IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!-visakhapatnam to tirupati tirumala kanipakam srikalahasti irctc air tour package full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

Bandaru Satyaprasad HT Telugu
May 11, 2024 01:40 PM IST

IRCTC Tirupati Tour Package : తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు మూడ్రోజుల ఎయిర్ టూర్ ప్యాకేజీ ఐఆర్సీటీసీ అందిస్తోంది. విశాఖ నుంచి తిరుపతికి ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

విశాఖ నుంచి తిరుపతి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!
విశాఖ నుంచి తిరుపతి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

IRCTC Tirupati Tour Package : తిరుమల శ్రీవారిని ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అయితే తిరుమల దర్శనం అంత సులభం మాత్రం కాదు, దర్శన టికెట్లు, వసతి సదుపాయం ఇలా ఎంతో వ్యయప్రయాసలతో కూడుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐఆర్సీటీసీ తిరుమల శ్రీవారి దర్శనం, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు పర్యటనల ప్యాకేజీ అందిస్తోంది. రూ.17 వేల ప్రారంభ ధరలో విశాఖపట్నం నుంచి తిరుపతి ఎయిర్ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల పాటు ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ.

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి ప్రముఖ దేవాలయ పట్టణం. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శంచుకుంటారు. తిరుమల కొండపై అద్భుతమైన ఆలయం, కొండ దిగువల తిరుపతి పట్టణం ఉంటాయి. తిరుమల ఆలయం, తిరుపతి పట్టణంలోని అనేక దేవాలయాలు దాని పరిసరాలు ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తాయి. తిరుపతి చెక్క బొమ్మలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఒక రకమైన ఎర్రటి చెక్కతో ఇక్కడ బొమ్మలను తయారు చేస్తారు.

విమాన వివరాలు

తేదీసెక్టార్ఫ్లైట్ నెం.బయలుదేరు సమయంచేరుకునే సమయం
24.05.2024VTZ-TIR6E706310.25 AM12.10 PM
26.05.2024TIR-VTZ6E70645.00 PM6.35 PM

ఒక్కో వ్యక్తికి ధర

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 years)చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 Years)
కంఫర్ట్రూ.21290రూ.17920రూ.17730రూ.16105రూ.15610

2 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులకు రూ. 1500 నేరుగా విమానాశ్రయ కౌంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలతో పాటు పలు దేవాలయాల దర్శనాలకు భక్తులు తప్పనిసరి డ్రెస్ కోడ్ పాటించాలి.

  • జెంట్స్ : ధోతీ (తెలుపు), షర్టులు లేదా కుర్తాలు, పైజామా
  • లేడీస్ : చీర లేదా సల్వార్ ఖమీజ్
  • పర్యాటకులు ఆలయాల దర్శన సమయాల్లో టీ-షర్టులు, జీన్స్ దుస్తులను ధరించకూడదు.

టూర్ సర్క్యూట్‌లు వివరాలు : విశాఖపట్నం - తిరుపతి - కాణిపాకం - శ్రీనివాస మంగాపురం - శ్రీకాళహస్తి - తిరుచానూరు - తిరుమల - తిరుపతి - గోవిందరాజస్వామి ఆలయం - ఇస్కాన్ ఆలయం - విశాఖపట్నం

టూర్ వివరాలు :

  • డే 01 : (24.05.2024) : విశాఖపట్నం -తిరుపతి

విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి పికప్ చేసి హోటల్ లో చెక్-ఇన్ చేస్తారు. హోటల్‌లో ఫ్రెష్ అవుతారు. భోజనం చేసిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం సందర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్లోనే బస చేస్తారు.

  • డే 02 : (25.05.2024) - తిరుపతి

హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. దర్శనం తర్వాత లంచ్ చేసి, శ్రీకాళహస్తి, తిరుచానూరు సందర్శనకు తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్ బస చేస్తారు.

  • డే 03 : (26.05.2024) : తిరుపతి -విశాఖపట్నం

బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ దేవాలయం సందర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం