Dhoni CSK captaincy : ‘ధోనీ.. సీఎస్కే కెప్టెన్ కాదని చెప్తే- అందరు ఏడ్చేశారు’
Dhoni CSK captaincy : ఐపీఎల్ 2024లో ధోనీ స్థానంలో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని ఎంపిక చేసింది సీఎస్కే. అయితే.. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని తెలిసి అందరు ఎమోషనల్ అయ్యారట!
MS Dhoni IPL news : మహేంద్ర సింగ్ ధోనీకి.. టోర్నమెంట్స్‌లో కప్‌లు కొట్టి ఫ్యాన్స్‌కి సంతోషాన్ని ఇవ్వడం తెలుసు.. అదే సమయంలో.. సంచలన ప్రకటనలు చేసి బాధపెట్టడమూ తెలుసు! అది టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సమయమైనా, 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడమైనా.. తాజాగా.. ఐపీఎల్ కెప్టెన్సీని వదులుకోవడం విషయంలోనైనా.. ధోనీ అభిమానులకు కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుంది! ఈసారి.. ఇంకాస్త ఎక్కువగానే బాధపడుతున్నారు మహేంద్రుడి ఫ్యాన్స్. ఐపీఎల్ కెప్టెన్సీకి ధోనీ ఇవాళో, రేపో గుడ్ బై చెబుతాడని తెలిసినా, అది నిజంగా జరగడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ 2024కి ముందు..
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు.. కెప్టెన్‌ని మారుస్తున్నట్టు ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో.. ధోనీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు.. 'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా (ఒక శఖం ముగిసింది)' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.
సీఎస్కే క్యాంప్‌లో అయితే పరిస్థితి మరింత కష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మంది ప్లేయర్లు.. ధోనీ తప్పుకోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట! కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్టు.. కోచ్ స్టీఫేన్ ఫ్లెమింగ్ చెప్పినప్పుడు.. చాలా మంది ఎమోషనల్ అయ్యారట. ఓవైపు బాధలో ఉంటూనే.. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు తగ్గడం, కొత్త కెప్టెన్ సారథ్యంలో కొత్త ఛాప్టర్‌ని ప్రారంభించేందుకు ప్లేయర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2024 schedule : "కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్టు చెప్పినప్పుడు.. చాలా మంది ఎమోషనల్ అయ్యారు. చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. అందరు బాధపడ్డారు. గతంలో ధోనీ కప్టెన్సీని వదిలినప్పుడు.. సీఎస్కే సిద్ధంగా లేదు. ఇప్పుడూ చాలా మంది బాధపడ్డారు. అదే సమయంలో.. రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ ఇస్తున్నట్టు చెప్పినప్పుడు.. అందరు సంతోషించారు. రుతురాజ్ పెద్దగా మాట్లాడడు. కానీ జట్టును ముందుండి నడిపించడానికి అతను అర్హుడు," అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి.. ధోనీకి ప్రత్యామ్నాయ కెప్టెన్‌ని సీఎస్కే వెతకడం ఇది మొదటిసారి కాదు. 2022లో అనూహ్య నిర్ణయం తీసుకుని, జడేజాను కెప్టెన్‌గా ప్రకటించింది చెన్నై సూపర్ కింద్స్. కానీ ఆ సీజన్లో జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో, మధ్యలోనే అతను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక 2023లో ధోనీ సారథ్యంలో టోర్నీలోకి వెళ్లిన సీఎస్కే.. కప్ కొట్టింది.
CSK vs RCB : "నిజం చెప్పాలంటే.. కొన్నేళ్ల ముందు మేము సిద్ధంగా లేము (ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిలీవ్ చేయడానికి). కానీ ఆ నిర్ణయం తీసుకోవడంతో కష్టాలు వచ్చాయి. ధోనీ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే, ఎవరు కెప్టెన్ అవ్వాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాము. ఈ విషయంపై చాలా కష్టపడి, అన్ని కోణాల్లోనూ ఆలోచించి, గతంలో చేసిన తప్పులు ఈసారి జరగకుండా చూసుకుంటున్నాము," అని ఫ్లెమింగ్ అన్నాడు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని.. తొలుత సీఎస్కే సపోర్ట్ స్టాఫ్‌కి ధోనీ చెప్పాడట. ధోనీ మాటలు విని వారందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత.. మేనేజ్మెంట్కి తన నిర్ణయాన్ని చెప్పాడట.
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ..
Ruturaj Gaikwad CSK captain : మరోవైపు.. ఐపీఎల్ 2024 నిరీక్షణకు మరికొంత సేపట్లో ముగింపు పడనుంది. చెపాక్ వేదికగా సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. మరో హై ఓల్టేజ్ యాక్షన్ కోసం ఎదురుచూస్తున్నట్టు క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.
సంబంధిత కథనం