Pawan Kalyan : ఫ్యాన్స్ ముసుగులో వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు-pithapuram janasena chief pawan kalyan sensational comments paid blade batch attack ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Pithapuram Janasena Chief Pawan Kalyan Sensational Comments Paid Blade Batch Attack

Pawan Kalyan : ఫ్యాన్స్ ముసుగులో వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Apr 01, 2024 08:57 PM IST

Pawan Kalyan : వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కిరాయి మూకలు ఫ్యాన్స్ ముసుగులో వచ్చి బ్లేడులతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ... జనసేన గ్లాసుకి(Janasena Glass) పదునెక్కువ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాబోతోందని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జనసేన అభ్యర్థులతోపాటు కూటమి పోటీ చేసిన స్థానాల్లో మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. సోమవారం సాయంత్రం పిఠాపురం నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. న్యాయవాదులు, ప్రముఖ వైద్యులు, వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రముఖులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. సుమారు 100 మందికి పైగా పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "జనసేన పార్టీని అర్థం చేసుకుని బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరినీ సాదరంగా జనసేన కుటుంబలోకి ఆహ్వానిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మొత్తాన్ని కలవాలన్న ఆశ ఉన్నప్పటికీ కొన్ని భద్రతాపరమైన కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిరాయి మూకలు సన్నటి బ్లేడులతో(Blade attacks) వచ్చి జనంలో కలసిపోయి మన మీద దాడులు చేస్తున్నారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు వెళ్లాలి" అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ

పిఠాపురం(Pithapuram) ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)హామీ ఇచ్చారు. తనను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచిందన్నారు. ఆ తల్లి.. పురుహూతికా అమ్మ వారు అనుమతి ఇస్తే ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటానన్నారు. అందర్నీ ప్రత్యేకించి కలుస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటానన్నారు. నియోజక వర్గ ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి బాధ్యత తనదని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు ఉదయ్ శ్రీనివాస్ నిదర్శనమన్నారు. వచ్చే 25 సంవత్సరాల కాలంలో కొత్తతరం నాయకులు ముందుకు రావాలన్నారు. ఇప్పటి నుంచి నిలబడితేనే రేపటి రోజున నాయకులు తయారవుతారన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు నాయకుల్ని తయారు చేస్తుందన్నారు. వైసీపీ (Ysrcp)ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ అని పవన్ కల్యాణ్ అన్నారు.

జనసేనలో చేరిన మండలి బుద్ద ప్రసాద్

మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్(Mandali Buddha Prasad) సోమవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో(Pithapuram) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పలువురు ముఖ్య నేతలు జనసేనలో(Janasena) చేరారు. పాలకొండ నియోజక వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. పిఠాపురంలో ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముక్కావారిపల్లె సర్పంచ్ అరవ శ్రీధర్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

WhatsApp channel

సంబంధిత కథనం