SRH vs CSK : ఉప్పల్​లో ‘ధోనీ’ మేనియా- సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి చెత్త స్టాట్స్​- ఈసారి గెలుపెవరిది?-srh vs csk head to head stats ipl 2024 pitch report and other details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Csk : ఉప్పల్​లో ‘ధోనీ’ మేనియా- సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి చెత్త స్టాట్స్​- ఈసారి గెలుపెవరిది?

SRH vs CSK : ఉప్పల్​లో ‘ధోనీ’ మేనియా- సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి చెత్త స్టాట్స్​- ఈసారి గెలుపెవరిది?

Sharath Chitturi HT Telugu
Apr 05, 2024 08:10 AM IST

SRH vs CSK IPL 2024 : హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియం వేదికగా నేడు సీఎస్​కేతో తలపడనుంది ఎస్​ఆర్​హెచ్​. కాగా.. సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి చెత్త స్టాట్సే ఉన్నాయి!

ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ సీఎస్​కే హెడ్​ టు హెడ్​ స్టాట్స్​ ఇవే..
ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ సీఎస్​కే హెడ్​ టు హెడ్​ స్టాట్స్​ ఇవే.. (ANI)

SRH vs CSK 2024 : ఉప్పల్​లో మరో పవర్​ ప్యాక్ట్​డ్​, హై ఓల్టేజ్​ యాక్షన్​కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు.. చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. ఫోకస్​ అంతా మహేంద్ర సింగ్​ ధోనీపైనే ఉండనుంది.

ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ సీఎస్​కే- హెడ్​ టు హెడ్​ స్టాట్స్​..

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్​ అవుతుందన్న వార్తల నేపథ్యంలో అతడిని చూసేందుకు ఫ్యాన్స్​ ఎగబడుతున్నారు. అందుకే.. ధోనీ ఆడే మ్యాచ్​లన్నీ దాదాపు హౌజ్​ ఫుల్​ అవుతున్నాయి. ఉప్పల్​ ఇందుకు అతీతం కాదు! ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ సీఎస్​కే మ్యాచ్​ టికెట్​ బుకింగ్స్​ మొదలుపెట్టిన 2 గంటల్లోనే అవి పూర్తైపోవడం.. ధోనీకి ఉన్న క్రేజ్​ని స్పష్టంగా చెబుతోంది. ఎస్​ఆర్​హెచ్​ అభిమానులు కూడా.. ధోనీని చూడాలని తహతహలాడుతున్నారు. అందుకే.. ఈ రోజు జరిగే మ్యాచ్​లో ధోనీ మేనియా కచ్చితంగా కనిపిస్తుంది.

SRH vs CSK head to head : ఇక స్టాట్స్​ విషయానికొస్తే.. సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి చెత్త స్టాట్స్​ ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 19 మ్యాచ్​లలో తలపడ్డాయి. చెన్నై సూపర్​ కింగ్స్​ 14సార్లు గెలవగా.. సన్​రైజర్స్​ హైదరాబాద్​ కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది.

ఎస్​ఆర్​హెచ్​పై సీఎస్​కే హైస్కోర్​ 223గా ఉంది. లో- స్కోర్​ 132గా ఉంది. ఇక సీఎస్​కేపై ఎస్​ఆర్​హెచ్​కి హైస్కోర్​ 192గాను లో- స్కోర్​ 134గాను ఉంది.

అయితే.. ఐపీఎల్​ 2024లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మ్యాచ్​లలో పరుగులు ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్​లో ముంబైతో జరిగిన మ్యాచ్​లో 277 పరుగులు చేసింది ప్యాట్​ కమిన్స్​ సేన. ఇది ఐపీఎల్​ చరిత్రలోనే ఒక రికార్డ్​. ఇక ఈరోజు జరిగే మ్యాచ్​లో కూడా పరుగుల ప్రవాహం ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ధోనీ డాషింగ్​ బ్యాటింగ్​ని చూడాలని ఎదురుచూస్తున్నారు.

పిచ్​ రిపోర్ట్​:- హైదరాబాద్​ పిచ్​ని అంచనా వేయడం చాలా కష్టం. ఇక్కడ అనేక లో-స్కోరింగ్​ మ్యాచ్​లు జరిగాయి. అప్పుడప్పుడు బ్యాటర్ల మెరుపులూ కనిపించాయి. కానీ ఇక్కడ హిట్టింగ్​ చేయడం కష్టం అనే చెబుతున్నారు.

SRH vs CSK tickets : ఐపీఎల్​ 2024లో 3 మ్యాచ్​లు ఆడిన సీఎస్​కే.. 2 మ్యాచ్​లలో గెలిచి 3వ స్థానంలో ఉంది. 3 మ్యాచ్​లు ఆడిన ఎస్​ఆర్​హెచ్​.. 1 మ్యాచ్​లో మాత్రమే గెలిచి 7వ స్థానంలో కొనసాగుతోంది.

ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ సీఎస్​కే- జట్లు (అంచనా)..

ఎస్​ఆర్​హెచ్​ జట్టు:- మయాంక్​ అగర్వాల్​, ట్రావిస్​ హెడ్​, అభిషేక్​ శర్మ, ఎయిడెన్​ మాక్రమ్​, హెన్రిక్​ క్లాసెన్​, అబ్దుల్​ సమద్​, షహ్​బాజ్​ అహ్మద్​, ప్యాట్​ కమిన్స్​, భువనేశ్వర్​ కుమార్​, మయాంక్​ మార్కండే, జయ్​దేవ్​ ఉనద్కట్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​ వాషింగ్టన్​ సుందర్​).

MS Dhoni IPL 2024 : సీఎస్​కే జట్టు:- రచిన్​ రవింద్ర, రుతురాజ్​ గైక్వాడ్​, ఆజింక్య రహానే, శివమ్​ దూబే, డరిల్​ మిచెల్​, సమీర్​ రిజ్వి, రవీంద్ర జడేజా, ఎంఎస్​ ధోనీ, దీపక్​ చాహర్​, తుషార్​ దేశ్​పాండే, మతీశ పథిరాణ/ శార్దుల్​ ఠాకూర్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​- మహేశ్​ థీక్షణ)

Whats_app_banner

సంబంధిత కథనం