డయాబెటిస్ ఉన్న వారిలో తరచూ ఎదుర్కొనే సమస్యల్లో పురుషాంగం ముందరి చర్మం బిగుతుగా మారడం ఒకటి.ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. దీనికి చిట్కా వైద్యాలు కూడా పనిచేస్తాయి.
By Bolleddu Sarath Chandra Nov 18, 2024
Hindustan Times Telugu
పురుషాంగం ముందరి చర్మం బిగుతుగా మారినపుడు తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొంటారు. లైంగిక కలయిక బాధాకరం అవుతుంది. భరించలేని నొప్పి, రక్తస్రావం కూడా జరగొచ్చు.
పురుషాంగం ముందరి చర్మం బిగుతుగా మారడానికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లే ప్రధాన కారణం. స్త్రీలలో కూడా ఈ తరహా సమస్య వచ్చినా పురుషులతో పోలిస్తే బాధాకరంగా ఉండదు. డయాబెటిస్ రోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
పురుషాంగం ముందరి చర్మం బిగుతుగా మారడం, మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది కలగొచ్చు. మర్మాంగాలను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
మధ్య వయస్కులు, డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. డయాబెటిస్ లేని వారిలో కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. ప్రధానంగా పరిశుభ్రతతో దీనిని అధిగమించవచ్చు.
పురుషాంగం ముందరి చర్మం ఎందుకు బిగుతుగా మారుతుందో తెలియక చాలామంది ఆందోళనకు గురవుతారు. సమస్య ప్రాథమిక దశలో ఉన్నపుడు ఆయింట్‌మెంట్, లుబ్రికేషన్ జెల్స్ ఉపయోగపడతాయి.
పురుషాంగం బిగుతుగా మారినపుడు దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో మరిగించి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దాల్చిన చెక్క ఔషధంగా పనిచేస్తుంది.
సురక్షితం కానీ లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం, లైంగిక సంక్రమణ ద్వారా వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి.
పురుషాంగం ముందరి చర్మం బిగుతుగా మారడానికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ , బాక్టీరియాలు ప్రధాన కారణం, ఈ సమస్యకు ఇప్పుడు ఆధునిక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. సున్తీగా పిలిచే స్టెప్లర్ సర్జరీతో ముందరి చర్మాన్ని తొలగించడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
శరీరంలో కొన్ని చోట్ల చర్మం సహజమైన రంగుని కోల్పోయి, చర్మం రంగు తెల్లగా మారిపోతుంది.చర్మం సహజమైన రంగును కోల్పోవడం జబ్బు కాదు. వయసు పెరిగే కొద్దీ జట్టు నెరిసినట్టే చర్మం రంగు కూడా కొందరిలో మారుతుంది.