MS Dhoni New Role: ‘న్యూ రోల్’ అంటూ అభిమానులను టెన్షన్‍లో పెట్టిన ధోనీ.. మళ్లీ ఆ రూమర్లు-ms dhoni says new season and new role in his facebook post this sparks retirement speculations ahead of ipl 2024 season ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni New Role: ‘న్యూ రోల్’ అంటూ అభిమానులను టెన్షన్‍లో పెట్టిన ధోనీ.. మళ్లీ ఆ రూమర్లు

MS Dhoni New Role: ‘న్యూ రోల్’ అంటూ అభిమానులను టెన్షన్‍లో పెట్టిన ధోనీ.. మళ్లీ ఆ రూమర్లు

MS Dhoni New Role: కొత్త సీజన్, కొత్త రోల్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో దీని అర్థం ఏంటని ధోనీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

MS Dhoni New Role: ‘న్యూ రోల్’ అంటూ అభిమానులను టెన్షన్‍లో పెట్టిన ధోనీ

MS Dhoni Facebook Post: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చూసేందుకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం అతడి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈనెల (మార్చి) 22వ తేదీన ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గతేడాది ఐపీఎల్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. ఐదు టైటిళ్లతో ఐపీఎల్‍లో అత్యంత సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ముంబై ఇండియన్స్‌ను చెన్నై సమం చేసింది. ఐపీఎల్ 2023 తర్వాత ఐపీఎల్‍కు కూడా ధోనీ రిటైర్మెంట్ ఇస్తాడని చాలా రూమర్లు వచ్చాయి. అయితే, తాను ఆడడం కొనసాగిస్తానని, ఐపీఎల్ 2024 ఆడొచ్చని ధోనీ చెప్పాడు.

ఈ ఏడాది ఐపీఎల్ కోసం ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ 2024లో మార్చి 22న తొలి మ్యాచ్‍లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలోనే ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ధోనీని ఐపీఎల్‍లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఐపీఎల్ సుమారు మరో మూడు వారాల్లో మొదలుకానుండగా.. నేడు (మార్చి 4) ధోనీ చేసిన ఫేస్‍బుక్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

కొత్త సీజన్.. కొత్త రోల్

మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేస్‍బుక్ అకౌంట్‍లో నేడు ఓ పోస్ట్ పెట్టాడు. “కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఎదురుచూడలేకున్నా.స్టే ట్యూన్డ్!” అని ధోనీ పోస్ట్ చేశాడు. అయితే, ‘న్యూ రోల్’ ఏంటనే విషయంపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

రూమర్లు షూరూ

‘న్యూరోల్’ అంటూ ఎస్ఎం ధోనీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కాసేపటికే తీవ్రంగా వైరల్ అవుతోంది. అతడు రిటైర్మెంట్ ప్రకటించి.. చెన్నై జట్టుకు కోచ్‍గా ఉంటాడనే రూమర్ మొదలైంది. రిటైర్మెంట్ ఇచ్చి షాక్ ఇవ్వొద్దని చాలా మంది ధోనీని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు.

న్యూరోల్ అంటే చెన్నైకు మెంటార్‌గా ఉంటారని కూడా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు కెప్టెన్సీ వేరే ప్లేయర్‌కు ఇచ్చి.. ఆటగాడిగా ధోనీ ఆడొచ్చని కామెంట్లు చేస్తున్నారు.

మొత్తంగా.. ‘న్యూరోల్’ అని పోస్ట్ చేసి అభిమానుల్లో టెన్షన్ పెంచారు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ పోస్ట్ తర్వాత చాలా రూమర్లు చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా ధోనీ.. ఐపీఎల్‍కు ఎక్కడ రిటైర్మెంట్ ప్రకటిస్తాడోనని చాలా మంది ఆందోళన పడుతున్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలకు మహేంద్ర సింగ్ ధోనీ హాజరయ్యారు. తన భార్య సాక్షితో కలిసి వెళ్లారు. చాలా మంది సెలెబ్రెటీలు.. ధోనీతో కలిసి దిగిన ఫొటోలు బయటికి వచ్చాయి. దాండియా కూడా ఆడారు తలా. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍, ధోనీ కలిసిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టింది. పేసర్ దీపక్ చాహర్ సహా మరికొందరు లోకల్ ప్లేయర్లు ఈ క్యాంప్‍లో పాల్గొంటున్నారు. త్వరలో ధోనీ కూడా సీఎస్‍కే క్యాంప్‍కు వెళ్లనున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‍కు సంబంధించి తొలి 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ వెల్లడించింది. మార్చి 22న తొలి మ్యాచ్‍లో బెంగళూరు, చెన్నై తలపడనున్నాయి.