CSK VS GT : సీఎస్​కేపై గుజరాత్​ టైటాన్స్​దే పైచేయి.. ఈసారి ఏం జరుగుతుంది?-csk vs gt ipl 2024 match 7 head to head count and other details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Gt : సీఎస్​కేపై గుజరాత్​ టైటాన్స్​దే పైచేయి.. ఈసారి ఏం జరుగుతుంది?

CSK VS GT : సీఎస్​కేపై గుజరాత్​ టైటాన్స్​దే పైచేయి.. ఈసారి ఏం జరుగుతుంది?

Sharath Chitturi HT Telugu
Mar 26, 2024 06:49 AM IST

CSK VS GT IPL 2024 : ఐపీఎల్​ 2024లో నేడు సీఎస్​కేతో తలపడనుంది జీటీ. ఈ రెండు జట్ల హెడ్​ టు హెడ్​ స్టాట్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ శుభ్​మాన్​ గిల్​..
గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ శుభ్​మాన్​ గిల్​.. (AFP)

CSK VS GT head to head : ఐపీఎల్​ 2024లో మరో రసవత్త మ్యాచ్​కి రంగం సిద్ధమైంది! మంగళవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు.. చెన్నై సూపర్​ కింగ్స్​ (సీఎస్​కే)- గుజరాత్​ టైటాన్స్​ (జీటీ) తలపడనున్నాయి. చెన్నై వేదికగా జరగుతోంది ఈ మ్యాచ్. రెండు జట్లకు యంగ్​ కెప్టెన్స్​ రావడంతో మ్యాచ్​పై అంచనాలు మరింత పెరిగాయి. రుతురాజ్​ గైక్వాడ్​ వర్సెస్​ శుభ్​మాన్​ గిల్​లో ఎవరు గెలుస్తారు? అని క్రికెట్​ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్​కే వర్సెస్​ జీటీ మ్యాచ్​ ప్రివ్యూ, హెడ్​-టు-హెడ్​ కౌంట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

సీఎస్​కే వర్సెస్​ జీటీ- గిల్​ సేనదే పైచేయి!

ఐపీఎల్​లో గుజరాత్​ టైటాన్స్​ కొత్త జట్టు. 2022లోనే ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకే ఈ జట్టు ఆడిన మ్యాచ్​ల సంఖ్య తక్కువగా ఉంటుంది. చెన్నై సూపర్​ కింగ్స్​తో ఐదు సార్లు తలపడింది గుజరాత్​ టైటాన్స్​. తక్కువ మ్యాచ్​లే ఆడినా అద్భుత ప్రదర్శన చేసింది! ఫలితంగా.. అరంగేట్రం చేసిన సీజన్​లోనే ట్రోఫీని అందుకుంది. ఇక.. సీఎస్​కేతో జరిగిన 5 మ్యాచ్​లలో 3సార్లు జీటీ విజయం సాధించింది. రెండు విజయాలు.. సీఎస్​కే ఖాతాలోకి వెళ్లాయి.

అంటే.. ఈ రెండు జట్ల మధ్య విక్టరీ ప్రస్తుతం 3-2గా ఉంది. ఈ మ్యాచ్​లో జీటీ గిల్​ సేన గెలిస్తే.. డిఫరెన్స్​ మరింత పెరుగుతుంది. లేక.. సీఎస్​కే విజయం సాధిస్తే.. రెండు జట్లు సమానం అవుతాయి.

CSK VS GT 2024 : పైగా.. ఐపీఎల్​ 2024లో ఆడిన మొదటి మ్యాచ్​లో ఈ రెండు జట్లు గెలిచాయి. ఆర్​సీబీతో జరిగిన ఓపెనింగ్​ మ్యాచ్​లో సీఎస్​కే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్​పై గెలిచి.. చెన్నైలో ఆత్మ విశ్వాసంతో అడుగుపెట్టింది గుజరాత్​ టైటాన్స్​.

స్టాట్స్​.. పిచ్​ కండీషన్​.. టాస్​..

రషీద్​ ఖాన్​ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్లేయర్స్​లో రుతురాజ్​ గైక్వాడ్​ ఒకరు. 7 ఇన్నింగ్స్​లలో 60 బాల్స్​ ఎదుర్కొని 95 రన్స్​ చేశాడు. యావరేజ్​ 47.గా ఉంది. స్ట్రైక్​ రట్​ 158.3.

ఐపీఎల్​ 2023 నుంచి ఆజింక్య రహానే దూకుడుగా ఆడుతున్నాడు. అతని మొదటి 10 బాల్స్​ స్ట్రైక్​ రేట్​ 158.3గా ఉంది. 2018-2020 వరకు అది 85.1గా ఉండేది.

IPL 2024 today match : సీఎస్​కే మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీకి.. ఉమేశ్​ యాదవ్​ బౌలింగ్​ని చితక బాదడం అలవాటు! 7 ఇన్నింగ్స్​లలో 38 బాల్స్​ని ఎదుర్కొని 68 రన్స్​ చేశాడు. స్ట్రైక్​ రేట్​ దాదాపు 180 దగ్గర ఉంది. ఒక్కసారి మాత్రమే ఔట్​ అయ్యాడు.

ఐపీఎల్​ 2023 నుంచి గుజరాత్​ టైటాన్స్​ బౌలర్లు.. పవర్​ప్లేలో 25 వికెట్లు తీశారు! మరే ఇతర జట్టు కూడా ఇన్ని వికెట్లు తీయలేదు.

పిచ్​ కండీషన్​:- చెపాక్​ స్టేడియం సాధారణంగా స్పీనర్లకు అనుకూలిస్తుంది. కానీ ఐపీఎల్​ 2024 మొదటి మ్యాచ్​లో స్పినర్లు ఇక్కడ ఒక్క వికెట్​ కూడా తీయలేదు! 2015 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మరి ఈ మ్యాచ్​లో ఏం జరుగుతుందో చూడాలి.

టాస్​:- టాస్​ గెలిచిన జట్టు బ్యాటింగ్​ ఎంచుకునే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం