TREIRB DL Results 2024 : గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - జాబితా ఇలా చెక్ చేసుకోండి-treirb announced degree lecturer results check the full list are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Treirb Dl Results 2024 : గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - జాబితా ఇలా చెక్ చేసుకోండి

TREIRB DL Results 2024 : గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - జాబితా ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 01:57 PM IST

TREIRB Degree Lecturer Results 2024: డిగ్రీ అధ్యాపక పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు(TREIRB) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారి హాల్ టికెట్ల వివరాలను వెబ్ సైట్ లో పేర్కొంది. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

డిగ్రీ లెక్చరర్ ఫలితాలు
డిగ్రీ లెక్చరర్ ఫలితాలు (https://treirb.cgg.gov.in/home)

TREIRB Degree Lecturer Results 2024: డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(Telangana Residential Educational Institutions Recruitment Board.). బుధవారం ఎంపికైన వారి ఫలితాలను విడుదల చేసింది. 22 సబ్జెక్టులకు 700 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పేర్కొంది. అయితే దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. https://treirb.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించింది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఫిబ్రవరి రెండో వారంలో ప్రకటించింది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలను పూర్తి చేసింది. డెమో పరీక్షల తర్వాత…. తుది జాబితాను ప్రకటించింది.

ఇలా చెక్ చేసుకోవచ్చు….

డిగ్రీ అధ్యాపక పోస్టుల పరీక్ష రాసిన అభ్యర్థులు https://treirb.cgg.gov.in/home వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Provisional selection list of Degree Lecturers లింక్ పై క్లిక్ చేయాలి.

ఇందులో 22 సబ్జెక్టులకు సంబంధించి ఎంపికైన వారి హాల్ టికెట్లు ఉన్నాయి.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి పీడీఎఫ్ కాపీని పొందవచ్చు.