TREIRB JL Results 2024 : గురుకుల జూ.లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల, ఈ నెల 19-22 మధ్య సర్టిఫికెట్ల పరిశీలన-hyderabad news in telugu welfare gurukula jr lecturer posts results released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Treirb Jl Results 2024 : గురుకుల జూ.లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల, ఈ నెల 19-22 మధ్య సర్టిఫికెట్ల పరిశీలన

TREIRB JL Results 2024 : గురుకుల జూ.లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల, ఈ నెల 19-22 మధ్య సర్టిఫికెట్ల పరిశీలన

Bandaru Satyaprasad HT Telugu
Feb 17, 2024 06:40 PM IST

TREIRB JL Results 2024 : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డెమో తరగతులు నిర్వహించనున్నారు.

గురుకుల జూ.లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలు
గురుకుల జూ.లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలు (Pixabay)

TREIRB JL Results 2024: తెలంగాణలో సంక్షేమ గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల రాత పరీక్షల ఫలితాలు(TREIRB JL Result 2024) విడుదలయ్యాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలన, డెమో క్లాసులకు ఎంపిక చేసింది గురుకుల నియామక బోర్డు. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి 22 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్లను పరిశీలించి, డెమో తరగతులు నిర్వహించనున్నారు. అయితే ఫలితాలను అధికారులు అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి తెలియజేస్తున్నారు. అభ్యర్థులు ఫోన్ లో అందుబాటులో లేకపోతే సంక్షేమ గురుకుల సొసైటీ సిబ్బందిని అభ్యర్థుల ఇంటికి పంపించి సమాచారం అందిస్తున్నారు.

వచ్చే వారంలో టీజీటీ ఫలితాలు

ఇక గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల(TREIRB TGT Results) విడుదలకు నియామక బోర్డు కసరత్తు చేస్తుంది. వచ్చే వారంలో రిజల్ట్స్ విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. టెట్‌, సెంట్రల్‌ సెట్‌ అర్హత తప్పనిసరి కావడంతో ఆ వివరాలు సేకరిస్తుంది బోర్డు. టీజీటీ రాత పరీక్ష ఫలితాలు విడుదల అనంతరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి తుది ఫలితాలు విడుదల చేయనుంది. గురుకులాల నియామక బోర్డు గతేడాది 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ధ్రువీకరణకు సమర్పించాల్సిన సర్టిఫికెట్లు

  • చెక్‌లిస్ట్ (1 సెట్).
  • హాల్ టికెట్
  • పుట్టిన తేదీ సర్టిఫికేట్ (SSC మార్క్స్ లిస్ట్)
  • కాన్వకేషన్, సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు (గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్)
  • 1 నుంచి 7వ తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్, నివాసం/నేటివిటీ (ప్రైవేట్‌గా లేదా ఓపెన్ స్కూల్‌లో చదివిన విద్యార్థులు)
  • తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ (కుల ధృవీకరణ పత్రం)
  • తండ్రి పేరుతో BC కమ్యూనిటీ అభ్యర్థులకు నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్
  • తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన తాజా EWS సర్టిఫికేట్.
  • PH అభ్యర్థులు సదరం సర్టిఫికేట్
  • ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు NOC సర్టిఫికెట్
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ సర్టిఫికేట్
  • అభ్యర్థుల వయో సడలింపును క్లెయిమ్ చేసే సర్టిఫికెట్
  • మాజీ సైనికులు సంబంధిత ధ్రువ పత్రాలు

పూర్తి వివరాలకు అభ్యర్థులు TREI-RB వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in ను సందర్శించవచ్చు. ధ్రువీకరణ పత్రాలు, మరిన్ని వివరాల కోసం https://treirb.cgg.gov.in లో కూడా చెక్ చేయవచ్చు.

టీఎస్పీఎస్సీ ఉద్యోగాల ఫలితాలు

తెలంగాణలో కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడ్ అందుకుంటోంది. ఇటీవలే గ్రూప్ 4 ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించగా… తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (GRL)ను వెబ్ సైట్ లో ఉంచింది.తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి ఉద్యోగ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు 2022లో రాగా… గతేడాది పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేయటం, వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం….తాజాగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో త్వరలోనే జాబితాలను ప్రకటించనట్లు తెలిపింది. కమిషన్ అధికారిక https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో వీటిని చెక్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం