MS Dhoni Dandiya: దాండియా ఆడిన ఎమ్ఎస్ ధోనీ.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో కోచ్‌తో MSD (వీడియో)-ms dhoni dandiya with dwayne bravo in anant ambani radhika merchant pre wedding bash ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Ms Dhoni Dandiya With Dwayne Bravo In Anant Ambani Radhika Merchant Pre Wedding Bash

MS Dhoni Dandiya: దాండియా ఆడిన ఎమ్ఎస్ ధోనీ.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో కోచ్‌తో MSD (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Mar 03, 2024 12:18 PM IST

MS Dhoni Dandiya At Anant Ambani Pre Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దాండియా ఆడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

దాండియా ఆడిన ఎమ్ఎస్ ధోనీ.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో కోచ్‌తో MSD (వీడియో)
దాండియా ఆడిన ఎమ్ఎస్ ధోనీ.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో కోచ్‌తో MSD (వీడియో)

MS Dhoni Dandiya With Dwayne Bravo: గుజరాత్‌లోని జామ్ నగర్ జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ అగ్ర తారలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, బార్బేయన్ సింగర్ రిహన్నాతోపాటు ఎంతోమంది ఈ వేడుకల్లో సందడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

క్రికెట్ దిగ్గజాలు

బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్‌తోపాటు టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు. వీరితోపాటు క్రికెట్ స్టార్స్ కూడా సందడి చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, నికోలస్ పూరన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజ క్రికెటర్లు వేడుకలో పాల్గొన్నారు.

దాండియా ఆడుతూ

ఎమ్ఎస్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. అనంతరం ఈ వేడుకలో మహేంద్ర సింగ్ ధోనీ దాండియా ఆడుతూ కనిపించాడు. సీఎస్కే బౌలింగ్ కోచ్ బ్రావోతో కలిసి ఎమ్ఎస్ దోని ఎంతో సంతోషంగా, సరదాగా దాండియా ఆడాడు. ఈ దాండియా డ్యాన్స్‌లో ధోనీ భార్య సాక్షి కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి షాక్ అయిన అభిమానులు తర్వాత ధోనీ దాండియా ఆడటం చూసి సంతోషించారు.

మూడో రోజుకు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ధోనీ అభిమానులకు ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ధోనీ, సాక్షి నల్ల దుస్తుల్లో వచ్చారు. ఇదిలా ఉంటే బ్రావో బ్లేజర్ లుక్‌లో కనిపించాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మార్చి 1న ప్రారంభమైన ఈ వేడుకలు ఆదివారం (మార్చి 3)తో మూడో రోజుకు చేరుకోనున్నాయి. ఈ వేడుకల్లో తొలి రోజున పాప్ సెన్సేషన్ రిహానాను సింగింగ్ ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్‌తో కలిసి

ఈ వేడుకల్లో షారుక్, సల్మాన్, అమీర్ వంటి ఖాన్ త్రయం నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. అలాగే, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలతో ఎమ్ఎస్ ధోనీ సంభాషించడం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా ధోని ఇంటరాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ధోని ఇప్పుడు ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరోసారి టైటిల్ తీసుకొచ్చేందుకు కృషి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదే తన చివరి ఐపీఎల్ లీగ్ అని ఈ భారత మాజీ సారథి ధోని గత సీజన్ ఫైనల్ తర్వాత హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

WhatsApp channel