Andhra Pradesh News Live November 18, 2024: AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?-today andhra pradesh news latest updates november 18 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 18, 2024: Ap Mega Dsc Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?

AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?

Andhra Pradesh News Live November 18, 2024: AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?

03:56 PM ISTNov 18, 2024 09:26 PM HT Telugu Desk
  • Share on Facebook
03:56 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 18 Nov 202403:56 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?

  • AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం కానుందని సమాచారం. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202402:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Aadhaar Camps : గిరిజ‌న ప్రాంతాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు, ఈ నెలలోనే 8 రోజుల పాటు అందుబాటులో

  • Aadhaar Camps : రాష్ట్రంలో గిరిజ‌న ప్రాంతాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌ల‌ను నిర్వహించ‌నున్నారు. న‌వంబ‌ర్ నెల‌లోనే రెండు సార్లు ఎనిమిది రోజుల పాటు ఈ క్యాంప్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వ‌ర‌కు ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోని వారు, ఈ క్యాంపుల్లో స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202401:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Jobs : పల్నాడు జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌- డిసెంబర్ 2 ఆఖ‌రు తేదీ

  • Palnadu Jobs : పల్నాడు జిల్లా ప‌రిధిలో మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు డిసెంబర్ ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు.  

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202412:49 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega City : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మెగా సిటీకి ప్రభుత్వం ప్లాన్.. ఆకాశమే హద్దుగా భూములకు ధరలు!

  • AP Mega City : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే కీలక ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. వాటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగా సిటీని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202411:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Assembly Bills : ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే-ఏడు కీలక బిల్లులు ఆమోదం

  • AP Assembly Bills : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వీటిల్లో కీలకమైన మున్సిపల్ సవరణ బిల్లు ఉంది. ఈ సవరణతో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హత లభించినట్లైంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202411:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Board Decisions : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు-తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం

  • TTD Board Decisions : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించింది. అలాగే శారదాపీఠం లీజు రద్దు చేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202410:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఫిబ్రవరి కోటా దర్శనం టికెట్లు విడుదల

  • Tirumala Tickets : వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా దర్శనం, గదుల టికెట్లపై టీటీడీ అప్ డేట్ ఇచ్చింది. నేటి నుంచి దర్శనం టికెట్లను క్రమంగా విడుదల చేయనున్నారు. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. ఈ నెల 20 వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202409:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Scholarships : కాలేజీ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌, పోస్టుమెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌లకు దరఖాస్తులు స్వీకరణ

  • AP Scholarships : కాలేజీ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు నవంబర్ 30 వ‌ర‌కు గ‌డువు విధించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202409:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paddy Procurement : ఏపీలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ

  • AP Paddy Procurement : ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు ఏపీ సర్కార్ సాంకేతికను వినియోగిస్తుంది. అలాగే ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని అధికారులు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202409:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : ఆర్టీసీలో 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల ఖాళీలు.. అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

  • APSRTC : ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ఆర్టీసీలో ఏకంగా 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల కొరత ఉందని స్వయంగా మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీలో వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202408:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Senior Citizen : సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, టికెట్లపై 25 శాతం రాయితీ- ఏ కార్డులు చూపించాలంటే?

  • APSRTC Senior Citizen Concession : ఏపీఎస్ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు బస్సు టికెట్ పై 25 శాతం రాయితీ ఇస్తు్న్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని పేర్కొంది. సీనియర్ సిటిజన్లు తమ వయస్సు నిర్థారణకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు ఏదోకటి చూపించవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202406:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : కార్తీకమాసం స్పెషల్.. ఒకేరోజు తొమ్మిది క్షేత్రాల సందర్శన.. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులు

  • AP Tourism : కార్తీకమాసంలో శైవ క్షేత్రాల సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. ఏపీలో చాలాచోట్ల శివాలయాలు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని దేవాలయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకేరోజు 9 శివాలయాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయాల దర్శనం సర్వపాప హరణం అని పెద్దలు చెబుతారు. ఆ ఆలయాలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202406:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RGV Quash petition: ఆర్జీవీ క్వాష్‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, గడువు కావాలంటే పోలీసుల్ని ఆశ్రయించాలని సూచన

  • RGV Quash petition: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు చుక్కెదురైంది.  అసభ్యకర పోస్టుల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా  పోలీసుల నోటీసుల నేపథ్యంలో  కేసు కొట్టేయాలని  ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202403:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: KGBV Students: తరగతులకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించిన కేజీబీవీ స్పెషలాఫీసర్

  • KGBV Students: అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం కొత్తూరు గ్రామంలోని కస్తూర్బగాంధీ బాలిక విద్యాలయంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేసి తరగతులకు ఆలస్యంగా వెళ్లారని స్పెషలాఫీసర్ విద్యార్థినుల జుట్టు కత్తిరించడంపై కలకలం రేగింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 18 Nov 202402:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Student Murder: గుంటూరులో ఘోరం, 9వ తరగతి విద్యార్థిని హత్య చేసిన సహ విద్యార్థులు, కేసు నమోదులో పోలీసుల తాత్సారం

  • Student Murder: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అమరావతి మండలం పొన్నేకల్లులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సహవిద్యార్థుల చేతిలో హత్యకు గురయ్యాడనే ఆరోపణలు వస్తున్నా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థిని స్నేహితులు కొట్టి చంపేసి బావిలో పడేశారు. 
పూర్తి స్టోరీ చదవండి