Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల-tirumala srivari arjita seva tickets for the month of august are released today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
May 18, 2024 07:21 AM IST

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల దర్శన టికెట్లు
తిరుమల దర్శన టికెట్లు

Tirumala Srivari Arjitha Seva Tickets 2024: ఆగస్టు నెలకు సంబంధించి ఇవాళ తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల కానుంది. ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఈ టికెట్లను  టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in  లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్జిత సేవా టికెట్లు మాత్రమే కాకుండా… పలు రకాల సేవలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా టీటీడీ ప్రకటించింది.

ఎలక్ట్రానిక్ డిప్ టికెట్ల షెడ్యూల్…

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొంది. శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు వార్షిక ప‌విత్రోత్స‌వాలు నిర్వహించనున్నారు. సేవా టికెట్లను మే 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

మే 21న వర్చువల్ సేవల కోటా విడుదల…

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

మే 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు :

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా :

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా :

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.

మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల :

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌ :

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల :

మే 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుదల చేస్తారు. ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. h

ttps://ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ తెలిపింది.

టీ20 వరల్డ్ కప్ 2024