RGV Quash petition: ఆర్జీవీ క్వాష్ పిటిషన్‌పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, గడువు కావాలంటే పోలీసుల్ని ఆశ్రయించాలని సూచన
RGV Quash petition: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసుల నేపథ్యంలో కేసు కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
RGV Quash petition: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదల సందర్భంగా ఆర్జీవి అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల విచారణపై జోక్యం చేసుకోడానికి ధర్మాసనం నిరాకరించింది. మంగళవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారని దీనిపై గడువైనా ఇవ్వాలని ఆర్జీవి తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు.
పోలీసుల విచారణకు హాజరు కావడానికి గడువు కావాలంటే దానికి పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. కేసు నమోదు చేయడంపై అభ‌్యంతరం ఉంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. పోలీసుల విచారణకు తగినంత సమయం లేదని భావిస్తే గడువు కావాలని పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. పోలీసుు తగిన విధంగా స్పందిస్తారని చెప్పారు. ఆర్జీవీ క్వాష్ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.