Janasena Candidates : ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చిన పవన్ - సర్పంచ్ కు MLA టికెట్-railway koduru janasena candidate changed ticket is allotted to sridhar ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Candidates : ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చిన పవన్ - సర్పంచ్ కు Mla టికెట్

Janasena Candidates : ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చిన పవన్ - సర్పంచ్ కు MLA టికెట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 04, 2024 09:32 PM IST

Janasena Candidates in AP Elections 2024 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ముందుగా ప్రకటించిన అభ్యర్థిని మారుస్తూ… మరో అభ్యర్థికి టికెట్ ను కేటాయించారు.

అరవ శ్రీధర్ కు జనసేన టికెట్
అరవ శ్రీధర్ కు జనసేన టికెట్

Janasena Candidates in AP Elections 2024 : కూటమిలో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో లోతుగా కసరత్తు చేస్తోంది జనసేన(Janasena) నాయకత్వం. కూటమిలో భాగంగా… 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుండగా.. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే రైల్వేకోడూరూ నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. ముందుగా ప్రకటించిన అభ్యర్థిని మార్చి… మూడు రోజుల కిందటే పార్టీలో చేరిన నేతకు టికెట్ కేటాయించారు. 

అలా చేరి… ఇలా టికెట్ పట్టేశాడు..

పొత్తులో భాగంగా.. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేయనున్నారు. ఈ స్థానం కోసం ముందుగా యనమల భాస్కర్ రావు పేరును ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆయన్ను పోటీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు పవన్ (Pawan Kalyan). ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానాన్ని మూడు రోజుల కింద పార్టీలో చేరిన ముక్కావారిపల్లె సర్పంచ్ అరవ శ్రీధర్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇయన ఏప్రిల్ 1వ తేదీన పిఠాపురం వేదికగా పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. 

క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నేతలు అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జనసేన నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీసిన తర్వాత… ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇందులో పేర్కొన్నారు.

అవనిగడ్డ అభ్యర్థిగా బుద్ధ ప్రసాద్….

మరోవైపు అవనిగడ్డ (Avanigadda Assembly constituency)అభ్యర్థిని ఖరారు చేశారు పవన్ కల్యాణ్.  ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ద ప్రసాద్ ‌(mandali buddha prasad )కు టికెట్ కేటాయించారు. ఆయన ఇటీవలనే జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ నుంచి బుద్దప్రసాద్  1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేశార. ,2012 అక్టోబరులో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘంకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడిన ఆయన.. తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో  అవనిగడ్డ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందారు.ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా ఎన్నుకోబడ్డారు. 2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి మరోసారి పోటీ చేసిన ఆయన… వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ప్రస్తుతం కూటమిలో భాగంగా……తెలుగుదేశం నుంచి టికెట్ దక్కే పరిస్థితి లేకపోవటంతో, జనసేనలో చేరారు. దీంతో ఆయనకు మరోసారి అవనిగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం దక్కినట్లు అయింది.

ఇక కేంద్ర ఎన్నికల సంఘం(EC) గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను తాజాగా విడుదల చేసింది. ఈసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ ఉండగా జనసేనను(Janasena) రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్‌ గుర్తు కేటాయించింది ఈసీ. అయితే జనసేనకు ఫ్రీ సింబల్‌(Free Symbol) గ్లాసు గుర్తును(Glass Symbol) కేటాయించింది. జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీ గుర్తించకపోవడం విశేషం. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.