Richa Ghosh: పాక్‌పై ధోనీని తలపించిన రిచా ఘోష్.. వికెట్ల వెనుక మ్యాజిక్
India Women vs Pakistan Women: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ జట్టు.. రెండో మ్యాచ్‌కి పుంజుకుంది. పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిచా ఘోస్ ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ -2024లో భారత్ వికెట్ కీపర్ రిచా ఘోస్ ఈరోజు పాకిస్థాన్‌పై అద్భుతమైన ప్రదర్శనని కనబర్చింది.మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. గత న్యూజిలాండ్ మ్యాచ్ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న భారత్ బౌలర్లు పాకిస్థాన్‌ను 105 పరుగులకే కట్టడి చేశారు.
మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాను ఔట్ చేయడానికి రిచా ఘోస్ వికెట్ వెనుక మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తలపిస్తూ క్యాచ్ పట్టింది. 8 బంతులు ఎదురొన్న పాతిమ రెండు బౌండరీలు కొట్టి భారత్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ.. ఆశా శోభన వేసిన బంతిని హిట్ చేయబోయి కీపర్ రిచాకి దొరికిపోయింది.
పాతిమ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి దూసుకురాగా.. కుడివైపునకు ఫుల్ డైవ్ చేసినరిచా రెప్పపాటులో బంతిని క్యాచ్‌గా ఒంటిచేత్తో అందుకుంది. మ్యాచ్ కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే ఈ క్యాచ్‌కి.. క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి.
భారత్ జట్టుకి సెమీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయగా.. పాకిస్థాన్ ఒకానొక దశలో 14.5 ఓవర్లకి 71/7తో నిలిచి.. కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ.. చివర్లో నిదా దార్, సయ్యదా అరూబ్ షా కలిసి పాక్ స్కోరుని 100 పరుగులకి దాటించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, శ్రేయాంకా పాటిల్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా భారత్ జట్టు తర్వాత మ్యాచ్‌లను శ్రీలంక, ఆస్ట్రేలియాతో ఆడనుంది.