OTT: ఓటీటీలోకి నాలుగు వందల కోట్ల బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT: బాలీవుడ్ లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ సింగం అగైన్ అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ సెకండ్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. సింగం అగైన్‌లో అజయ్‌దేవ్‌గణ్,అక్షయ్‌కుమార్, రణ్‌వీర్‌సింగ్ హీరోలుగా నటించారు.
OTT: బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన సింగం అగైన్ మూవీ అగైన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. ఈ యాక్షన్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోణ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కీలక పాత్రల్లో నటించారు. సింగం ఫ్రాంచైజ్‌లో భాగంగా రూపొందిన రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్‌లో...
సింగం అగైన్ మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 130 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం.
సింగం అగైన్ మూవీ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. తొలుత రెంటల్ విధానంలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ వీక్ నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చెబుతోన్నారు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్...
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ నవంబర్ 1న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా థియేటర్లలో మాత్రం ఈ మూవీ అదరగొడుతోంది.
పద్దెనిమిది రోజుల్లో 350 కోట్ల కలెక్షన్స్ రాబ్టటింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూడో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఇండియా వైడ్‌గా అత్యధిక వసూళ్లను దక్కించుకున్న ఆరో సినిమాగా సింగం అగైన్ నిలిచింది.
కాప్ యూనివర్స్...
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో భాగంగా ఐదో సినిమాగా సింగం అగైన్ తెరకెక్కింది. రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని రోహిత్ శెట్టి సింగం అగైన్ కథను రాసుకున్నారు. డీసీపీ బాజీరావ్ సింగం (అజయ్ దేవ్‌గణ్) శివ స్క్వాడ్ పేరుతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మాఫియాను అంతం చేస్తుంటాడు.
శ్రీలంక మాఫియా డాన్ జుబేర్ హఫీజ్ బాజీరావ్ భార్య అవనిని కిడ్నాప్‌చేస్తాడు. అవనిని జుబేర్ నుంచి రక్షించే క్రమంలో బాజీరావ్‌కు సింబ (రణ్‌వీర్‌సింగ్) సూర్య వంశీ(అక్షయ్ కుమార్), శక్తిశెట్టి (దీపికా పదుకోణ్) ఎలాంటి సాయం చేశారు? అనే అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రోహిత్ శెట్టి ఈ మూవీని తెరకెక్కించారు.
రోహిత్ శెట్టి టేకింగ్
రోహిత్ శెట్టి మేకింగ్...సింగం అగైన్ మూవీకి సంబంధించి కథతో పాటు రోహిత్ శెట్టి టేకింగ్‌పై దారుణంగా విమర్శలు వచ్చాయి. కాప్ యూనివర్స్‌ను ఇకనైనా రోహిత్ శెట్టి ఆపేస్తే మంచిదంటూ నెటిజన్లు నెగెటివ్ ట్వీట్స్ చేశారు.