Visakha Train Timings: అక్టోబర్ 15 నుంచి విశాఖ రైళ్ల టైమింగ్‌లో మార్పు.. ఇవే ఆ రైళ్లు
Visakha Train Timings: అక్టోబర్ 15నుంచి విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లు గమ్యస్థానం చేరే సమయాల్లో మార్పులు చేశారు. అక్టోబర్ 15 నుంచి 18వరకు పలు రైళ్లు విశాఖ జంక్షన్ చేరుకునే సమయంలో మార్పులు చేస్తున్నట్టు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.
Visakha Train Timings: విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకునే రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్టు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణ సమయంలో మార్పులను ప్రయాణికులు గమనించాలని కోరారు.
● అక్టోబర్ 15వ తేదీ నుంచి న్యూఢిల్లీ-విశాఖపట్నం(20806) ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖకు తెల్లవారు 4.10 గంటలకు బదులుగా 4.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 22 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం(22848) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారు 5 గంటలకు బదులుగా 5.10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారు 5.45 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి కోర్బా-విశాఖపట్నం(18517) ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.25 గంటలకు బదులుగా 6.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్15 నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం (12740) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.40 గంటలకు బదులుగా 7.50 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి మచిలీపట్నం-విశాఖపట్నం (17219) ఎక్స్‌ప్రెస్ ఉదయం 8.10 గంటలకు బదులుగా 8.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి నాందేడ్ -విశాఖపట్నం (20812) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.10 గంటలకు బదులుగా 9.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి బ్రహ్మపూర్-విశాఖపట్నం (08531) పాసింజర్ స్పెషల్ ఉదయం 9.20 గంటలకు బదులుగా 9.30 గంటలకు చేరుకుంటుంది.
●అక్టోబర్ 15 నుంచి కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (17267) ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.30 గంటలకు బదులుగా 9.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 19 నుంచి భగత్ కి కోటి-విశాఖపట్నం (18574) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.50 గంటలకు బదులుగా 10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి భవానిపట్న-విశాఖపట్నం (08503) పాసింజర్ స్పెషల్ ఉదయం 10 గంటలకు బదులుగా 10.10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి గాంధీదాం-విశాఖపట్నం (20804) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.10 గంటలకు బదులుగా 10.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి దుర్గ్-విశాఖపట్నం (18529) ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.20 గంటలకు బదులుగా 10.30 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.30 గంటలకు బదులుగా 10.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం (18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.40 గంటలకు బదులుగా 10.50 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి హజరత్ నిజాముద్దీన్-విశాఖపట్నం (12804)స్వర్ణజయంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా 2.45 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి రాయ్‌పూర్-విశాఖపట్నం (08527) పాసింజర్ స్పెషల్ రాత్రి 6.40 గంటలకు బదులుగా 7 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి కిరండూల్-విశాఖపట్నం (08552) పాసింజర్ స్పెషల్ రాత్రి 8.20 గంటలకు బదులుగా 8.45 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి గుణుపూర్-విశాఖపట్నం (08521) పాసింజర్ స్పెషల్ రాత్రి 8.45 గంటలకు బదులుగా 9 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.31 గంటలకు బదులుగా 11.35 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 18 నుంచి కొల్లాం-విశాఖపట్నం (18568) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.40 గంటలకు బదులుగా 11.45 గంటలకు చేరుకుంటుంది.