CSK vs RCB : ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. ఈసారైనా గెలుస్తుందా?
CSK vs RCB 2024 : హైఓల్టెజ్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మరి ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో గెలిచి.. చెపాక్ జింక్స్ని ఆర్సీబీ వదిలించుకుంటుందా?
IPL 2024 opening ceremony : ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న క్రికెట్ లవర్స్ నిరీక్షణకు ఇంకొన్ని గంటల్లో తెరపడనుంది. పైగా.. ఓపెనింగ్ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుండటంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. చెపాక్‌లో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ స్టాట్స్ ఇక్కడ చూసేయండి..
ఐపీఎల్ 2024- సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ..
ఐపీఎల్ మొత్తంలో ఇప్పటివరకు 31 సార్లు సీఎస్కే- ఆర్సీబీలు తలపడ్డాయి. ఇందులో.. సీఎస్కే 20సార్లు గెలిచింది. ఆర్సీబీ 10సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు.
CSK vs RCB IPL 2024 : ఇక గత ఐపీఎల్ సీజన్లో చిన్నస్వామి వేదికగా జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో ధోనీ సేన 8 పరుగుల తేడాతో విజయం సాధింంచింది. డివోన్ కాన్వాయ్ అద్భుత బ్యాటింగ్.. సీఎస్కేకి కలిసొచ్చింది.
కానీ.. ఆర్సీబీకి చెపాక్ స్టేడియం కలిసి రాలేదని.. స్టాట్స్ చూస్తే అర్థమైపోతుంది. 2008లో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కేపై ఆర్సీబీ గెలిచింది. కానీ అప్పటి నుంచి 7-1 తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది.
2008లో జరిగిన లో- స్కోరింగ్ మ్యాచ్‌లో సీఎస్కేపై ఆర్సీబీ 14 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్సీబీ 126 పరుగులు చేయగా.. సీఎస్కే 112 పరుగులు సాధించి ఓడిపోయింది.
CSK vs RCB stats : ఇక ఐపీఎల్ 2019 ఓపేనర్లో కూడా సీఎస్కే- ఆర్సీబీ తలపడ్డాయి. నాటి మ్యాచ్‌ని కూడా ఆర్సీబీ గుర్తుతెచ్చుకోకూడదని అనుకుంటుంది. 17.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఆర్సీబీ.. 70 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సీఎస్కే.. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే.. 2012 సీజన్లో 'చెపాక్ జింక్స్'కి ఆర్సీబీ దాదాపు ముగింపు పలికింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో 20 ఓవర్లలో 205 సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీఎస్కే బ్యాటింగ్ చూస్తే, ధోనీ సేన ఓటమి ఖాయం అని అందరు అనుకున్నారు. 12 బాల్స్‌లో 43 పరుగులు కొట్టాల్సి ఉంది. ఆ సమయంలో.. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేశాడు. ఒక్క ఓవర్లో 28 పరుగులు చేశాడు ఆల్బీ మార్కెల్. ఒక్క ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉంది. జడేజా, డ్వైన్ బ్రోవోలు పని ముగించారు.
ఐపీఎల్ 2024 ఓపెనర్.. జట్ల అంచనా..
సీఎస్కే- రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, ముకేశ్ చౌదరి, మహీష్ తీక్షణ
IPL 2024 schedule : ఆర్సీబీ- ఫాఫ్ డుప్లెస్సి, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ వైశాఖ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
మరి ఈసారి ఎవరు గెలుస్తారు? ‘చెపాక్ జింక్స్’ని ఆర్సీబీ బ్రేక్ చేస్తుందా? లేక చెపాక్ కోటలో సీఎస్కే విజయం ఖాయమేనా?
సంబంధిత కథనం