IPL 2024 points table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది.. టాప్‌లోకి కేకేఆర్-ipl 2024 points table kkr moved to the top of the table after win over lsg csk on third sunrisers on 4th ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది.. టాప్‌లోకి కేకేఆర్

IPL 2024 points table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది.. టాప్‌లోకి కేకేఆర్

Hari Prasad S HT Telugu
May 06, 2024 07:38 AM IST

IPL 2024 points table: ఐపీఎల్లో ఆదివారం (మే 5) డబుల్ ధమాకా తర్వాత పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది. కేకేఆర్ టాప్ లోకి దూసుకెళ్లగా.. సీఎస్కే మరోసారి టాప్ 4లోకి వచ్చింది.

ఐపీఎల్ పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది.. టాప్‌లోకి కేకేఆర్
ఐపీఎల్ పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది.. టాప్‌లోకి కేకేఆర్ (ANI )

IPL 2024 points table: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న దశలో పాయింట్ల టేబుల్లో ప్రతి విజయం ఆయా టీమ్స్ స్థానాలను తారుమారు చేస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ పై విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 98 పరుగులతో గెలిచి కేకేఆర్ తమ నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపరచుకుంది.

yearly horoscope entry point

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్

ఐపీఎల్ 2024లో నాలుగు వారాలుగా టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానానికి పడిపోయింది. కేకేఆర్ సాధించిన భారీ విజయంతో ఆ టీమ్ ఈ సీజన్లో తొలిసారి టాప్ పొజిషన్ లోకి వెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత చేజింగ్ లో చేతులెత్తేసిన లక్నో టీమ్ 16.1 ఓవర్లలో 137 రన్స్ కే కుప్పకూలింది.

బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (39 బంతుల్లో 81), బౌలింగ్ లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి (మూడేసి వికెట్లు) రాణించడంతో కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత కేకేఆర్ పాయింట్ల టేబుల్లో 11 మ్యాచ్ లు, 8 విజయాలు, 16 పాయింట్లు, 1.453 నెట్ రన్ రేట్ తో టాప్ లోకి వెళ్లింది. ఈ సీజన్లో కేకేఆర్ నెట్ రన్ రేట్ మాత్రం మొదటి నుంచీ ఒకటికిపైగా ఉండటం విశేషం.

మూడో స్థానానికి చెన్నై సూపర్ కింగ్స్

ప్లేఆఫ్స్ కు అడుగు దూరంలో ఉండగా.. తమ 10వ మ్యాచ్ లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. రెండోస్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 8 విజయాలు, 16 పాయింట్లు, 0.622 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. ఇక ఆదివారమే (మే 5) జరిగిన మరో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టాప్ 4లోకి దూసుకొచ్చింది.

ఈ విజయంతో సీఎస్కే 11 మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లు, 0.700 నెట్ రన్ రేట్ తో మూడో స్థానానికి వచ్చింది. సన్ రైజర్స్ నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఆ టీమ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లు, 0.072 నెట్ రన్ రేట్ తో ఉంది. సీఎస్కేతో మ్యాచ్ లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ మ్యాచ్ లలో 6 విజయాలు, 12 పాయింట్లు, -0.371 నెట్ రన్ తో ఉంది.

ఇక ఆరు నుంచి పది స్థానాల్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు టీమ్స్ తప్ప మిగిలిన 8 జట్లు లీగ్ స్టేజ్ లో 11 మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు వారాల్లో లీగ్ స్టేజ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ నాలుగు టీమ్స్ తర్వాతి రౌండ్ కు వెళ్తాయన్నది చెప్పడం కష్టంగా మారింది.

ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో చివరి స్థానాల్లో ఉన్న జట్ల నుంచి టాప్ 4లోని టీమ్స్ కు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్స్ ఆశలు వదులుకున్న ముంబై, గుజరాత్, పంజాబ్, ఆర్సీబీలాంటి టీమ్స్ సాధించే సంచలన విజయాలు ఈసారి ప్లేఆఫ్స్ జట్లు ఏవో తేల్చనున్నాయి.

Whats_app_banner