Flood On Highway: విజయవాడ-హైదరాబాద్‌ హైవే మీద వరద.. నిలిచిన రాకపోకలు-traffic on vijayawada hyderabad national highway blocked due to flood ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood On Highway: విజయవాడ-హైదరాబాద్‌ హైవే మీద వరద.. నిలిచిన రాకపోకలు

Flood On Highway: విజయవాడ-హైదరాబాద్‌ హైవే మీద వరద.. నిలిచిన రాకపోకలు

HT Telugu Desk HT Telugu
Jul 28, 2023 05:47 AM IST

Flood On Highway: మునేరు పొంగి ప్రవహిస్తుండటంతో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మునేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వాహనాలను గుంటూరు మీదుగా హైదరాబాద్ మళ్లించారు.

జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ
జాతీయ రహదారిపై వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ

Flood On Highway: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ఉపనది మునేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద చేరింది. గురువారం సాయంత్రం నుంచి జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మంలో కురిసిన వర్షం మునేరులో పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల మండలం కీసర సమీపంలో ఎన్టీఆర్‌ జిల్లాలోకి మునేరు ప్రవేశిస్తుంది. జాతీయ రహదారిపైకి వరద చేరడంతో సాయంత్రం నుంచి వాహనాలను నిలిపివేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి హైవేపై రెండు వైపులా వాహనాలను నిలిపివేశారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలను గుంటూరు వైపుకు మళ్ళించారు.రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ నగరాల మధ్య కీసరగ్రామంలోని NH 65 హైవేపై వాహనాలు నిలిపివేశారు. మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున వాహనముల రాకపోకలకు నిలిపివేసినట్లు విజయవాడ పోలీసులు ప్రకటించారు.

హైదరాబాద్ – విజయవాడ, విజయవాడ – హైదరాబాద్ ల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల క్షేమం కోరి వాహనములను అనుమతించడం లేదని ప్రకటించారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ – నార్కెట్ పల్లి – మిర్యాలగూడ – దాచేపల్లి – పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి – విశాఖపట్నంకు వెళ్లాలని సూచించారు.

విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్ళాలని ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు మార్పు గమనించాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ సమాచారం కోసం పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాల్సిందిగా సూచించారు.

మరోవైపు వరద ప్రభావ ప్రాంతాలను, హైదరాబాద్ - విజయవాడ హైవేపై వరద పరిస్థితులను ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్ గున్ని ఐ.పి.యస్ పరిశీలించారు.

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాల కారణంగా వాగుల వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తునంధున ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కారణంగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ మండలం కీసర టోల్ గేట్ దాటిన తరువాత ఐతవరం వద్ద హైవే మీద భారీగా నీరు చేరింది. ముందస్తు రక్షణ చర్యలలో భాగముగా రహదారిని మూసి వేశారు. వరదలో చిక్కకున్న వారిని క్రేన్ సహాయంతో రక్షించారు.

హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు నందిగామ మీదగా ప్రయాణించే అవకాశం లేనందున హైదరాబాద్ నుండి వస్తున్న వాహనాలు ప్రత్యామ్నయ మార్గం ద్వారా విజయవాడ చేరుకోవాలని సూచించారు.

Whats_app_banner