TREIRB Recruitment : గుడ్ న్యూస్... గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Gurukulam Notification 2023: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు సొసైటీ పరిధిలో ఖాళీగా మొత్తం 9231 పోస్లుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలను పేర్కొంది.
Telangana Gurukulam Notification 2023 Updates: ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ప్రాథమిక వివరాలతో కూడిన ప్రకటనలు విడుదలయ్యాయి. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 12వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పోస్టుల వివరాలు :
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4090
లైబ్రేరియన్ స్కూల్- 434
పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ - 275
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ -134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్- 92
మ్యూజిక్ టీచర్స్- 124
ఏప్రిల్ 12వ తేదీ నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ మల్లయ్యభట్టు ఓ ప్రకటనలో తెలిపారు. https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత… భారీ సంఖ్యలో గురుకులాలను పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడేళ్ల క్రితమే ఆయా గురుకులాల్లో 10 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 3వేల పోస్టులను కూడా భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.