Andhra Pradesh News Live October 8, 2024: UK Visa Fraud : యూకే వీసాలు ఇప్పిస్తామని భారీ మోసం, నిరుద్యోగ యువత వద్ద కోట్లలో కాజేసిన వైనం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 08 Oct 202405:10 PM IST
- UK Visa Fraud : గుంటూరుకు చెందిన ఓ వీసా కన్సల్టెన్సీ భారీ మోసానికి పాల్పడింది. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఫేస్ వీసాలు, ఉద్యోగ పత్రాలు ఇచ్చి రూ.10 కోట్లకు పైగా దోచేసింది. ఫేక్ వీసాలని తెలయడంతో బాధితులు కన్సెల్టెన్సీ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని తెలుస్తోంది.
Tue, 08 Oct 202403:20 PM IST
- Vijayawada Lawyers Bus Accident : రాజస్థాన్ లో విజయవాడ లాయర్ల బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గుళ్ళపల్లి జ్యోత్స్న మృతి చెందారు. జ్యోత్స్న మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Tue, 08 Oct 202412:47 PM IST
- Amaravati Real Estate: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదో నెల వచ్చేసింది.ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదురుకుంటుందనే అంచనాలు తప్పయ్యాయి. మార్కెట్ మందికొడితనం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా నిర్మాణ రంగాన్ని వేధిస్తున్నాయి.
Tue, 08 Oct 202412:34 PM IST
- Hindupur : అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకుని.. హిందూపురం మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీకి చుక్కెదురైంది. ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
Tue, 08 Oct 202412:28 PM IST
- GATE 2025 : ఐఐటీ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 11 వరు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ ఓ ప్రకటనలో తెలిసింది.
Tue, 08 Oct 202410:33 AM IST
Pithapuram Crime : కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త అత్యాచారం చేశాడు. బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా మద్యం పట్టించి, ఆపై బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఓ మహిళ సహకరించింది.
Tue, 08 Oct 202409:51 AM IST
- Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఇష్యూపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో.. తాజాగా డిప్యూటూ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం అమానుషం అని వ్యాఖ్యానించారు.
Tue, 08 Oct 202409:27 AM IST
- Eluru Fraud: ఇస్రోలో ఉన్నతోద్యోగినంటూ నమ్మించి ఐదో పెళ్లికి రెడీ అయిన కేటుగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 9వ తరగతి మాత్రమే చదివిన నిందితుడు మోసాలు చేస్తూ జల్సా జీవితం గడిపేస్తున్నాడు. నిందితుడిగా బంధువులుగా వ్యవహరిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Tue, 08 Oct 202409:22 AM IST
Rajampet Boy Died : అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రి బెడ్ పై విగతజీవిగా పడిఉన్న చిన్నారి పక్కనే పడుకుని, లే నాన్న ఇంటికి వెళ్లిపోదాం అంటూ ఆ తల్లి పలికిన మాటలు చూపరులు కన్నీటి పర్యంతం చేశాయి.
Tue, 08 Oct 202408:22 AM IST
- LIC Policy Surrender : ఎల్ఐసీ పాలసీ తీసుకుని, కొన్ని ప్రీమియంలు కట్టి ఆ తర్వాత కట్టకుండా వదిలేశారా? అయితే ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల మేరకు మీరు ఒక ఏడాది ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత మానేసినా..చెల్లించిన ప్రీమియంలో 80-85 శాతం తిరిగి చెల్లించాలి. ఎల్ఐసీ పాలసీ ఎలా సరెండర్ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Tue, 08 Oct 202407:18 AM IST
- Hud Hud Cyclone : విశాఖపట్నం.. ఓవైపు సముద్రతీరం.. మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటి సిటీపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడింది. నగరమంతా కకావికలమైంది. ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. విశాఖలో హుద్ హుద్ సృష్టించిన బీభత్సానికి పదేళ్లు నిండాయి.
Tue, 08 Oct 202406:29 AM IST
- NTR Collector And Ganta: దుర్గగుడిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సింహాచంలో మాజీ మంత్రి గంటా ప్రసాదాలను ఎంగిలి చేశారంటూ వివాదం రాజుకుంది.ఏపీలో కాదేదీ వివాదాలకు అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవలి పరిస్థితి. లడ్డూ పోటులో ప్రసాదాల తయారీని పరిశీలిస్తూ కలెక్టర్ ప్రసాదాన్ని రుచి చూసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Tue, 08 Oct 202405:11 AM IST
- Bapatla : బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేనని అన్నందుకు ఓ బాలికపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఆ బాలిక కుటుంబంపైనా దాడికి తెగబడ్డాడు. అర్ధరాత్రి సమయంలో కత్తి.. సుత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Tue, 08 Oct 202404:17 AM IST
- Visakha Train Timings: అక్టోబర్ 15నుంచి విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లు గమ్యస్థానం చేరే సమయాల్లో మార్పులు చేశారు. అక్టోబర్ 15 నుంచి 18వరకు పలు రైళ్లు విశాఖ జంక్షన్ చేరుకునే సమయంలో మార్పులు చేస్తున్నట్టు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.
Tue, 08 Oct 202403:57 AM IST
- Liquor Syndicates: వైన్‌షాపుల వేలంలో సిండికేట్ల హవా నడుస్తోంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు మొదలు కానుండటంతో వాటిని దక్కించుకోడానికి లిక్కర్ సిండికేట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. నియోజక వర్గాల వారీగా నాయకులు దుకాణాలను పంచేసుకుని బయటి వారిని దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు.
Tue, 08 Oct 202402:47 AM IST
- Onions And Tomato Prices: ఠారెత్తిన్న ఉల్లి, టమాటాలను సబ్సిడీ ధరలకు విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా సబ్సిడీ ధరలకే ఉల్లిపాయలు, టమాటాలను విక్రయించాలని నిర్ణయించారు.
Tue, 08 Oct 202401:34 AM IST
- CBN In Delhi: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబర్ నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కేకే లైన్ మినహా అరకు వరకు విశాఖ డివిజన్‌లోనే కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేడు కూడా కొనసాగనుంది.
Tue, 08 Oct 202412:41 AM IST
- SriMahaLakshmi Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.