MS Dhoni: చెన్నైలో అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ.. ముంజుమెల్ బాయ్స్ పోస్టర్‌ను వాడేసిన సీఎస్‍కే
MS Dhoni IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీ కోసం చెన్నై సూపర్ కింగ్స్(CSK) సిద్ధమవుతోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు చెన్నైలో అడుగుపెట్టాడు.
MS Dhoni IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆ జట్టు ట్రైనింగ్ క్యాంప్ కూడా మొదలుపెట్టేసింది. సీఎస్‍కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే క్యాంప్‍లో జాయిన్ కావాల్సింది. అయితే, అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో భారత మాజీ కెప్టెన్ ధోనీ పాల్గొన్నాడు. జామ్‍నగర్‌లో జరిగిన వేడుకలకు వెళ్లాడు. అయితే, ధోనీ నేడు (మార్చి 5) చెన్నై చేరుకున్నాడు. ఇక ఐపీఎల్ మోడ్‍లోకి మారిపోయేందుకు సిద్ధమయ్యాడు.
చెన్నైలో ధోనీ అడుగుపెట్టాడని సీఎస్‍కే ఫ్రాంచైజీ నేడు అధికారికంగా ప్రకటించింది. తలా దర్శనం.. సూపర్ ఫ్యాన్స్ రెడీనా అంటూ ట్విట్టర్లో పోస్టులు చేసింది. త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‍లో ధోనీ జాయిన్ కానున్నాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో పాటు సీజన్ కోసం వ్యూహాలు రచించనున్నాడు.
ముంజుమెల్ బాయ్స్ పోస్టర్
మలయాళంలో సూపర్ హిట్ అయిన ముంజుమెల్ బాయ్స్ పోస్టర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఉపయోగించింది. చెన్నై ఆటగాళ్లతో ఈ పోస్టర్ రూపొందించింది. గ్యాంగ్ లీడర్‌లా ధోనీ ముందు ఉండగా.. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, రహానే, దీపక్ చాహర్ సహా మరికొందరు ఆటగాళ్లు అడవిలో కూర్చున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
ఆర్సీబీతో తొలి మ్యాచ్
మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 సీజన్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే జరుగనుంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ధోనీని మళ్లీ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ధోనీ సారథ్యంలోని సీఎస్‍కే గతేడాది ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐదో టైటిల్‍తో ఐపీఎల్‍లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌ను చెన్నై సమం చేసింది. ధోనీకి గతేడాదే ఐపీఎల్ చివరి సీజన్ అని చాలా మంది అనుకున్నారు. అయితే, తాను 2024 సీజన్ కూడా ఆడతానని ఫైనల్ సమయంలోనే ధోనీ హింట్ ఇచ్చాడు. 2023 సీజన్ తర్వాత మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న మహీ.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.
ఫ్యాన్స్‌ను ఉత్కంఠలో పెట్టిన ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం ఫేస్‍బుక్‍లో ఓ పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్.. కొత్త రోల్ అంటూ ఆ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఉత్కంఠకు లోనయ్యారు. న్యూరోల్ అంటే అర్థమేంటో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఐపీఎల్‍కు కూడా రిటైర్మెంట్ ప్రకటించి.. సీఎస్‍కేకు ధోనీ కోచ్‍గా లేకపోతే మెంటార్‌గా ఉంటాడా అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, న్యూరోల్‍పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ధోనీ ఎందుకోసం ఆ పోస్ట్ చేశాడో ఇంకా వెల్లడికాలేదు. ఈ తరుణంలోనే చెన్నైలో తలా ల్యాండ్ అయ్యాడు. అతిత్వరలో సీఎస్‍కే ట్రైనింగ్ క్యాంప్‍లో జాయిన్ అయి ప్రాక్టీస్ షురూ చేయనున్నాడు. లాంగ్ హెయిర్‌తో వింటేజ్ లుక్‍లో ఈసారి ఐపీఎల్‍లో కనిపించనున్నాడు ధోనీ.
ఐపీఎల్ 2024 సీజన్‍కు సంబంధించి తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. తొలి 21 మ్యాచ్‍ల షెడ్యూల్ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో రెండు దశలుగా షెడ్యూల్‍ను ప్రకటించాలని నిర్ణయించింది. ఎన్నికల పోలింగ్ తేదీలు వెల్లడయ్యాక.. ఐపీఎల్ 2024 రెండో దశ షెడ్యూల్‍ను బీసీసీఐ వెల్లడించనుంది.