GATE 2025 : గేట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు- అక్టోబర్ 11 చివరి తేదీ-iit roorkee extended gate 2025 registration last up to october 11th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gate 2025 : గేట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు- అక్టోబర్ 11 చివరి తేదీ

GATE 2025 : గేట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు- అక్టోబర్ 11 చివరి తేదీ

Bandaru Satyaprasad HT Telugu
Oct 08, 2024 06:27 PM IST

GATE 2025 : ఐఐటీ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 11 వరు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ ఓ ప్రకటనలో తెలిసింది.

గేట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు- అక్టోబర్ 11 చివరి తేదీ
గేట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు- అక్టోబర్ 11 చివరి తేదీ

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు సహా పలు విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2025) పరీక్ష నిర్వహిస్తున్నారు. గేట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ఆలస్య రుసుముతో అభ్యర్థులు అక్టోబర్ 11 తేదీ వరకు గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు అక్టోబర్‌ 7 ముగియగా... తాజాగా ఈ గడువును అక్టోబర్‌ 11 పొడిగించినట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది.

ఐఐటీలు, ఇతర విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్డీ ప్రవేశాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో గేట్ -2025 పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంటర్వ్యూలకు గేట్ స్కోర్ కీలకం. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో (https://gate2025.iitr.ac.in/)దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు

ఏపీలోని చిత్తూరు, గుంటూరు, కడప, చీరాల, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కోదాడ, కరీంనగర్, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌ లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీలలో రోజుకు రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, అడ్మిట్ కార్డులు తర్వాలో జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్‌లో డిగ్రీ ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో మూడో సంవత్సరంలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్ డిగ్రీలకు సమానమైన ఎంవోఈ, ఏఐసీటీఈ, యూజీసీ లేదా యూపీఎస్సీ ఆమోదించే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్‌ చేసినవారు గేట్ రాసేందుకు అర్హులు.

Whats_app_banner

సంబంధిత కథనం