TS Gurukulam TGT Jobs: 4 వేల టీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు-telangana gurukulam tgt notification 2023 released check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam Tgt Jobs: 4 వేల టీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు

TS Gurukulam TGT Jobs: 4 వేల టీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 02:08 PM IST

Telangana Gurukulam Job Updates 2023: టీజీటీ(TGT) ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఈ మేరకు ఖాళీలు, అర్హతలు, దరఖాస్తుల తేదీలను పేర్కొంది.

తెలంగాణ గురుకులం టీజీటీ ఉద్యోగాలు
తెలంగాణ గురుకులం టీజీటీ ఉద్యోగాలు

Telangana Gurukulam PGT Notification 2023: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులు ఉన్నాయి. తాజాగా టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, అర్హతలతో పాటు ముఖ్య తేదీల వివరాలను పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తులు ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 300 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్‌-2లో బోధన పద్ధతులపై 100మార్కులు కేటాయించారు. పేపర్‌-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అర్హత వయసు 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి స్కేల్ ఆఫ్ పే రూ.42,300 - రూ.1,15,270 ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. www.treirb.telangana.gov.in లింక్ తో ఓటీఆర్ తో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

TSPSC తరహాలోనే...

టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఓటీఆర్ విజయవంతమైంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

గురుకులాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4006

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… భారీ సంఖ్యలో గురుకులాలను పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడేళ్ల క్రిత‌మే ఆయా గురుకులాల్లో 10 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో 3వేల పోస్టులను కూడా భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం