IPL 2024 Six Matches: తొలి ఆరు మ్యాచ్‍ల్లో హోం టీమ్‍లదే గెలుపు: వివరాలివే-home teams won in all the first six matches in ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Six Matches: తొలి ఆరు మ్యాచ్‍ల్లో హోం టీమ్‍లదే గెలుపు: వివరాలివే

IPL 2024 Six Matches: తొలి ఆరు మ్యాచ్‍ల్లో హోం టీమ్‍లదే గెలుపు: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 26, 2024 04:56 PM IST

IPL 2024 First Six Matches: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‍ల్లో హోం టీమ్‍లే గెలిచాయి. సొంత మైదానాల్లో విజయం నమోదు చేశాయి. ఆ వివరాలివే..

IPL 2024 Six Matches: తొలి ఆరు మ్యాచ్‍ల్లో  హోం టీమ్‍లదే గెలుపు: వివరాలివే
IPL 2024 Six Matches: తొలి ఆరు మ్యాచ్‍ల్లో  హోం టీమ్‍లదే గెలుపు: వివరాలివే (AFP)

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 22న ఈ సీజన్ మొదలుకాగా.. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍లు జరిగాయి. ఇందులో కొన్ని మ్యాచ్‍లు ఉత్కంఠ భరితంగా సాగాయి. అయితే, ఐపీఎల్‍ 2024లో ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‍ల్లో.. హోం టీమ్‍లే గెలిచాయి. దీంతో ఆరు జట్లు పాయింట్ల పట్టికలో బోణీ చేశాయి. నాలుగు టీమ్‍లు ఈ సీజన్‍లో ఫస్ట్ విన్ కోసం వేచిచూస్తున్నాయి.

ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు తమ హోం గ్రౌండ్‍ల్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS), కోత్‍కతా నైట్‍రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించాయి. ఆ మ్యాచ్‍ల వివరాలివే..

  • చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ 2024 సీజన్‍లో మార్చి 22న తొలి మ్యాచ్ జరిగింది. తన హౌం గ్రౌండ్ చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో సీఎస్‍కే 6 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. పాయింట్ల ఖాతా తెరిచింది.
  • పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మార్చి 23వ తేదీన మధ్యాహ్నం తలపడ్డాయి. పంజాబ్ హోం గ్రౌండ్‍గా ఉన్న ముల్లాన్‍పూర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‍లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది.
  • మార్చి 23న రాత్రి సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కోల్‍కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ పోరు సాగింది. ఈ ఉత్కంఠ మ్యాచ్‍లో హోం టీమ్ కోల్‍కతా 4 పరుగుల తేడాతో హైదరాబాద్‍పై విజయం సాధించింది.
  • రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్లు జట్లు ఈ సీజన్‍లో తమ తొలి మ్యాచ్‍ను మార్చి 24న మధ్యాహ్నం ఆడాయి. రాజస్థాన్ హోం అయిన జైపూర్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్‍లో రాజస్థాన్ 20 రన్స్ తేడాతో లక్నోపై గెలిచింది.
  • తన హోం గ్రౌండ్ అహ్మదాబాద్‍లో మార్చి 24 రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఈ ఉత్కంఠ పోరులో హోం టీమ్ గుజరాత్ 6 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించి.. బోణీ కొట్టింది.
  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మార్చి 25న మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో హోం టీమ్ ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇలా ఐపీఎల్ 2024 సీజన్ తొలి ఆరు మ్యాచ్‍ల్లో హోం టీమ్‍లే విజయం సాధించాయి.

చెన్నై, గుజరాత్ పోరు నేడు

CSK vS GT: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు (మార్చి 26) తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో చెన్నై గెలిస్తే.. ఈ సీజన్‍లో హోం టీమ్‍ల విన్నింగ్ రన్ కొనసాగినట్టవుతుంది.

హైదరాబాద్ ఫస్ట్ హౌమ్ మ్యాచ్

ఐపీఎల్ 2024లో కోల్‍కతాలో జరిగిన తన తొలి మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. అయితే, ఈ సీజన్‍లో మార్చి 27న తన హోం గ్రౌండ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్‍ఆర్‌హెచ్ ఆడనుంది. ఆరోజు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. హోం గ్రౌండ్‍లో గెలిచి ఈ సీజన్‍లో బోణీ చేయాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది.

74 మ్యాచ్‍లు..

ఐపీఎల్ 2024 సీజన్‍లో మొత్తంగా 74 మ్యాచ్‍లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‍లు ఆడుతుంది. 7 మ్యాచ్‍లు హోం గ్రౌండ్‍లో.. 7 మ్యాచ్‍లు ఇతర స్టేడియాల్లో ఆడనుంది. మే 19 వరకు లీగ్ దశ మ్యాచ్‍లు ఉంటాయి. మే 21 నుంచి ప్లేఆఫ్స్ ఉంటాయి. మే 21 క్వాలిఫయర్-1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్-2, మే 26న ఫైనల్ జరగనున్నాయి.

Whats_app_banner