Avanigadda Janasena: జనసేనలోకి మండలి బుద్ద ప్రసాద్…అవనిగడ్డ అభ్యర్థిత్వం ఖరారైనట్టే, నేడోరేపో పార్టీ సభ్యత్వం..?-mandali buddha prasad to janasena avanigaddas candidature confirmed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Avanigadda Janasena: జనసేనలోకి మండలి బుద్ద ప్రసాద్…అవనిగడ్డ అభ్యర్థిత్వం ఖరారైనట్టే, నేడోరేపో పార్టీ సభ్యత్వం..?

Avanigadda Janasena: జనసేనలోకి మండలి బుద్ద ప్రసాద్…అవనిగడ్డ అభ్యర్థిత్వం ఖరారైనట్టే, నేడోరేపో పార్టీ సభ్యత్వం..?

Sarath chandra.B HT Telugu
Apr 01, 2024 09:12 AM IST

Avanigadda Janasena: మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్‌ జనసేనలో చేరనున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా అవనిగడ్డ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయించడంతో అనూహ్యం మండలి బుద్ద ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది.

అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ద ప్రసాద్
అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ద ప్రసాద్

Avanigadda Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన  Janasena పోటీ చేసే నియోజక వర్గాల్లో రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ Avanigaddaతో పాటు శ్రీకాకుళం Srikakulam జిల్లా పాలకొండ నియోజక వర్గాలకు అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. 21 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. వీటిలో 19 నియోజక వర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేశారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ Avanigadda నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయించడంపై కొద్ది రోజులుగా నిరసనలు రేగుతున్నాయి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్  mandali buddha prasad 2014లో టీడీపీ TDPలో చేరారు. అవనివగడ్డ నుంచి గెలిచి ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ dy Speaker పదవి చేపట్టారు. 2019లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై మండలి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండే అవనిగడ్డలో గెలుపు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో అవనిగడ్డను జనసేనకు కేటాయించారు.బాలశౌరి చేరికతో అప్పటి వరకు మచిలీపట్నం నియోజక వర్గం ఆశించిన

జనసేన తరపున అవనిగడ్డ నియోజకవర్గంలో పోటీ చేయడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి తన కుమారుడిని అవనిగడ్డలో పోటీ చేయించాలని భావించారు. బాలశౌరి ఎంట్రీతో అప్పటికే పార్టీలో ఉన్న మిగిలిన నేతలు తమకు కూడా అవకాశం కావాలని పోటీ పడటంతో పీటముడి వీడటం లేదు.

మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ వయోభారంతో పాటు ఎన్నికల ఖర్చును తట్టుకోలేక పోటీ చేయలేనని చెప్పినట్టు మొదట ప్రచారం జరిగింది.టీడీపీ టిక్కెట్ జనసేనకు కేటాయించడంతో కినుక వహించిన మండలి బుద్ద ప్రసాద్ తాను పోటీ నుంచి తప్పుకోవడం ఉత్తమమని నిష్టురాలు పోయారు. టీడీపీ తొలి జాబితా విడుదలైనపుడు “ఈ రోజు మొదటి విడత లిస్ట్ లో నా పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను. పంజరం లోంచి బయటకు వచ్చిన పక్షి లాగా స్వేచ్చా స్వాతంత్య్రాలు పొందినట్లు ఉంది. దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండి.” అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు ఇవ్వడం మండలిని బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మండలి బుద్ద ప్రసాద్‌కు మద్దతుగా కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనలో అవనిగడ్డ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణలు అవనిగడ్డ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో పలుమార్లు అవనిగడ్డ అభ్యర్థి ఎంపిక కోసం ఐవిఆర్‌ఎస్ సర్వేలు నిర్వహించారు.

తాజాగా మండలి బుద్ద ప్రసాద్‌ను జనసేనలో చేర్చుకుని పోటీ చేయించాలనే ప్రతిపాదనను ఆ పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి మండలి బుద్ద ప్రసాద్ జనసేనలో అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్త అభ్యర్థుల కంటే మండలి బుద్ద ప్రసాద్‌ అభ్యర్థిత్వం మేలనే నిర్ణయానికి జనసేన, టీడీపీ నేతలు వచ్చారు.

ఈ ప్రతిపాదనకు మండలి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మండలి బుద్దప్రసాద్ 1999, 2004లో కాంగ్రెస్‌ ఐ తరపున గెలిచారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

బుద్దప్రసాద్ 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ తరపున గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ చేతిలో ఓటమి పాలయ్యారు.తిరిగి మరోసారి అదృష్టం కలిసొస్తే ఎమ్మెల్యే అవుతారని అనుచరులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం