Brutal Murder: భర్తను కేసులో ఇరికిద్దామని.. అమాయకురాలిని చంపేసిన జంట-the couple who killed the innocent woman wanted to implicate the husband in the case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Brutal Murder: భర్తను కేసులో ఇరికిద్దామని.. అమాయకురాలిని చంపేసిన జంట

Brutal Murder: భర్తను కేసులో ఇరికిద్దామని.. అమాయకురాలిని చంపేసిన జంట

Sarath chandra.B HT Telugu
Jan 17, 2024 11:27 AM IST

Brutal Murder: విజయవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కేసులో ఇరికించడానికి ఓ అమాయకురాలి ప్రాణం తీసి కటకటాల పాలయ్యారు.

భర్తను ఇరికించడానికి అమయాకురాలి హత్య
భర్తను ఇరికించడానికి అమయాకురాలి హత్య

Brutal Murder: అనైతిక సంబంధాన్ని కొనసాగించడానికి అమాయకురాలి ప్రాణాలు బలితీసిన జంట చివరకు పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటనలో రెండు కుటుంబాల్లో చిన్నారులు తల్లి లేని వారయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోతే మరొకరు జైలు పాలయ్యారు.

yearly horoscope entry point

ప్రియుడి మోజులో భర్తను హత్య కేసులో ఇరికించేందుకు అమాయకురాలిని హత్య చేసిన జంటను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు మండలం కానూరులోని వ్యవసాయ మోటరు షెడ్డులో జరిగిన గరిగల నాగమణి(32) హత్య కేసును పోలీసులు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని ప్రియుడు, ప్రియురాలు పన్నిన పన్నాగం వికటించి చివరకు జైలు పాలయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడుకు చెందిన ఐతాబత్తుల మృదులాదేవి, రవీంద్రలు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రవీంద్ర ఓ ప్రైవేటు కంపెనీలో డిప్యూటీ మేనేజరు‌గా పనిచేస్తున్నాడు. మృదులా దేవి నగరంలోని ఓ బాడీకేర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది.

మృదులా పనిచేసే సెంటర్‌కు తరచూ వచ్చే కృష్ణలంకకు చెందిన పోలాసి సాయిప్రవీణ్‌తో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబం ధానికి దారి తీసింది. రెండేళ్ల నుంచి సాయిప్రవీణ్, మృదులా దేవిలు పలుమార్లు ఇతర ప్రాంతాలకు పరారవడం, తిరిగి కొన్నాళ్లకు భర్త వద్దకు చేరుకోవడం జరుగుతుండేది.

పారిపోయి… ఇంటికి వచ్చి…

ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారి మృదులాదేవి తాను మారిపోయాయని, క్షమించాలని భర్త రవీంద్రకు మాయ మాటలు చెప్పేది. కొన్నాళ్లు సవ్యంగానే ఉన్నా ఆ తర్వాత విలువైన వస్తువులు, నగదు తీసుకొని మళ్లీ పరారయ్యేది. ఈ నేపథ్యంలో రవీంద్ర, మృదుల దంపతుల చిన్న కుమారుడు తీవ్ర మధుమేహానికి గురయ్యాడు. కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో భర్త రవీంద్ర భార్యకు ఫోన్ చేసి కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించాడు. ఇంటికి వచ్చేయాలని వేడుకున్నాడు.

భర్త తనను ఇంటికి రమ్మని ఒత్తిడి చేస్తాడనే అనుమానంతో శాశ్వతంగా భర్తను వదిలించుకోవాలని ప్రియుడుతో కలిసి ప్లాన్ చేసింది. భర్త రవీంద్రను ఏదైనా హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని, ఆ కేసును చూపి భర్త నుంచి పొందవచ్చని భావించారు.

దీంతో నిందితుడు సాయిప్రవీణ్ గతంలో తన ఇంట్లో అద్దెకున్న గరిగెల నాగమణిని చంపేసి ఆ నేరాన్ని రవీంద్రపైకి నెట్టేయాలని గతేడాది డిసెంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. నాగమణితో మాట్లాడుతూ నమ్మకంగా నటించడం మొదలు పెట్టాడు. మృదులాదేవి భర్త వద్దకు వెళ్లిపోయి తాను మారిపోయినట్టు నటించడం చేయసాగింది. సాయిప్రవీణ్ పలుసార్లు నాగమణిని తనను, తన ప్రియురాలిని ఎలాగైనా కలపేందుకు సహాయపడాలని ప్రాధేయపడ డంతో నాగమణి అంగీకరించింది.

నమ్మించి నయవంచన…

ఈ నెల 13వ తేదీన నాగమణి భర్త కిరణ్ గోపాల్ ఏలూరు వెళ్లాడని తెలుసు కున్న సాయిప్రవీణ్.. తన పథకం అమలు చేశాడు. నాగమణిని ఎనికేపాడు రప్పించాడు. మృదులాదేవి భర్తకు సంబంధించిన కొన్ని మాటలను రికార్డు చేయాలంటూ కానూరు వందడుగుల రహదారిలోని ఓ వ్యవ సాయబావి షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ నుంచి మృదులాదేవికి ఫోన్ చేయించాడు. ఆమె ఫోన్లోనే రవీంద్ర తనను మోసం చేశాడని, తనను శారీరకంగా వాడుకుని తన బంగారం కూడా తాకట్టు పెట్టుకున్నాడని తనకు ఏదైనా హాని జరిగితే రవీంద్రే కారణమంటూ మాట్లాడించి వాయిస్ రికార్డు చేయించాడు. వాయిస్ రికార్డు పూర్తి కాగానే నాగమణిపై దాడి చేసి చున్నీని పీకకు బిగించి చంపేశాడు.

పట్టించిన వాయిస్ మెసేజీలు..

నాగమణి చనిపోయిన తర్వాత ఆమె ఫోన్‌ నుంచి నాగమణి భర్త కిరణ్ గోపాల్‌, ప్రియురాలు మృదులా దేవిలకు రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ లు పంపాడు. వీటిని అడ్డు పెట్టి భర్తను బెదిరించాలని మృదులా దేవికి సూచించాడు. నాగమణి ఫోన్‌ నుంచి వెళ్లిన మెసేజీలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు.

మృదుల భర్త రవీంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. తన భార్య అక్రమ సంబంధం వ్యవహారాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో మృదులాదేవిని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకొని ప్రశ్నించడంతో గుట్టు బయటపడింది.

హత్యకు పాల్పడిన సాయిప్రవీణ్, పథక రచన చేసిన మృదులాదేవి, వీరికి సహకరించిన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన మూర్తిబాబులపై హత్య కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో హాజ రుపర్చగా నిందితులకు రిమాండ్ విధిం చింది. సాయి ప్రవీణ్‌ హత్య చేసిన నాగమణికి ఇద్దరు కుమారులు తల్లి లేని వారయ్యారు. అతని ప్రియురాలు మృదుల పిల్లలు కూడా తల్లికి దూరమయ్యారు. కేసును చేధించిన పెనమలూరు పోలీసుల్ని అధికారులు అభినందించారు.

Whats_app_banner