్యకరమైన చర్చ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజానికి చేటు చేసే విషయాలపై పాజిటివ్ చర్చలు ఈ సినిమా వల్ల మొదలవడం లాభదాయకమనేలా చెప్పారు. చర్చ మొదలైతేనే ఏది తప్పో తెలిసి వస్తుంది కదా అని రణ్‍బీర్ అన్నారు.

యానిమల్ మూవీ స్టోరీ గురించి ముందుగా బాబీ డియోల్‍కు తెలియదని, తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ మూవీ అని మాత్రమే అనిల్ కపూర్‌కు తెలుసని రణ్‍బీర్ చెప్పారు. స్క్రిప్ట్‌లోని చాలా విషయాల్లో సందీప్ రెడ్డి వంగా రహస్యంగా ఉంటారని అన్నారు. సినిమా షూటింగ్‍కు ముందే పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేసుకున్నారని రణ్‍బీర్ వెల్లడించారు. షూటింగ్ సమయంలో బీజీఎం వినడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగ్గా వస్తుందని చెప్పారు.

యానిమల్ సినిమా ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇండియాలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

యానిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. విలన్ పాత్రలో బాబీ డియోల్ నటన ఈ మూవీకి మరో హైలైట్‍గా నిలిచింది. రణ్‍బీర్ తండ్రి పాత్రలో ఈ మూవీలో నటించారు సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్. తృప్తి డిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, చారు శంకర్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం