TREIRB TGT JL DL Results 2024 : టీఎస్ గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలివే!-hyderabad news in telugu treirb tgt jl dl results 2024 released check merit list certificates verification dates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Treirb Tgt Jl Dl Results 2024 : టీఎస్ గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలివే!

TREIRB TGT JL DL Results 2024 : టీఎస్ గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలివే!

Bandaru Satyaprasad HT Telugu
Feb 26, 2024 08:25 AM IST

TREIRB TGT JL DL Results 2024 : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ప్రకటించారు.

టీఎస్ గురుకుల టీజీటీ ఫలితాలు
టీఎస్ గురుకుల టీజీటీ ఫలితాలు

TREIRB TGT JL DL Results 2024 : తెలంగాణ సంక్షేమ గురుకులాల టీజీటీ పోస్టుల ఫలితాలు(TREIRB TGT 2024 Results) విడుదల అయ్యాయి. గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులకు ఇటీవల రాత పరీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఈ నెల 27, 28 తేదీల్లో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. అయితే సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జాబితా, ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/home లో పొందుపరిచింది. మెరిట్ అభ్యర్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌, ఆదివాసీ కుమురంభీం భవన్‌, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన ఇలా (TGT Certificates Verification)

ఫిబ్రవరి 27న- బంజారాభవన్‌లో ఇంగ్లిష్‌ సబ్జెక్టు అభ్యర్థులు, ఆదివాసీ భవన్‌లో ఉదయం బయోసైన్స్‌ అభ్యర్థులకు, మధ్యాహ్నం జనరల్‌ సైన్స్‌ అభ్యర్థులకు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం సోషల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన చేస్తారు.

ఫిబ్రవరి 28న- బంజారాభవన్‌లో గణితం అభ్యర్థులు, ఆదివాసీ భవన్‌లో ఫిజికల్‌ సైన్స్‌ అభ్యర్థులకు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం హిందీ, మధ్యాహ్నం హిందీ, ఉర్దూ, సంస్కృతం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ తుది ఫలితాలు(TREIRB JL DL Results 2024)

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 2717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల తుది జాబితాను(TREIRB TGT JL DL Final List) రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఆదివారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినా సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు 2023 ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను నియామక బోర్డు ఈ నెల రెండో వారంలో విడుదల చేసింది. మెరిట్ జాబితా ఆధారంగా ఈ నెల 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో తరగతులు నిర్వహించింది. వీటిలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా గురుకుల నియామక బోర్డు తుది ఫలితాలను వెల్లడించనుంది. దీంతో పాటు దివ్యాంగుల కేటగిరీకి చెందిన తుది ఫలితాలు మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం