TTD Jobs 2024 : టీటీడీలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే
Tirumala Tirupati Devasthanam Lecturer Jobs 2024: టీటీడీలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మార్చి 27వ తేదీ వరకు అప్లికేషన్లను సమర్పించుకోవచ్చు.
TTD Degree Lecturers Jobs 2024 : టీటీడీకి అనుబంధంగా ఉన్న కాలేజీలతో పాటు ఓరియంటర్ కళాశాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(TTD Degree Lecturers Jobs) విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 31వ తేదీన ఈ ఉద్యోగ ప్రకటన రాగా… ఇందులో డిగ్రీ లెక్చరర్,ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 78 పోస్టులు ఉండగా…. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్(Degree Lecturers Jobs) పోస్టులు ఉండగా… ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఇవాళ్టి (మార్చి 6) నుంచి ప్రారంభమైంది. మార్చి 27 వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ(APPSC ) తెలిపింది.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఏపీపీఎస్సీ
ఉద్యోగాలు - టీటీడీలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు
ఉద్యోగాల ఖాళీలు - డిగ్రీ లెక్చరర్(49) - బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు - ఏపీకి చెందినవారై ఉండాలి. హిందూ మతానికి చెంది తగిన విద్యార్హతలు ఉండాలి. పీజీ, నెట్/ స్లెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అవుతారు.
జీతం - నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370.
దరఖాస్తులు - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
డిగ్రీ లెక్చరర్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 07,2024
డిగ్రీ లెక్చరర్ దరఖాస్తులకు తుది గడువు - మార్చి 27,2024.
ఆన్ లైన్ అప్లికేషన్ల లింక్ - https://applications-psc.ap.gov.in/LoginNew.aspx
మరో 4 ఉద్యోగ నోటిఫికేషన్లు…
APPSC Notifications 2024: మరోవైపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు (Notification) వెలువడ్డాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (Forest Range Officers), స్టాటస్టికల్ ఆఫీసర్లు (Statistical Officers), ఫిషరిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ Fisheries Development, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (Electrical Inspector) పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్‌స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ వివరాలు, అర్హతలు, వయోపరిమితి, సిలబస్ ఇతర వివరాలను నోటిఫికేషన్ డాక్యుమెంట్‌లో ప్రకటించనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు
-37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరిస్తారు.
-ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జోన్ 1లో 8 ఖాళీలు, జోన్ 2లో 11ఖాళీలు, జోన్ 3లో 10, జోన్ 4లో 8ఖాళీలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 37 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
-మొత్తం పోస్టుల్లో ఓసీ అభ్యర్థులకు 14, బిసి ఏ అభ్యర్థులకు 3, బిసి బి అభ్యర్థులకు 3, బిసి సి అభ్యర్థులకు 1, బిసి డి అభ్యర్దులకు 4, బిసి ఈ అభ్యర్ధులకు 2, ఎస్సీ అభ్యర్థులకు 7, ఎస్టీ అభ్యర్థులకు 1, ఈడబ్ల్యుఎస్ కోటాలో 3 పోస్టులు ఉన్నాయి.
-అభ్యర్థులు అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వికలాంగుల్ని ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటించారు.
-అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజుగా రూ.250, ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులు రూ.120 చెల్లించాలి. ఫీజుల్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
-ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో స్క్రీనింగ్, మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
మిగిలిన పోస్టులు….
5 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. స్టాటస్టికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన అర్హతలు, జోన్ల వారీగా ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
నాలుగు ఫిషరీష్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులకు ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, జోన్ల వారీగా ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
మూడు ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలను నోటిఫికేషన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో గత కొద్ది రోజులుగా వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల భర్తీని చేపడుతున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.