Deccan Chronicle : విశాఖ స్టీల్ ప్లాంట్ కథనం, డీసీ ఆఫీసుపై దాడి-ఖండించిన జగన్, కౌంటర్ ఇచ్చిన లోకేశ్-visakhapatnam tdp activists attacked deccan chronicle office jagan condemn lokesh countered ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Deccan Chronicle : విశాఖ స్టీల్ ప్లాంట్ కథనం, డీసీ ఆఫీసుపై దాడి-ఖండించిన జగన్, కౌంటర్ ఇచ్చిన లోకేశ్

Deccan Chronicle : విశాఖ స్టీల్ ప్లాంట్ కథనం, డీసీ ఆఫీసుపై దాడి-ఖండించిన జగన్, కౌంటర్ ఇచ్చిన లోకేశ్

Bandaru Satyaprasad HT Telugu
Jul 10, 2024 10:08 PM IST

Attack On Deccan Chronicle : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని డెక్కన్ క్రానికల్ కథనం ప్రచురించింది. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీసు వద్ద నేమ్ బోర్డుకు నిప్పుపెట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కథనం, డీసీ ఆఫీసుపై దాడి-ఖండించిన జగన్, కౌంటర్ ఇచ్చిన లోకేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కథనం, డీసీ ఆఫీసుపై దాడి-ఖండించిన జగన్, కౌంటర్ ఇచ్చిన లోకేశ్

Attack On Deccan Chronicle : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు మద్దతు ఉందని డెక్కన్ క్రానికల్ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఏపీలో కలకలం రేపింది. ఇదంతా బ్లూ మీడియా కుట్ర అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలోని డెక్కన్ క్రానికల్ ఆఫీసు ముందు నిరసన తెలిపి, ఆ సంస్థ నేమ్ బోర్డుకు నిప్పుపెట్టారు. ఈ వీడియోను పోస్టు చేసిన డెక్కన్ క్రానికల్ టీడీపీ గూండాలు మా సంస్థ ఆఫీసుపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బోర్డుకు నిప్పు పెట్టిన వీడియోను పోస్టు చేస్తూ...నిష్పక్షపాతంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కథనాన్ని ప్రచురిచామన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడమని ట్వీట్ చేసింది.

పిరికపంద చర్య - జగన్

విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేసశారు. టీడీపీ నిష్పక్షపాతంగా ఉన్న మీడియాను అణిచివేసేందుకు చేస్తోన్న మరో ప్రయత్నం ఇదంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం నిరంతరం ఉల్లంఘనకు గురవుతోందని, ఈ ఘటనలు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు.

వైసీపీ పెయిడ్ ఫిక్షన్ - మంత్రి లోకేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కథనంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యూటర్న్ తీసుకుందని తప్పుడు కథనం ప్రచురించి, ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో డెక్కన్ క్రానికల్ పెయిడ్ ఫిక్షన్ రాసిందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. టీడీపీ ఇచ్చిన హామీని నెరవేరుస్తుందన్నారు. ఏపీని నాశనం కోరుకునే బ్లూ మీడియా సృష్టించిన ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏపీ ప్రజలను కోరుతున్నానన్నారు. ఈ నెల 5వ తేదీన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించేలా కృషి చేస్తుందన్నారు. 9వ తేదీన కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకుందని కథనం రాసిందని లోకేశ్ ట్వీట్ చేశారు.

దాడిని ఖండించిన లోకేశ్

వైజాగ్ లోని డెక్కన్ క్రానికల్ డిస్‌ప్లే బోర్డుపై జరిగిన దాడిని మంత్రి నారా లోకేశ్ ఖండించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని అభ్యర్థించారు. పక్షపాతంతో కుమ్మక్కై ఇలాంటి వార్తలను రాస్తున్న బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కానీ దాడులు చేయడం సరికాదన్నారు. టీడీపీ సైతం ఈ కథనంపై స్పందిస్తూ.. డెక్కన్ క్రానికల్ సంస్థ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ 'వెల్ ప్లేయ్డ్' అంటూ ట్వీట్ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం