వెయిట్ లాస్ కోసం కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే 6 రకాల ఫుడ్స్
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Nov 18, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలని అనుకునే వారు కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను డైట్‍లో తినాలి. దీంతో వెయిట్ లాస్‍కు తోడ్పడతాయి. తక్కువ కార్బొహైడ్రేట్లు (కార్బ్స్) ఉండే 6 ఫుడ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo; Pexels
పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో కార్బొహైడ్రేట్లు అతితక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. అందుకే వీటిని వెయిట్ లాస్ డైట్‍లో తీసుకోవాలి.
Photo; Pexels
సాల్మన్, సార్డైన్స్, మాకెెరెల్ చేపల్లో కార్బ్స్ అల్పంగా ఉంటాయి. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలం. దీంతో బరువు తగ్గేందుకు ఈ చేపలు తినడం ఉపయోగపడుతుంది.
Photo; Pexels
అవిసె, చియా గింజల్లో కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు డైట్‍లో వీటిని చేర్చుకోవాలి.
Photo; Pexels
వాల్‍నట్స్, బాదంపప్పుల్లో కార్బొహైడ్రేట్లు చాలా తక్కువగా.. ఫైబర్ అధికంగా ఉంటుంది. మెగ్నిషియం, ఫోలెట్, ఒమేగా-3 ఫ్యాట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.
Photo; Freepik
యాపిల్స్, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, నారింజ, అవకాడో, పుచ్చకాయ లాంటి పండ్లలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ సహా పోషకాలు కూడా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo; Pexels
కోడిగుడ్లలోనూ కార్బోహైడ్రేట్లు అత్యల్పంగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్ సహా ఇతర కీలకమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ కావాలనుకునే వారు డైట్‍లో గుడ్లను తప్పనిసరిగా తినాలి.