MS Dhoni Dhruv Jurel: ధృవ్ జురెల్ మరో ఎమ్ఎస్ ధోనీ.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్-sunil gavaskar praises dhruv jurel is another ms dhoni and street smart keeper in ind vs eng 4th test day 3 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Dhruv Jurel: ధృవ్ జురెల్ మరో ఎమ్ఎస్ ధోనీ.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni Dhruv Jurel: ధృవ్ జురెల్ మరో ఎమ్ఎస్ ధోనీ.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Dhruv Jurel MS Dhoni Sunil Gavaskar: ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు మ్యాచ్‌లో టామ్ హార్ట్‌లీ ఔట్ చేయడానికి ముందు ధృవ్ జురెల్ 90 పరుగులు చేశాడు. ఈ ఆల్‌రౌండర్ నైపుణ్యంపై సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ధృవ్ జురెల్ మరో ఎంఎస్ ధోనీ అంటూ అభివర్ణించారు.

ధృవ్ జురెల్ మరో ఎమ్ఎస్ ధోనీ.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Dhruv Jurel Is Another MS Dhoni: రాంచీ వేదికగా ప్రారంభమైన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మూడో రోజు టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో ధృవ్ జురెల్ 90 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తృటిలో తన ఫస్ట్ సెంచరినీ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో ధృవ్ జురెల్‌పై దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత టెస్ట్ సిరీస్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు.

ధృవ్ జురెల్ అసాధారణ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ సామర్థ్యాలు కలిగి ఉన్నాడని, భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలికలు ఉన్నాయని పొగడ్తల వర్షం కురిపించారు సునీల్ గవాస్కర్. నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు కామెంటరీ సందర్భంగా మాట్లాడిన సునీల్ గవాస్కర్ టీమిండియా ఆటగాడు ధృవ్ జురెల్ మరో ఎంఎస్ ధోనీ అని పేర్కొన్నారు.

కామెంటరీ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "అతను బాగా బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ధృవ్ జురెల్ కీపింగ్, స్టంప్స్ వెనుక అతని ప్రదర్శన కూడా అంతే అద్భుతంగా ఉంది. అతని ఆట అవగాహనను బట్టి, అతను మేకింగ్‌లో మరో ఎంఎస్ ధోనీ అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకెప్పుడూ మరో మహేంద్ర సింగ్ ధోనీ ఉండడని నాకు తెలుసు. కానీ, ఎమ్‌ఎస్‌డీకి ఉన్న ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అతనిలోని తెలివితేటలు, సామర్థ్యత గురించి అతను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుసే ఉంటాయి కదా.అలాంటి ఆట అవగాహనే జురెల్‌కు ఉంది. ధృవ్ జురెల్ స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్" అని అన్నారు.

ప్రస్తుతం సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ను 307 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ 90 పరుగులకే కుప్పకూలింది. ఉదయం సెషన్‌లో షోయబ్ బషీర్ ఒక వికెట్ తీసి టెస్టుల్లో తొలి ఐదు వికెట్లు పడగొట్టాడు. సహచర స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ.. జురెల్‌ను బౌల్డ్ చేసి లంచ్ విరామ సమయానికి ఇన్నింగ్స్ ముగించాడు.

ఆదివారం (ఫిబ్రవరి 25) ఉదయం 219/7 వద్ద ప్రారంభమైన తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్ కోల్పోయే సమయానికి 76 పరుగుల భాగస్వామ్యానికి పెంచారు ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్‌. దీంతో 353 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ను నిరాశపరిచారు. రాజ్ కోట్‌లో జరిగిన మూడో టెస్టుతో ధృవ్ జురెల్ అరంగేట్రం చేశాడు. ఈ నాలుగో టెస్టులో 149 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి తొలి టెస్టు హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేని ఈ టెస్టులో ఈ 23 ఏళ్ల యువ ఆటగాడు ధృవ్ జురెల్ తన ఆట తీరుతో మెరిశాడు.