Animal Sequel: యానిమల్‍కు సీక్వెల్.. టైటిల్ కూడా రివీల్-animal movie ended with hint of a sequel title also revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Sequel: యానిమల్‍కు సీక్వెల్.. టైటిల్ కూడా రివీల్

Animal Sequel: యానిమల్‍కు సీక్వెల్.. టైటిల్ కూడా రివీల్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2023 05:19 PM IST

Animal Sequel: యానిమల్ సినిమాకు సీక్వెల్ రావడం పక్కాాగా కనిపిస్తోంది. పార్ట్-2 సంబంధించిన టైటిల్‍ కూడా రివీల్ అయింది. ఆ వివరాలు ఇవే.

Animal Sequel: యానిమల్‍కు సీక్వెల్.. టైటిల్ కూడా రివీల్
Animal Sequel: యానిమల్‍కు సీక్వెల్.. టైటిల్ కూడా రివీల్

Animal Sequel: విపరీతమైన హైప్ మధ్య యానిమల్ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. అంచనాలకు తగ్గట్టే తీవ్రమైన వైలెన్స్‌తో ఈ మూవీ రూపొందింది. యానిమల్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కాగా, ఈ సినిమాకు ఓపెన్ ఇండింగ్ ఇచ్చారు మేకర్స్. సీక్వెల్‍ రానుందంటూ చెప్పేశారు. యానిమల్ పార్ట్-2 టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఆ వివరాలు ఇవే.

యానిమల్ సినిమా క్లైమాక్స్ ముగిశాక క్రెడిట్ టైటిల్స్ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది. ఈ చిత్రాన్ని ఓపెన్ ఇండింగ్‍తో డైరెక్టర్ ముగించారు. దీంతో యానిమల్ పార్ట్-2 ఉండనుందని స్పష్టమైంది. ఈ మూవీ సీక్వెల్‍కు ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. మూవీ చివర్లోనే ఈ టైటిల్‍ను మేకర్స్ చూపించేశారు.

యానిమల్ క్రెడిట్ టైటిల్స్ అయిపోయాక సీన్ మిస్ అవొద్దని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవలే కొన్నిసార్లు ప్రేక్షకులకు చెప్పారు. అందుకు తగ్గట్టే చివర్లో ఓ అనూహ్యమైన వైలెంట్ సీన్ తర్వాత సీక్వెల్ టైటిల్ రివీల్ అయింది.

యానిమల్ చిత్రానికి తొలి రోజు హిందీతో పాటు తెలుగులోనూ భారీగా బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమాకు తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.100కోట్ల దరిదాపుల్లో గ్రాస్ కలెక్షన్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఆ రేంజ్‍లో టికెట్ల బుకింగ్స్ సాగాయి. మంచి టాక్ రావటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

యానిమల్ మూవీలో రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రణ్‍బీర్ యాక్టింగ్‍కు ప్రశంసలు భారీగా వస్తున్నాయి. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

యానిమల్ మూవీకి అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎడిటింగ్ కూడా చేశారు. మొత్తంగా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‍రాజు సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం